తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Meghalaya Assembly Elections: ప్రశాంతంగా మేఘాలయ అసెంబ్లీ పోలింగ్

Meghalaya Assembly Elections: ప్రశాంతంగా మేఘాలయ అసెంబ్లీ పోలింగ్

27 February 2023, 12:35 IST

Meghalaya Assembly Elections: మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. రాష్ట్రంలోని 60 అసెంబ్లీ స్థానాలకు గాను 59 నియోజకవర్గాల్లో నేడు (ఫిబ్రవరి 27) ఓటింగ్ జరుగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉండనుంది. పటిష్ట భద్రత నడుమ పోలింగ్ కొనసాగుతోంది. కాగా, నాగాలాండ్‍లోనూ నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.

  • Meghalaya Assembly Elections: మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. రాష్ట్రంలోని 60 అసెంబ్లీ స్థానాలకు గాను 59 నియోజకవర్గాల్లో నేడు (ఫిబ్రవరి 27) ఓటింగ్ జరుగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉండనుంది. పటిష్ట భద్రత నడుమ పోలింగ్ కొనసాగుతోంది. కాగా, నాగాలాండ్‍లోనూ నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.
పటిష్ట బందోబస్తు మధ్య సోమవారం ఉదయం మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 11 గంటల నాటికి 26.70 శాతం ఓటింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో ఓటర్లు ఉన్నారు. ఇప్పటి వరకు పోలింగ్ అన్ని చోట్ల ప్రశాంతంగా జరుగుతోందని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎఫ్ఆర్ ఖర్కోంగర్ తెలిపారు. 
(1 / 7)
పటిష్ట బందోబస్తు మధ్య సోమవారం ఉదయం మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 11 గంటల నాటికి 26.70 శాతం ఓటింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో ఓటర్లు ఉన్నారు. ఇప్పటి వరకు పోలింగ్ అన్ని చోట్ల ప్రశాంతంగా జరుగుతోందని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎఫ్ఆర్ ఖర్కోంగర్ తెలిపారు. (PTI)
జైంతియా హిల్ ప్రాంతంలో ఓటర్లలో ఆసక్తి కనపడుతోందని, గారో హిల్స్‌లోని క్రమంగా ఓటింగ్ శాతం పెరుగుతోందని ఖర్కోంగర్ చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద సుదీర్ఘ క్యూలు ఉన్నాయని చెప్పారు. 
(2 / 7)
జైంతియా హిల్ ప్రాంతంలో ఓటర్లలో ఆసక్తి కనపడుతోందని, గారో హిల్స్‌లోని క్రమంగా ఓటింగ్ శాతం పెరుగుతోందని ఖర్కోంగర్ చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద సుదీర్ఘ క్యూలు ఉన్నాయని చెప్పారు. (HT Photo/Chayanika Das)
ఆరంభంలో కొన్నిచోట్ల ఈవీఎంలు మెరాయించినా కాసేపటికే సమస్య పరిష్కారమైందని ఆయన చెప్పారు.
(3 / 7)
ఆరంభంలో కొన్నిచోట్ల ఈవీఎంలు మెరాయించినా కాసేపటికే సమస్య పరిష్కారమైందని ఆయన చెప్పారు.(HT Photo/Chayanika Das)
మేఘాలయలో 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా… 36 స్థానాలు ఖసీ (Khasi), జైంతియా హిల్స్ (Jantia Hils)  ప్రాంతంలో, 24 నియోజకవర్గాలు గారో హిల్స్ (Garo Hills) పరిధిలో ఉన్నాయి. 
(4 / 7)
మేఘాలయలో 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా… 36 స్థానాలు ఖసీ (Khasi), జైంతియా హిల్స్ (Jantia Hils)  ప్రాంతంలో, 24 నియోజకవర్గాలు గారో హిల్స్ (Garo Hills) పరిధిలో ఉన్నాయి. (PTI)
లైతుంకరాలో ఓటు వేసిన మాజీ మంత్రి, అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ అభ్యర్థి మజెల్ అర్పరీన్ లింగ్‍డో.  
(5 / 7)
లైతుంకరాలో ఓటు వేసిన మాజీ మంత్రి, అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ అభ్యర్థి మజెల్ అర్పరీన్ లింగ్‍డో.  (PTI)
రి బోహి జిల్లాలో పోలింగ్ కేంద్రం వద్ద క్యూలో నిలబడిన ఓటర్లు. మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మార్చి 2న ఉంటుంది.
(6 / 7)
రి బోహి జిల్లాలో పోలింగ్ కేంద్రం వద్ద క్యూలో నిలబడిన ఓటర్లు. మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మార్చి 2న ఉంటుంది.(PTI)
మేఘాలయలోని 59 అసెంబ్లీ నియోజకవర్గాలకు 3,419 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది. 
(7 / 7)
మేఘాలయలోని 59 అసెంబ్లీ నియోజకవర్గాలకు 3,419 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది. (HT Photo/Chayanika Das)

    ఆర్టికల్ షేర్ చేయండి