తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tg Indiramma Housing Scheme Updates : ఇందిరమ్మ ఇళ్ల కోసం చూస్తున్నారా..! అయితే మీకో గుడ్‌న్యూస్‌

TG Indiramma Housing Scheme Updates : ఇందిరమ్మ ఇళ్ల కోసం చూస్తున్నారా..! అయితే మీకో గుడ్‌న్యూస్‌

20 October 2024, 8:01 IST

TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపునకు తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఈ నెలాఖారు నాటికి నియోజకవర్గాల వారీగా లబ్ధిదారులను గుర్తించనుంది. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తొలి విడ‌తగా 3500 నుంచి 4000 ఇళ్ల‌ను ఇస్తామన్నారు.

  • TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపునకు తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఈ నెలాఖారు నాటికి నియోజకవర్గాల వారీగా లబ్ధిదారులను గుర్తించనుంది. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తొలి విడ‌తగా 3500 నుంచి 4000 ఇళ్ల‌ను ఇస్తామన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులను స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ నెలఖారులోనే అర్హులను ఎంపిక చేసేందుకు సిద్ధమవుతోంది.
(1 / 5)

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపుపై రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం కీలక ప్రకటన చేశారు. ఈనెల చివ‌రి నాటికి రాష్ట్రంలోని ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి తొలివిడ‌తగా 3500 నుంచి 4000 ఇళ్ల‌ను మంజూరు చేయ‌బోతున్నామ‌ని ప్రకటించారు.
(2 / 5)

వ‌చ్చే నాలుగు సంవ‌త్స‌రాల‌లో రాష్ట్రంలో అర్హులైన పేద‌వారంద‌రికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వ‌డ‌మే కాంగ్రెస్  ప్ర‌భుత్వ లక్ష్య‌మ‌న్నారు. వచ్చే నాలుగు సంవ‌త్స‌రాల‌లో  20 ల‌క్ష‌ల ఇళ్ల‌కు త‌గ్గ‌కుండా నిర్మిస్తామ‌ని తెలిపారు.  
(3 / 5)

కులాలు, మ‌తాలు, ప్రాంతాలు, పార్టీలు, ఎలాంటి తేడా లేకుండా అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ ఇందిర‌మ్మ ఇండ్లు ఇవ్వ‌డ‌మే  ఈ ప్ర‌భుత్వ ఆశ‌య‌మ‌న్నారు. ఎలాంటి  భేష‌జాల‌కు పోకుండా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావ‌ల‌సిన వాటా, నిధులు అడిగి తీసుకుంటామ‌ని పొంగులేటి చెప్పుకొచ్చారు.
(4 / 5)

అర్హుల ఎంపిక ఎలా అనే దానిపై తెలంగాణ సర్కార్ మల్లాగుల్లాలు పడుతోంది. ఎలాంటి అవకతవలకు తావు లేకుండా ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించింది. ముఖ్యంగా అర్హుల ఎంపికలో పారదర్శకత పాటించాలని భావిస్తోంది. ఈ స్కీమ్ అమలు కోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ స్కీమ్ ను మార్చి 11వ తేదీన భద్రాచలం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే,
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి