తెలుగు న్యూస్  /  ఫోటో  /  Mahankali Bonalu : లష్కర్‌ బోనాలు షురూ… మహంకాళి అమ్మవారికి తొలిబోనం

Mahankali Bonalu : లష్కర్‌ బోనాలు షురూ… మహంకాళి అమ్మవారికి తొలిబోనం

09 July 2023, 7:20 IST

Mahankali Bonalu Jatara 2023: ఉజ్జయినీ మహంకాళి బోనాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి పూజల అనంతరం ఉదయం 3.30 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలతో పాటు తొలి బోనం సమర్పించారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు ఇక్కడ వీక్షించండి…. 

  • Mahankali Bonalu Jatara 2023: ఉజ్జయినీ మహంకాళి బోనాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి పూజల అనంతరం ఉదయం 3.30 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలతో పాటు తొలి బోనం సమర్పించారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు ఇక్కడ వీక్షించండి…. 
ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు వస్తున్నారు. భక్తుల జన సందోహం దృష్ట్యా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు.
(1 / 6)

రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్... కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. 
(2 / 6)

బోనాల పండగ ఏర్పాట్లలో భాగంగా ఉజ్జయిని మహంకాళి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. 175 సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉండేలా చర్యలు తీసుకున్నారు.భక్తుల కోసం మొత్తం ఆరు క్యూలైన్లను ఏర్పాటు చేశారు.
(3 / 6)

సాధారణ భక్తుల కోసం, వీఐపీల కోసం ప్రత్యేకంగా క్యూలైన్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. దాతల పాస్‌ల కోసం ప్రత్యేకంగా మరో క్యూలైన్‌ను ఏర్పాటు చేశారు.
(4 / 6)

మహంకాళి పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేసి.. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
(5 / 6)

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని మంత్రి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మన సంస్కృతికి ప్రతీక బోనాల ఉత్సవాలు అని అన్నారు. బోనాల సందర్భంగా వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి