తెలుగు న్యూస్  /  ఫోటో  /  Gautam Gambhir: రోల్ మారినా.. గోల్ అదే: హెడ్‍కోచ్‍గా ఎంపికయ్యాక స్పందించిన గౌతమ్ గంభీర్

Gautam Gambhir: రోల్ మారినా.. గోల్ అదే: హెడ్‍కోచ్‍గా ఎంపికయ్యాక స్పందించిన గౌతమ్ గంభీర్

09 July 2024, 22:15 IST

Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్‍గా మాజీ స్టార్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని నేడు (జూలై 9) బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. దీనిపై గంభీర్ స్పందించాడు.

  • Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్‍గా మాజీ స్టార్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని నేడు (జూలై 9) బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. దీనిపై గంభీర్ స్పందించాడు.
భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్‍గా మాజీ స్టార్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఎంపికయ్యాడు. టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ తర్వాత లెజెండ్ రాహుల్ ద్రవిడ్ తప్పుకోగా.. ఆ స్థానాన్ని గంభీర్ భర్తీ చేస్తున్నాడు. టీమిండియాకు హెడ్‍కోచ్‍గా నియమితుడయ్యాక గంభీర్ స్పందించాడు.
(1 / 5)
భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్‍గా మాజీ స్టార్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఎంపికయ్యాడు. టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ తర్వాత లెజెండ్ రాహుల్ ద్రవిడ్ తప్పుకోగా.. ఆ స్థానాన్ని గంభీర్ భర్తీ చేస్తున్నాడు. టీమిండియాకు హెడ్‍కోచ్‍గా నియమితుడయ్యాక గంభీర్ స్పందించాడు.
ఒకప్పుడు భారత్‍కు ఆటగాడిగా చాలా విజయాలు అందించాడు గంభీర్. ఇప్పుడు హెడ్‍కోచ్‍గా టీమిండియాలోకి మళ్లీ వచ్చేశాడు. అయితే, తనది ఇప్పుడు టీమిండియాలో డిఫరెంట్ రోల్ అయినా.. భారతీయులందరినీ గర్వించేలా చేయడమే గోల్ అని గంభీర్ నేడు (జూలై 9) సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. త్రివర్ణ పతాకం ఫొటోను పోస్ట్ షేర్ చేశాడు. 
(2 / 5)
ఒకప్పుడు భారత్‍కు ఆటగాడిగా చాలా విజయాలు అందించాడు గంభీర్. ఇప్పుడు హెడ్‍కోచ్‍గా టీమిండియాలోకి మళ్లీ వచ్చేశాడు. అయితే, తనది ఇప్పుడు టీమిండియాలో డిఫరెంట్ రోల్ అయినా.. భారతీయులందరినీ గర్వించేలా చేయడమే గోల్ అని గంభీర్ నేడు (జూలై 9) సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. త్రివర్ణ పతాకం ఫొటోను పోస్ట్ షేర్ చేశాడు. (PTI)
“భారత దేశమే నా గుర్తింపు. నా దేశానికి సేవ చేయడం నా జీవితంలో దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తా. నేను విభిన్నమైన బాధ్యతతో తిరిగి వచ్చినందుకు గౌరవంగా అనుకుంటున్నా. కానీ ఎప్పటిలాగే ప్రతీ ఇండియన్‍ను గర్వపడేలా చేయడమే నా ధ్యేయం” అని గౌతమ్ గంభీర్ ట్వీట్ చేశాడు. 
(3 / 5)
“భారత దేశమే నా గుర్తింపు. నా దేశానికి సేవ చేయడం నా జీవితంలో దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తా. నేను విభిన్నమైన బాధ్యతతో తిరిగి వచ్చినందుకు గౌరవంగా అనుకుంటున్నా. కానీ ఎప్పటిలాగే ప్రతీ ఇండియన్‍ను గర్వపడేలా చేయడమే నా ధ్యేయం” అని గౌతమ్ గంభీర్ ట్వీట్ చేశాడు. (ANI)
“140 కోట్ల భారతీయుల కలలను టీమిండియా భుజాన మోస్తోంది. కలలను సాకారం చేసేందుకు నేను నా శక్తిమేర అన్ని విధాల కృషి చేస్తాను” అని గంభీర్ రాసుకొచ్చాడు. 
(4 / 5)
“140 కోట్ల భారతీయుల కలలను టీమిండియా భుజాన మోస్తోంది. కలలను సాకారం చేసేందుకు నేను నా శక్తిమేర అన్ని విధాల కృషి చేస్తాను” అని గంభీర్ రాసుకొచ్చాడు. 
టీమిండియా ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉంది. జూన్ 27న మొదలయ్యే శ్రీలంక పర్యటనతో భారత జట్టు హెచ్‍కోచ్‍గా తన ప్రస్థానాన్ని గౌతమ్ గంభీర్ మొదలుపెట్టనున్నాడు. 2027 వరకు అతడి కాంట్రాక్ట్ ఉంటుందని తెలుస్తోంది. 
(5 / 5)
టీమిండియా ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉంది. జూన్ 27న మొదలయ్యే శ్రీలంక పర్యటనతో భారత జట్టు హెచ్‍కోచ్‍గా తన ప్రస్థానాన్ని గౌతమ్ గంభీర్ మొదలుపెట్టనున్నాడు. 2027 వరకు అతడి కాంట్రాక్ట్ ఉంటుందని తెలుస్తోంది. (AFP)

    ఆర్టికల్ షేర్ చేయండి