తెలుగు న్యూస్  /  ఫోటో  /  Jampanna Vagu Floods : జంపన్నవాగు జల ప్రళయానికి ఏడాది, కళ్లముందే కదలాడుతున్న నాటి దృశ్యాలు

Jampanna Vagu floods : జంపన్నవాగు జల ప్రళయానికి ఏడాది, కళ్లముందే కదలాడుతున్న నాటి దృశ్యాలు

27 July 2024, 14:37 IST

Jampanna Vagu floods : గతేడాది జులై నెలలో జంపన్నవాగు, మోరంచవాగు ఉప్పొంగి..కొండాయి, మోరంచపల్లిని ముంచెత్తాయి. ఈ వరదల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఈ జల ప్రళయానికి నేటికి ఏడాది.

  • Jampanna Vagu floods : గతేడాది జులై నెలలో జంపన్నవాగు, మోరంచవాగు ఉప్పొంగి..కొండాయి, మోరంచపల్లిని ముంచెత్తాయి. ఈ వరదల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఈ జల ప్రళయానికి నేటికి ఏడాది.
అది 2023 జులై 27.. ఓరుగల్లు వ్యాప్తంగా  భారీ వర్షాలు.. ములుగు జిల్లాలోని జంపన్నవాగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచవాగు ఉప్పొంగాయి.  ఒక్కసారిగా జంపన్నవాగు కింద ఉన్న కొండాయి, మోరంచవాగును ఆనుకొని ఉన్న మోరంచపల్లిని వరదలు ముంచెత్తాయి. అకస్మాత్తుగా జల ప్రళయం సంభవించినట్టు ఇళ్లలోకి నీళ్ల వరద రాగా, చూస్తుండగానే  కొండాయిలో ఏకంగా ఎనిమిది మంది గల్లంతై ప్రాణాలు కోల్పోయారు.  మోరంచపల్లిలో మరో నలుగురు బలయ్యారు. ఈ ఘటన జరిగి సరిగ్గా ఏడాది పూర్తి కాగా, నాడు వరదల్లో చిక్కుకుని తమ వాళ్లు ప్రాణాలు కోల్పోవడాన్ని ఇప్పటికీ అక్కడి గ్రామస్థులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇప్పుడు కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో నాటి దృశ్యాలే కళ్ల ముందు కదలాడుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
(1 / 6)

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయిలో గతేడాది జులై 27న  పెను విషాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో కురిసిన భారీ వర్షాలకు  జంపన్నవాగు ఉప్పొంగింది. వరద ఉగ్రరూపం దాల్చగా.. ఎప్పటిలాగే వాగు ఉప్పొంగిందని అంతా భావించారు. కానీ ఉదయం 10 గంటల వరకు మామూలుగానే ఉన్న వరద మధ్యాహ్నం దాటిన తరువాత ఒక్కసారిగా పెరిగిపోయింది. అందరూ చూస్తుండగానే  వరద నీళ్లు ఇళ్లను ముంచెత్తాయి.  సాయంత్రం 4 గంటల వరకు గతంలో ఎన్నడూ లేనివిథంగా  కొండాయి గ్రామం మొత్తం జంపన్నవాగు నీటిలో మునిగిపోయింది. దీంతో ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు  విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ వరదను దాటి అవతలి వైపు వెళ్తున్న క్రమంలో 8 మంది నీటి తాకిడికి కొట్టుకు పోయి మృతి చెందారు.  దబ్బకట్ల సమ్మక్క, ఎండీ షరీఫ్, ఎండీ అజ్జు, ఎండీ మహబూబా ఖాన్, ఎండీ మజీద్ ఖాన్, ఆయన భార్య లాల్ బీ, రషీద్, ఆయన భార్య కరీమాబీ వరదలో కొట్టుకపోయి ప్రాణాలు కోల్పోయారు. చూస్తుండగానే క్షణాల వ్యవధిలో ఆ 8 మందిని జంపన్నవాగు బలిగొంది. గ్రామంలోని పశువులన్నీ కొట్టుకుపోయాయి. 
(2 / 6)

గ్రామంలోని ఇళ్లన్నీ దెబ్బతినగా, చాలావరకు  నేలమట్టమయ్యాయి. ఇళ్లలో ఉన్న సామగ్రి అంతా నీళ్ల పాలైంది. ఆ ఊరి వాళ్లంతా నిలువ  నీడలేక ఆశ్రయం కోల్పోయారు.  దీంతో ఆ ప్రాంతమంతా జల ప్రళయంలో మునిగి, బాధితుల ఆర్తనాదాలతో తల్లిడిల్లిపోయింది. కాగా మృతుల కుటుంబాలకు అప్పటి ప్రభుత్వం రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా అందజేసింది. అంతేకాకుండా పూర్తిగా నష్టపోయిన కుటుంబాలకు రూ.10వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఆ తరువాత కొండాయి గ్రామస్థులను  సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు గత ప్రభుత్వం హయాంలో ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ ఆ తరువాత ఎందుకనో  అది కార్యరూపం దాల్చలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.
(3 / 6)

గత ఏడాది జులైలో భారీ వర్షాల వల్ల జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి సమీపంలోని మోరంచవాగు ఉగ్రరూపం దాల్చింది. ఒక్కసారిగా వరద నీళ్లు మొత్తం గ్రామాన్ని ముంచెత్తాయి. ఊరు మొత్తం నీటిలో మునిగిపోగా,  ప్రాణాలు కాపాడుకోవడానికి జనాలు ఇళ్లు ఎక్కి ఆర్తానాదాలు చేశారు. అయినా గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. అందులో గొర్రె ఓదిరెడ్డి, గొంగడి సరోజనమ్మ ఇద్దరి మృత దేహాలు లభ్యం కాగా, సమ్మయ్య రాజమ్మ అనే మరో ఇద్దరి ఆచూకీ దొరకకుండా పోయింది. ఓదిరెడ్డి మృతదేహం చిట్యాల మండలంలోని పాచిగడ్డ తండా శివారులోని పొలాల్లో లభ్యం కాగా, సోలిపేట తాళ్ల వద్ద సరోజనమ్మ డెడ్ బాడీ దొరికింది.  ఈ రెండు గ్రామాలు జల ప్రళయానికి గురి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. 
(4 / 6)

గతేడాది కురిసిన భారీ వర్షాల కారణంగా రెండు గ్రామాల్లో మొత్తంగా 12 మంది ప్రాణాలు కోల్పోగా, ఆ తరువాత ప్రభుత్వం తరుఫున తీసుకున్న చర్యలు నామమాత్రంగానే ఉన్నాయి.  ఇదిలాఉంటే వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో చెరువులు, కుంటలు నిండిపోయాయి. గోదావరి ఉగ్రరూపం దాల్చుతుండటంతో తీర ప్రాంతాలకు చెందిన ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. కానీ గతేడాది వరదలు సృష్టించిన బీభత్సం ఇప్పటికీ కళ్ల ముందే కదలాడుతోందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. 
(5 / 6)

గతేడాది ఇదే రోజున తమ కళ్ల ముందు కనిపించిన వ్యక్తులు ఇప్పుడు కనిపించకుండా పోయారంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ వాళ్లను గుర్తు చేసుకుంటూ మనోవేదనకు గురవుతున్నారు. కాగా మోరంచపల్లి, కొండాయి గ్రామాలను వరదలు ముంచెత్తి ఏడాది పూర్తికాగా, ఇప్పటికీ ఆయా గ్రామాల ప్రజలు ఆ పీడకల నుంచి బయట పడలేకపోతున్నారు. అక్కడి ప్రజలకు ప్రభుత్వాలు అండగా నిలవడంతో పాటు గ్రామాలను వరద నీళ్లు ముంచెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి