తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tg Weather Alert : ఐఎండీ రెయిన్ అలర్ట్ - తెలంగాణలో ఆ తేదీ నుంచి మళ్లీ వర్షాలు..!

TG Weather ALERT : ఐఎండీ రెయిన్ అలర్ట్ - తెలంగాణలో ఆ తేదీ నుంచి మళ్లీ వర్షాలు..!

20 December 2024, 14:26 IST

Telangana Weather Updates : తెలంగాణకు వాతావరణశాఖ వర్ష సూచన ఇచ్చింది. ఈ మూడు రోజులపాటు పొడి వాతవరణం ఉంటుందని తెలిపింది. అయితే డిసెంబర్ 24వ తేదీ నుంచి రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి….

  • Telangana Weather Updates : తెలంగాణకు వాతావరణశాఖ వర్ష సూచన ఇచ్చింది. ఈ మూడు రోజులపాటు పొడి వాతవరణం ఉంటుందని తెలిపింది. అయితే డిసెంబర్ 24వ తేదీ నుంచి రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి….
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉందని ఐఎండీ తాజా బులెటిన్ లో తెలిపింది. 
(1 / 8)

ఈ అల్పపీడనం రాబోయే 12 గంటల్లో ఉత్తరం వైపు కదులుచూ పశ్చిమ మధ్య బంగాళాఖాతాంలో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆ తదుపరి 24 గంటల్లో వాయుగుండం తీవ్రతతో కొనసాగుతుందని పేర్కొంది. 
(2 / 8)

అల్పపీడనం, వాయుగుండం ప్రభావం నేపథ్యంలో తెలంగాణకు వర్ష సూచన ఇచ్చింది ఐఎండీ. అయితే ఈ మూడు రోజులపాటు మాత్రం పొడి వాతావరణమే ఉంటుందని పేర్కొంది. 
(3 / 8)

డిసెంబర్ 24వ తేదీ నుంచి తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పలుచోట్ల పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని తెలిపింది. 
(4 / 8)

డిసెంబర్ 26వ తేదీ వరకు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. 
(5 / 8)

ఇక ఏపీపై అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. దీంతో ఇవాళ శ్రీకాకుళం,విజయనగరం, పార్వతీపురంమన్యం,అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ మరియు ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(6 / 8)

కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,కృష్ణా,ఎన్టీఆర్, ప్రకాశం,నెల్లూరు,కర్నూలు,నంద్యాల, అనంతపురం,సత్యసాయి, వైఎస్ఆర్,చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది
(7 / 8)

భారీ వర్ష సూచనల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
(8 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి