తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Weather Updates : మండుతున్న వేసవిలో ఏపీకి Imd చల్లని కబురు - ఇవాళ, రేపు వర్షాలు!

AP Weather Updates : మండుతున్న వేసవిలో ఏపీకి IMD చల్లని కబురు - ఇవాళ, రేపు వర్షాలు!

07 April 2024, 7:06 IST

Andhrapradesh Weather Updates : మండుతున్న వేసవిలో ఆంధ్రప్రదేశ్ కు ఐఎండీ చల్లని కబురు చెప్పింది. ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అయితే ఉత్తర కోస్తా మినహా మిగతా ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.

  • Andhrapradesh Weather Updates : మండుతున్న వేసవిలో ఆంధ్రప్రదేశ్ కు ఐఎండీ చల్లని కబురు చెప్పింది. ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అయితే ఉత్తర కోస్తా మినహా మిగతా ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.
ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. ఏకంగా 44 డిగ్రీలకు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనాలు అల్లాడిపోతున్నారు. 
(1 / 7)
ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. ఏకంగా 44 డిగ్రీలకు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనాలు అల్లాడిపోతున్నారు. (Photo Source From unsplash.com)
ఉదయం 9 దాటితే చాలు భానుడి ప్రతాపం ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం సమయానికి మడు పగిలేలా పరిస్థితి ఉంటుంది. సాయంత్రం 6 దాటితే కాని ఎండ తీవ్రత తగ్గటం లేదు.
(2 / 7)
ఉదయం 9 దాటితే చాలు భానుడి ప్రతాపం ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం సమయానికి మడు పగిలేలా పరిస్థితి ఉంటుంది. సాయంత్రం 6 దాటితే కాని ఎండ తీవ్రత తగ్గటం లేదు.(Photo Source From unsplash.com)
ఓవైపు ఎండల తీవ్రత.. మరోవైపు వడగాల్పులతో సతమతవుతున్న ఏపీ వాసులకు వాతావరణశాఖ కూల్ న్యూస్ చెప్పింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
(3 / 7)
ఓవైపు ఎండల తీవ్రత.. మరోవైపు వడగాల్పులతో సతమతవుతున్న ఏపీ వాసులకు వాతావరణశాఖ కూల్ న్యూస్ చెప్పింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.(Photo Source From unsplash.com)
ఐఎండీ రిపోర్ట్ ప్రకారం.... ఇవాళ ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్నిచోట్ల ఎండ వేడిమి ఉంటుందని అంచనా వేసింది. ఇక రేపు కూడా కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలుచోట్ల ఎండ వేడిమితో అసౌకర్యమైన వాతావరణం ఉంటుందని వెల్లడించింది.
(4 / 7)
ఐఎండీ రిపోర్ట్ ప్రకారం.... ఇవాళ ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్నిచోట్ల ఎండ వేడిమి ఉంటుందని అంచనా వేసింది. ఇక రేపు కూడా కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలుచోట్ల ఎండ వేడిమితో అసౌకర్యమైన వాతావరణం ఉంటుందని వెల్లడించింది.(Photo Source From unsplash.com)
ఇక దక్షిణ కోస్తా, రాయలసీమ జిలాల్లో మాత్రం.... ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది. ఎలాంటి వర్ష సూచన లేదని తెలిపింది.
(5 / 7)
ఇక దక్షిణ కోస్తా, రాయలసీమ జిలాల్లో మాత్రం.... ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది. ఎలాంటి వర్ష సూచన లేదని తెలిపింది.(unsplash.com)
ఏప్రిల్ 5వ తేదీన ఏపీలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. నంద్యాలలో అత్యధికంగా 43.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. కర్నూలులో 43.5 డిగ్రీలు, అనంతపురంలో 43.1 డిగ్రీలు, తిరుపతిలో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
(6 / 7)
ఏప్రిల్ 5వ తేదీన ఏపీలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. నంద్యాలలో అత్యధికంగా 43.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. కర్నూలులో 43.5 డిగ్రీలు, అనంతపురంలో 43.1 డిగ్రీలు, తిరుపతిలో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.(Photo Source From unsplash.com)
అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని, వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
(7 / 7)
అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని, వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.(Photo Source From unsplash.com)

    ఆర్టికల్ షేర్ చేయండి