తెలుగు న్యూస్  /  ఫోటో  /  Nara Lokesh Padayatra: మీసం మెలేసిన లోకేశ్... వైసీపీ మూకల సంగతి చూస్తామంటూ వార్నింగ్

Nara Lokesh Padayatra: మీసం మెలేసిన లోకేశ్... వైసీపీ మూకల సంగతి చూస్తామంటూ వార్నింగ్

22 February 2023, 21:28 IST

Nara Lokesh Yuvagalam:నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధి మీదుగా వెళ్తోంది. మరోవైపు ఆయన పర్యటనలో పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఆంక్షల పేరుతో పలు ప్రాంతాల్లో రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో బుధవారం కూడా ఇలాగే జరగటంతో... నారా లోకేశ్ పోలీసులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

  • Nara Lokesh Yuvagalam:నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధి మీదుగా వెళ్తోంది. మరోవైపు ఆయన పర్యటనలో పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఆంక్షల పేరుతో పలు ప్రాంతాల్లో రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో బుధవారం కూడా ఇలాగే జరగటంతో... నారా లోకేశ్ పోలీసులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
పోలీసుల తీరుపై నారా లోకేష్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఓర్పు, సహనాన్ని పరీక్షించొద్దంటూ లోకేష్ మీసం మెలేశారు. చంద్రబాబు ఒక చిటికె వేస్తే వైసీపీ మూకల సంగతి ఇప్పుడే చూస్తామని తనదైన స్టెల్ లో మాట్లాడారు. ఇందుకు సంబంధించి వీడియో కూడా తెగ వైరల్ అవుతోంది. 
(1 / 4)

రీకాళహస్తిలోని బడా చోర్ ఏమేమి దోపిడీ చేస్తున్నాడో తనకు తెలుసన్నారు. ఏపీలో చట్టాలు కొందరికి చుట్టాలుగా మారాయని దుయ్యబట్టారు. 
(2 / 4)

గ‌న్నవ‌రంలో టీడీపీ ఆఫీసు త‌గల‌బెడితో నో కేస్.. తాను స్టూలు ఎక్కి మాట్లాడితే కేస్. తనపై దాడికి వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు క‌త్తులు, క‌ర్రల‌తో వ‌స్తే నో కేస్. తాను మాట్లాడితే కేస్ అంటూ  పోలీసులను టార్గెట్ చేస్తూ లోకేశ్ విమర్శనాస్త్రాలను సంధించారు.
(3 / 4)

ప్రస్తుతం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. గ్రామాల్లో ఇరుకైన రోడ్లపై లోకేష్ పర్యటించడం ఇబ్బంది అవుతుందని పోలీసులు చెబుతున్నారు. దీంతో ఆంక్షలు విధిస్తున్నట్లు చెబుతున్నారు. 
(4 / 4)

    ఆర్టికల్ షేర్ చేయండి