తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tg Winter Updates: తెలుగు రాష్ట్రాలపై చలిపంజా, అల్లూరి, ఆదిలాబాద్ జిల్లాల్లోకనిష్ట ఉష్ణోగ్రతలు...

AP TG Winter Updates: తెలుగు రాష్ట్రాలపై చలిపంజా, అల్లూరి, ఆదిలాబాద్ జిల్లాల్లోకనిష్ట ఉష్ణోగ్రతలు...

16 December 2024, 8:40 IST

AP TG Winter Updates: తెలుగు రాష్ట్రాల్లో  చలి తీవ్రత పెరిగింది. ఏపీ తెలంగాణాల్లో ఏజెన్సీ ప్రాంతాలను చలి వణికిస్తోంది. కొన్ని జిల్లాల్లో చలిగాలులు వీస్తున్నాయి. ఉదయం 9 గంటల వరకు పొగమంచు ప్రభావం కనిపిస్తోంది. అన్ని జిల్లాల్లోకనిష్ట ఉష్ణోగ్రతలు 20డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి.  

  • AP TG Winter Updates: తెలుగు రాష్ట్రాల్లో  చలి తీవ్రత పెరిగింది. ఏపీ తెలంగాణాల్లో ఏజెన్సీ ప్రాంతాలను చలి వణికిస్తోంది. కొన్ని జిల్లాల్లో చలిగాలులు వీస్తున్నాయి. ఉదయం 9 గంటల వరకు పొగమంచు ప్రభావం కనిపిస్తోంది. అన్ని జిల్లాల్లోకనిష్ట ఉష్ణోగ్రతలు 20డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి.  
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. తెలంగాణలోని ఆదిలాబాద్‌, ఏపీలో అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 11డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.   
(1 / 11)
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. తెలంగాణలోని ఆదిలాబాద్‌, ఏపీలో అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 11డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.   
అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగుల మండలం కుంతలాం కనిష్ట ఉష్ణోగ్రతలు 5.7డిగ్రీలు నమోదయ్యాయి. ఈ ఏడాది చలికాలం మొదలైన తర్వాత అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇవే.
(2 / 11)
అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగుల మండలం కుంతలాం కనిష్ట ఉష్ణోగ్రతలు 5.7డిగ్రీలు నమోదయ్యాయి. ఈ ఏడాది చలికాలం మొదలైన తర్వాత అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇవే.
 జి. మాడుగులలో 6.2డిగ్రీలు, డుంబ్రిగూడలో 7.9డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రత 10డిగ్రీల్లోపు నమోదైంది.  మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అటు తెలంగాణలో చలి తీవ్ర కొనసాగుతోంది. 
(3 / 11)

పార్వతీపురం మన్యం, శ్రీ సత్యసాయి, అనంతపురం,విజయనగరం, శ్రీకాకకుళం, అన్నమయ్య, అనకాపల్లి, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, కాకినాడ తదితర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 15డిగ్రీల కంటే తక్కువ నమోదయ్యాయి.
(4 / 11)
పార్వతీపురం మన్యం, శ్రీ సత్యసాయి, అనంతపురం,విజయనగరం, శ్రీకాకకుళం, అన్నమయ్య, అనకాపల్లి, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, కాకినాడ తదితర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 15డిగ్రీల కంటే తక్కువ నమోదయ్యాయి.(Yogendra Kumar)
సోమ, మంగళ, బుధవారాల్లో చలిగాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఆదిలాబాద్‌ జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. 
(5 / 11)
సోమ, మంగళ, బుధవారాల్లో చలిగాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఆదిలాబాద్‌ జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. 
శనివారం రాత్రి ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో సాధారణంగా కన్నా 8.1డిగ్రీల ఉష్ణోగ్రత పడిపోయి 4.7డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పటాన్‌ చెరులో సాధారణ ఉష్ణోగ్రత 4.5డిగ్రీలు పడిపోయి 8.6డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 
(6 / 11)
శనివారం రాత్రి ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో సాధారణంగా కన్నా 8.1డిగ్రీల ఉష్ణోగ్రత పడిపోయి 4.7డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పటాన్‌ చెరులో సాధారణ ఉష్ణోగ్రత 4.5డిగ్రీలు పడిపోయి 8.6డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. (PTI)
తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది, ఆదిలాబాద్‌, అల్లూరి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి.  చలి తీవ్రతతో తెల్లవారిన తర్వాత కూడా మంచుతెరలు వీడటం లేదు. 
(7 / 11)
తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది, ఆదిలాబాద్‌, అల్లూరి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి.  చలి తీవ్రతతో తెల్లవారిన తర్వాత కూడా మంచుతెరలు వీడటం లేదు. (Sudipta Banerjee )
రాష్ట్రంలో పొగమంచు తీవ్రత కూడా క్రమంగా పెరుగుతోంది. తెల్లవారిన తర్వాత కూడా మంచు దుప్పట్లోనే ఉంటున్నాయి. 
(8 / 11)
రాష్ట్రంలో పొగమంచు తీవ్రత కూడా క్రమంగా పెరుగుతోంది. తెల్లవారిన తర్వాత కూడా మంచు దుప్పట్లోనే ఉంటున్నాయి. (PTI)
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో చలిగాలుల తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా దినసరి కార్మికులు, అసంఘటిత రంగంలో ఉండే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. 
(9 / 11)
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో చలిగాలుల తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా దినసరి కార్మికులు, అసంఘటిత రంగంలో ఉండే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. (Makhan lal jammu)
ఆదిలాబాద్‌లో 4.7డిగ్రీలు, మెదక్‌లో 9.8డిగ్రీలు, కరీంనగర్‌లో 11డిగ్రీలు, రామగుండంలో 11.6 డిగరీలు, హన్మకొండలో 12 డిగ్రీలు, నిజామాబాద్‌ 12 డిగ్రీలు, హైదరాబాద్‌లో 14.6డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 16.6డిగ్రీలు, ఖమ్మంలో 17డిగ్రీలు, నల్గొండలో 17.6డిగ్రీలు, సూర్యాపేటలో 20డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
(10 / 11)
ఆదిలాబాద్‌లో 4.7డిగ్రీలు, మెదక్‌లో 9.8డిగ్రీలు, కరీంనగర్‌లో 11డిగ్రీలు, రామగుండంలో 11.6 డిగరీలు, హన్మకొండలో 12 డిగ్రీలు, నిజామాబాద్‌ 12 డిగ్రీలు, హైదరాబాద్‌లో 14.6డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 16.6డిగ్రీలు, ఖమ్మంలో 17డిగ్రీలు, నల్గొండలో 17.6డిగ్రీలు, సూర్యాపేటలో 20డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.(Hindustan Times)
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఆదిలాబాద్‌, నిర్మల్, కుమురం భీం, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, జగిత్యాల, వికారాబాద్‌, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట, నిజామాబాద్‌, రంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లో 10డిగ్రీల్లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 
(11 / 11)

    ఆర్టికల్ షేర్ చేయండి