తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ms Dhoni Record: చరిత్ర సృష్టించిన ధోనీ.. ఐపీఎల్‍లో ఈ ఫీట్ సాధించిన తొలి ప్లేయర్‌గా..

MS Dhoni Record: చరిత్ర సృష్టించిన ధోనీ.. ఐపీఎల్‍లో ఈ ఫీట్ సాధించిన తొలి ప్లేయర్‌గా..

05 May 2024, 21:57 IST

MS Dhoni Record: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి అరుదైన రికార్డు సాధించాడు. పంజాబ్‍తో నేడు (మే 5) జరిగిన మ్యాచ్ ద్వారా ఓ రికార్డు సృష్టించాడు. ఆ వివరాలివే..

  • MS Dhoni Record: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి అరుదైన రికార్డు సాధించాడు. పంజాబ్‍తో నేడు (మే 5) జరిగిన మ్యాచ్ ద్వారా ఓ రికార్డు సృష్టించాడు. ఆ వివరాలివే..
ఐపీఎల్ 2024 సీజన్‍లో నేడు (మే 5) చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు 28 పరుగుల భారీ తేడాతో పంజాబ్ కింగ్స్ (PBKS)పై విజయం సాధించింది. ధర్మశాల వేదికగా జరిగిన పోరులో చెన్నై దుమ్మురేపింది. అయితే, ఈ మ్యాచ్‍లో ఓ క్యాచ్ ద్వారా సీఎస్‍కే స్టార్ ప్లేయర్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. 
(1 / 5)
ఐపీఎల్ 2024 సీజన్‍లో నేడు (మే 5) చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు 28 పరుగుల భారీ తేడాతో పంజాబ్ కింగ్స్ (PBKS)పై విజయం సాధించింది. ధర్మశాల వేదికగా జరిగిన పోరులో చెన్నై దుమ్మురేపింది. అయితే, ఈ మ్యాచ్‍లో ఓ క్యాచ్ ద్వారా సీఎస్‍కే స్టార్ ప్లేయర్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. (AFP)
ఐపీఎల్‍లో 150 క్యాచ్‍లు పట్టిన తొలి ప్లేయర్‌గా మహేంద్ర సింగ్ ధోనీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‍లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు.
(2 / 5)
ఐపీఎల్‍లో 150 క్యాచ్‍లు పట్టిన తొలి ప్లేయర్‌గా మహేంద్ర సింగ్ ధోనీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‍లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు.(ANI )
పంజాబ్‍తో మ్యాచ్‍లో జితేశ్ శర్మ క్యాట్ పట్టాడు ధోనీ. దీంతో ఐపీఎల్‍లో 150 క్యాచ్‍లను పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‍లో ఈ ఫీట్ సాధించిన ఫస్ట్ ప్లేయర్‌గా రికార్డు దక్కించున్నాడు.
(3 / 5)
పంజాబ్‍తో మ్యాచ్‍లో జితేశ్ శర్మ క్యాట్ పట్టాడు ధోనీ. దీంతో ఐపీఎల్‍లో 150 క్యాచ్‍లను పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‍లో ఈ ఫీట్ సాధించిన ఫస్ట్ ప్లేయర్‌గా రికార్డు దక్కించున్నాడు.(AP)
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్‍ల జాబితాలో ధోనీ (150 క్యాచ్‍లు) తర్వాత రెండో స్థానంలో ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ 144 క్యాచ్‍లతో ఉన్నాడు. ఆ తర్వాతి ప్లేస్‍ల్లో ఏబీ డెవిలియర్స్ (118 క్యాచ్‍లు, రిటైర్డ్), ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (113 క్యాచ్‍లు), సురేశ్ రైనా (109 క్యాచ్‍లు, రిటైర్డ్) ఉన్నారు. 
(4 / 5)
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్‍ల జాబితాలో ధోనీ (150 క్యాచ్‍లు) తర్వాత రెండో స్థానంలో ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ 144 క్యాచ్‍లతో ఉన్నాడు. ఆ తర్వాతి ప్లేస్‍ల్లో ఏబీ డెవిలియర్స్ (118 క్యాచ్‍లు, రిటైర్డ్), ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (113 క్యాచ్‍లు), సురేశ్ రైనా (109 క్యాచ్‍లు, రిటైర్డ్) ఉన్నారు. (IPL)
పంజాబ్‍తో నేటి (మే 5) మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్లకు 167 రన్స్ చేసింది. ఆ తర్వాత చెన్నై బౌలర్లు రాణించారు. దీంతో పంజాబ్ 20 ఓవర్లకు 9 వికెట్లకు 139 పరుగులే చేసి ఓడిపోయింది. 
(5 / 5)
పంజాబ్‍తో నేటి (మే 5) మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్లకు 167 రన్స్ చేసింది. ఆ తర్వాత చెన్నై బౌలర్లు రాణించారు. దీంతో పంజాబ్ 20 ఓవర్లకు 9 వికెట్లకు 139 పరుగులే చేసి ఓడిపోయింది. (IPL)

    ఆర్టికల్ షేర్ చేయండి