తెలుగు న్యూస్  /  ఫోటో  /  Telangana Weather Updates : ఐఎండీ రెయిన్ అలర్ట్ - ఇవాళ, రేపు తెలంగాణలో తేలికపాటి వర్షాలు..!

Telangana Weather Updates : ఐఎండీ రెయిన్ అలర్ట్ - ఇవాళ, రేపు తెలంగాణలో తేలికపాటి వర్షాలు..!

19 December 2024, 15:02 IST

AP Telangana Weather Updates : తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఇవాళ, రేపు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని పేర్కొంది. ఆ తర్వాత పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. ఇక డిసెంబర్ 24 నుంచి మళ్లీ వానలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.

  • AP Telangana Weather Updates : తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఇవాళ, రేపు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని పేర్కొంది. ఆ తర్వాత పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. ఇక డిసెంబర్ 24 నుంచి మళ్లీ వానలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం బలపడింది. రానున్న 24 గంటల్లో తమిళనాడు,ఏపీ తీరం పైపు వెళ్లే అవకాశం ఉంది.
(1 / 7)

 రానున్న 3 రోజుల్లో కోస్తా జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉంది. తీరం వెంబడి 30-35 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. 
(2 / 7)

తెలంగాణలో ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అక్కడకక్కడ కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులెటిన్ విడుదల చేసింది. 
(3 / 7)

తెలంగాణలో రేపు(డిసెంబర్ 20) తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు జారీ కాలేదు. డిసెంబర్ 21వ తేదీ నుంచి తెలంగాణలో మళ్లీ పొడి వాతావరణం ఉండనుంది. ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 
(4 / 7)

ఇక డిసెంబర్ 24వ  తేదీ నుంచి మళ్లీ తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అక్కడకక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. 
(5 / 7)

ఏపీలో ఇవాళ శ్రీకాకుళం,విజయనగరం,అల్లూరి, విశాఖ జిల్లాల్లోని కొన్ని ప్రదేశాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 
(6 / 7)

తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఏలూరు,కృష్ణా, ఎన్టీఆర్,గుంటూరు,బాపట్ల,ప్రకాశం, నెల్లూరు,అన్నమయ్య,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి  నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది 
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి