తెలుగు న్యూస్  /  ఫోటో  /  Joint Pains | కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనానికి అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలు

Joint Pains | కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనానికి అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలు

08 March 2022, 22:54 IST

కీళ్ల నొప్పులు మిమ్మల్ని కదలనివ్వకుండా చేస్తున్నాయా? ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి ఆయుర్వేద చిట్కాలు ఉన్నాయి.

  • కీళ్ల నొప్పులు మిమ్మల్ని కదలనివ్వకుండా చేస్తున్నాయా? ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి ఆయుర్వేద చిట్కాలు ఉన్నాయి.
కీళ్ల నొప్పులు అనేవి కేవలం వయసు మళ్లిన వారికి మాత్రమే వచ్చేవి కావు. ఏ వయసు వారికైనా ఈ సమస్య తలెత్తవచ్చు. కాల్షియం, విటమిన్ డి లోపం ఉంటే ఈ సమస్య కలుగుతుంది. అలాగే ఒకేచోట కదలకుండా కూర్చునే జీవనశైలి కూడా కీళ్లనొప్పులకు కారణమవుతుంది. ఆర్థరైటిస్ ఉన్నవారిలో అయితే ఈ సమస్య అతి సాధారణం. కీళ్ల నొప్పులను ఎదుర్కోవడం కోసం ఇక్కడ కొన్ని ఆయుర్వేద చిట్కాలు అందిస్తున్నాం.
(1 / 6)
కీళ్ల నొప్పులు అనేవి కేవలం వయసు మళ్లిన వారికి మాత్రమే వచ్చేవి కావు. ఏ వయసు వారికైనా ఈ సమస్య తలెత్తవచ్చు. కాల్షియం, విటమిన్ డి లోపం ఉంటే ఈ సమస్య కలుగుతుంది. అలాగే ఒకేచోట కదలకుండా కూర్చునే జీవనశైలి కూడా కీళ్లనొప్పులకు కారణమవుతుంది. ఆర్థరైటిస్ ఉన్నవారిలో అయితే ఈ సమస్య అతి సాధారణం. కీళ్ల నొప్పులను ఎదుర్కోవడం కోసం ఇక్కడ కొన్ని ఆయుర్వేద చిట్కాలు అందిస్తున్నాం.(Pixabay)
కీళ్లనొప్పులు ఉన్నప్పుడు అన్నింటికంటే ముందుగా మీ ఆహారంలో మార్పులు చేసుకోవాలి. పుల్లని, ఉప్పగా ఉండే, బాగా వేయించిన లేదా పులియబెట్టిన ఆహారాన్ని తినడం మానుకోండి.
(2 / 6)
కీళ్లనొప్పులు ఉన్నప్పుడు అన్నింటికంటే ముందుగా మీ ఆహారంలో మార్పులు చేసుకోవాలి. పుల్లని, ఉప్పగా ఉండే, బాగా వేయించిన లేదా పులియబెట్టిన ఆహారాన్ని తినడం మానుకోండి.(Pixabay)
వాతం తీవ్రతరం చేసే ఆహారానికి కూడా నివారించండి. ఎండబెట్టిన లేదా నిల్వచేసిన ఆహారం తినకూడదు. అధిక వ్యాయామం, నిద్రలేమి, ఒత్తిడితో కూడిన జీవనశైలి కూడా కీళ్లనొప్పులకు కారణమవుతాయి.
(3 / 6)
వాతం తీవ్రతరం చేసే ఆహారానికి కూడా నివారించండి. ఎండబెట్టిన లేదా నిల్వచేసిన ఆహారం తినకూడదు. అధిక వ్యాయామం, నిద్రలేమి, ఒత్తిడితో కూడిన జీవనశైలి కూడా కీళ్లనొప్పులకు కారణమవుతాయి.(Pixabay)
నెయ్యి, నువ్వులు, ఆలివ్ నూనె మొదలైన ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన ఆహారాలను ఎక్కువగా తీసుకోండి.
(4 / 6)
నెయ్యి, నువ్వులు, ఆలివ్ నూనె మొదలైన ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన ఆహారాలను ఎక్కువగా తీసుకోండి.(Shutterstock)
రుమటాయిడ్ ఆర్థరైటిస్ మినహా అన్ని రకాల కీళ్ల నొప్పులకు అభ్యంగ లేదా మసాజ్ ఉత్తమంగా పనిచేస్తుంది. నువ్వుల నూనె, ఆవ నూనె, ఆముదం లాంటి నూనెలు తీసుకోవాలి. వీటిని కీళ్లపై మర్ధన చేయడం ద్వారా నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. వీటితో పాటు కొన్ని ఆయుర్వేద తైలాలైన: మహానారాయణ తైలా, నిర్గుండి తైలా, కొట్టంచుక్కడి తైలం, సహచరాది తైలం, ధన్వంతరం తైలం మొదలైనవి నొప్పిని నివారిస్తాయి.
(5 / 6)
రుమటాయిడ్ ఆర్థరైటిస్ మినహా అన్ని రకాల కీళ్ల నొప్పులకు అభ్యంగ లేదా మసాజ్ ఉత్తమంగా పనిచేస్తుంది. నువ్వుల నూనె, ఆవ నూనె, ఆముదం లాంటి నూనెలు తీసుకోవాలి. వీటిని కీళ్లపై మర్ధన చేయడం ద్వారా నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. వీటితో పాటు కొన్ని ఆయుర్వేద తైలాలైన: మహానారాయణ తైలా, నిర్గుండి తైలా, కొట్టంచుక్కడి తైలం, సహచరాది తైలం, ధన్వంతరం తైలం మొదలైనవి నొప్పిని నివారిస్తాయి.(Pixabay)
కొన్ని ఆయుర్వేద మూలికలైనటువంటి శల్లకి, అశ్వగంధ, నిర్గుండి, రస్నా, హరిద్ర (పసుపు), శొంఠి మొదలైనవి సేవించడం ద్వారా కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
(6 / 6)
కొన్ని ఆయుర్వేద మూలికలైనటువంటి శల్లకి, అశ్వగంధ, నిర్గుండి, రస్నా, హరిద్ర (పసుపు), శొంఠి మొదలైనవి సేవించడం ద్వారా కీళ్ల నొప్పులు తగ్గుతాయి.(HT Photo)

    ఆర్టికల్ షేర్ చేయండి