తెలుగు న్యూస్  /  ఫోటో  /  Health Benefits Of Eggs | మెదడు ఆరోగ్యానికి వెరీ ‘గుడ్డు’

Health Benefits of Eggs | మెదడు ఆరోగ్యానికి వెరీ ‘గుడ్డు’

26 January 2022, 16:11 IST

కోడిగుడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ కరోనా కష్టకాలంలో మనం హెల్తీగా ఉండటానికి అవసరమైన అన్ని పోషకాలు గుడ్లలో ఉన్నాయి. అంతేకాదు గుడ్లు మెదడు ఆరోగ్యానికి కూడా అవసరమని అంటున్నారు న్యూట్రిషనిస్ట్ పూజా మఖీజా.

  • కోడిగుడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ కరోనా కష్టకాలంలో మనం హెల్తీగా ఉండటానికి అవసరమైన అన్ని పోషకాలు గుడ్లలో ఉన్నాయి. అంతేకాదు గుడ్లు మెదడు ఆరోగ్యానికి కూడా అవసరమని అంటున్నారు న్యూట్రిషనిస్ట్ పూజా మఖీజా.
మన రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటే కరోనా వైరస్‌లాంటి మహమ్మారి ఏమీ చేయలేదు. కానీ ఆ రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాలంటే మనం తినే ఆహారం బాగుండాలి. ఈ విషయంలో గుడ్లు చేసే మేలు.. మరేదీ చేయదని అంటున్నారు పూజా మఖీజా. నాణ్యమైన ప్రొటీన్‌, పోషకాలు ఉన్న సహజ ఆహార పదార్థం గుడ్డు. వీటి వల్ల శారీరకంగానే కాదు మన మెదడు ఆరోగ్యం కూడా బాగుంటుందని పూజా చెబుతున్నారు. గుడ్ల వల్ల కలిగే లాభాలను ఈ మధ్య తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో ఆమె పంచుకున్నారు.
(1 / 10)
మన రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటే కరోనా వైరస్‌లాంటి మహమ్మారి ఏమీ చేయలేదు. కానీ ఆ రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాలంటే మనం తినే ఆహారం బాగుండాలి. ఈ విషయంలో గుడ్లు చేసే మేలు.. మరేదీ చేయదని అంటున్నారు పూజా మఖీజా. నాణ్యమైన ప్రొటీన్‌, పోషకాలు ఉన్న సహజ ఆహార పదార్థం గుడ్డు. వీటి వల్ల శారీరకంగానే కాదు మన మెదడు ఆరోగ్యం కూడా బాగుంటుందని పూజా చెబుతున్నారు. గుడ్ల వల్ల కలిగే లాభాలను ఈ మధ్య తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో ఆమె పంచుకున్నారు.(Shutterstock)
గుడ్లతో దృఢమైన కండరాలు: ప్రతి రోజూ మీరు తినే ఆహారంలో గుడ్లను చేర్చడం వల్ల మీ కండరాలు దృఢంగా మారుతాయి. మీ శరీర ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. గుడ్లలోని ప్రొటీన్‌.. మీ శరీర కణజాలాన్ని బాగా చూసుకుంటుంది.
(2 / 10)
గుడ్లతో దృఢమైన కండరాలు: ప్రతి రోజూ మీరు తినే ఆహారంలో గుడ్లను చేర్చడం వల్ల మీ కండరాలు దృఢంగా మారుతాయి. మీ శరీర ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. గుడ్లలోని ప్రొటీన్‌.. మీ శరీర కణజాలాన్ని బాగా చూసుకుంటుంది.(Shutterstock)
మెదడు ఆరోగ్యం: ఆరోగ్యకరమైన జీవనానికి క్రియాశీల మెదడు అనేది చాలా ముఖ్యమైనది. గుడ్లలో ఉండే విటమిన్లు, ఖనిజాలు మెదడు, నాఢీ వ్యవస్థ సమర్థంగా పని చేయడానికి ఉపయోగపడతాయి.
(3 / 10)
మెదడు ఆరోగ్యం: ఆరోగ్యకరమైన జీవనానికి క్రియాశీల మెదడు అనేది చాలా ముఖ్యమైనది. గుడ్లలో ఉండే విటమిన్లు, ఖనిజాలు మెదడు, నాఢీ వ్యవస్థ సమర్థంగా పని చేయడానికి ఉపయోగపడతాయి.(Shutterstock)
శక్తినిచ్చే గుడ్లు: మన శరీరం శక్తిని ఉత్పత్తి చేయడానికి అవసరమైన అన్ని పోషకాలు గుడ్లలో ఉంటాయి. ఉదయాన్ని బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లను తీసుకుంటే చాలా మేలు జరుగుతుందని అధ్యయనాలు నిరూపించాయి. బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు తీసుకుంటే రోజంతా మీ శరీరం శక్తివంతంగా ఉంటుంది. తిన్న తర్వాత మనకు కలిగే సంతృప్తికి కారణమైన హార్మోన్‌ స్థాయిలను కూడా ఈ గుడ్లు పెంచుతాయి. జీవక్రియ కూడా మెరుగవుతుంది.
(4 / 10)
శక్తినిచ్చే గుడ్లు: మన శరీరం శక్తిని ఉత్పత్తి చేయడానికి అవసరమైన అన్ని పోషకాలు గుడ్లలో ఉంటాయి. ఉదయాన్ని బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లను తీసుకుంటే చాలా మేలు జరుగుతుందని అధ్యయనాలు నిరూపించాయి. బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు తీసుకుంటే రోజంతా మీ శరీరం శక్తివంతంగా ఉంటుంది. తిన్న తర్వాత మనకు కలిగే సంతృప్తికి కారణమైన హార్మోన్‌ స్థాయిలను కూడా ఈ గుడ్లు పెంచుతాయి. జీవక్రియ కూడా మెరుగవుతుంది.(Pixabay)
ఆరోగ్యకరమైన రోగ నిరోధక వ్యవస్థ: గుడ్లు రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. దీనికి అవసరమైన విటమిన్‌ ఎ, విటమిన్‌ బీ12, సెలీనియం గుడ్లలో పుష్కలంగా ఉంటాయి.
(5 / 10)
ఆరోగ్యకరమైన రోగ నిరోధక వ్యవస్థ: గుడ్లు రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. దీనికి అవసరమైన విటమిన్‌ ఎ, విటమిన్‌ బీ12, సెలీనియం గుడ్లలో పుష్కలంగా ఉంటాయి.(Pixabat)
గుండె జబ్బుల ముప్పు తక్కువ: మనిషిలో గుండె జబ్బులకు ప్రధాన కారణం అమినో యాసిడ్‌ హోమోసిస్టీన్‌. దీనిని బ్రేక్‌ చేయడానికి అవసరమైన కొలీన్‌ గుడ్లలో ఉంటుంది.
(6 / 10)
గుండె జబ్బుల ముప్పు తక్కువ: మనిషిలో గుండె జబ్బులకు ప్రధాన కారణం అమినో యాసిడ్‌ హోమోసిస్టీన్‌. దీనిని బ్రేక్‌ చేయడానికి అవసరమైన కొలీన్‌ గుడ్లలో ఉంటుంది.(Pixabay)
గర్భవతులకు మరింత మేలు: గర్భవతులుగా ఉన్నవాళ్లు ఫోలిక్‌ యాసిడ్‌ టాబ్లెట్లు రెగ్యులర్‌గా వాడుతుంటారు. అయితే దీనిని సహజంగా ఇచ్చే గుణం గుడ్లలో ఉంది. ఇది పుట్టుకతో వచ్చే వైకల్యాలను నియంత్రించడంలో తోడ్పడుతుంది.
(7 / 10)
గర్భవతులకు మరింత మేలు: గర్భవతులుగా ఉన్నవాళ్లు ఫోలిక్‌ యాసిడ్‌ టాబ్లెట్లు రెగ్యులర్‌గా వాడుతుంటారు. అయితే దీనిని సహజంగా ఇచ్చే గుణం గుడ్లలో ఉంది. ఇది పుట్టుకతో వచ్చే వైకల్యాలను నియంత్రించడంలో తోడ్పడుతుంది.(Shutterstock)
కంటికీ మంచిదే: వయసుతోపాటు మనిషిలో కంటిచూపు మందగిస్తుంది. అయితే గుడ్లలోని లూటీన్‌, జీక్సాంతిన్‌ కంటి చూపును మెరుగుపరుస్తుంది. గుడ్లలోని ఇతర విటమిన్లు కూడా కంటికి మేలు చేస్తాయి.
(8 / 10)
కంటికీ మంచిదే: వయసుతోపాటు మనిషిలో కంటిచూపు మందగిస్తుంది. అయితే గుడ్లలోని లూటీన్‌, జీక్సాంతిన్‌ కంటి చూపును మెరుగుపరుస్తుంది. గుడ్లలోని ఇతర విటమిన్లు కూడా కంటికి మేలు చేస్తాయి.(Pixabay)
బరువు తగ్గడానికి..: గుడ్లలో ఉండే ప్రొటీన్.. ఎక్కువసేపు కడుపు ఫుల్లుగా ఉండే ఫీలింగ్‌ను కలిగిస్తుంది. దీని కారణంగా ఎప్పుడుపడితే అప్పుడు తినాల్సిన అవసరం రాదు. దీంతో ఓ మనిషి తీసుకునే కేలరీలు తగ్గి.. బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
(9 / 10)
బరువు తగ్గడానికి..: గుడ్లలో ఉండే ప్రొటీన్.. ఎక్కువసేపు కడుపు ఫుల్లుగా ఉండే ఫీలింగ్‌ను కలిగిస్తుంది. దీని కారణంగా ఎప్పుడుపడితే అప్పుడు తినాల్సిన అవసరం రాదు. దీంతో ఓ మనిషి తీసుకునే కేలరీలు తగ్గి.. బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.(Pixabay)
చర్మ ఆరోగ్యానికి..: గుడ్లలోని కొన్ని విటమిన్లు, ఖనిజాలు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి శరీర కణజాలం విచ్ఛిన్నం కాకుండా అడ్డుపడతాయి.
(10 / 10)
చర్మ ఆరోగ్యానికి..: గుడ్లలోని కొన్ని విటమిన్లు, ఖనిజాలు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి శరీర కణజాలం విచ్ఛిన్నం కాకుండా అడ్డుపడతాయి.(Pixabay)

    ఆర్టికల్ షేర్ చేయండి