తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ranveer's Fashion | బాలీవుడ్ పూలరంగడు.. రంగురంగుల దుస్తుల్లో రణవీర్ నయా ఫ్యాషన్!

Ranveer's Fashion | బాలీవుడ్ పూలరంగడు.. రంగురంగుల దుస్తుల్లో రణవీర్ నయా ఫ్యాషన్!

27 March 2022, 10:14 IST

రణ్‌వీర్ సింగ్ బాలీవుడ్ హీరోగా, స్టార్ హీరోయిన్ దీపికా పడుకోన్ భర్తగా అందరికీ సుపరిచితమే. కానీ అతడు తెరపైన తన హీరోయిజంతోనే కాకుండా తెర బయట అతడి ఫ్యాషన్ తో కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తాడు. నిజం చెప్పాలంటే భార్య దీపికా కూడా కుళ్లుకునేలా రణ్‌వీర్ ఆహార్యం ఉంటుంది.

  • రణ్‌వీర్ సింగ్ బాలీవుడ్ హీరోగా, స్టార్ హీరోయిన్ దీపికా పడుకోన్ భర్తగా అందరికీ సుపరిచితమే. కానీ అతడు తెరపైన తన హీరోయిజంతోనే కాకుండా తెర బయట అతడి ఫ్యాషన్ తో కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తాడు. నిజం చెప్పాలంటే భార్య దీపికా కూడా కుళ్లుకునేలా రణ్‌వీర్ ఆహార్యం ఉంటుంది.
రణవీర్ సింగ్ డ్రెస్సింగ్ సెన్స్ ప్రత్యేకంగా ఉంటుంది. అదే నలుగురిలో అతణ్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. రణవీర్ తన ఇటీవలి ఫ్యాషన్ ఫోటోషూట్‌లలోని కొన్ని ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అన్ని రంగులను మిక్స్ చేసి కొత్త ఫ్యాషన్ ట్రెండ్ ఎలా సృష్టించవచ్చో తెలుసుకోవాలంటే ఆయనను ఫాలో అవ్వాల్సిందే.
(1 / 6)
రణవీర్ సింగ్ డ్రెస్సింగ్ సెన్స్ ప్రత్యేకంగా ఉంటుంది. అదే నలుగురిలో అతణ్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. రణవీర్ తన ఇటీవలి ఫ్యాషన్ ఫోటోషూట్‌లలోని కొన్ని ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అన్ని రంగులను మిక్స్ చేసి కొత్త ఫ్యాషన్ ట్రెండ్ ఎలా సృష్టించవచ్చో తెలుసుకోవాలంటే ఆయనను ఫాలో అవ్వాల్సిందే.(Instagram/@ranveersingh)
తెల్లటి గ్రాఫిక్ టీ-షర్ట్‌ వేసుకొని దానికి మ్యాచింగ్ గా ఒక ప్రకాశవంతమైన పసుపుపచ్చని ప్యాంట్ వేసుకున్నాడు. ఆపై జాతరలో దొరికేటువంటి పింక్ కలర్ నల్లకళ్లజోడు పెట్టుకొని, తల మీద ఎర్రటి హెయిర్ బ్యాండ్ తగిలించుకున్నాడు. ఇక టీషర్ట్ మీదకు స్టైలిష్ డెనిమ్ జాకెట్‌ తొడుక్కుని స్టైల్ గా ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఇది చూసిన అభిమానులు.. వావ్ రంగురంగుల రణవీర్ అంటూ కమెంట్స్ చేస్తున్నారు.
(2 / 6)
తెల్లటి గ్రాఫిక్ టీ-షర్ట్‌ వేసుకొని దానికి మ్యాచింగ్ గా ఒక ప్రకాశవంతమైన పసుపుపచ్చని ప్యాంట్ వేసుకున్నాడు. ఆపై జాతరలో దొరికేటువంటి పింక్ కలర్ నల్లకళ్లజోడు పెట్టుకొని, తల మీద ఎర్రటి హెయిర్ బ్యాండ్ తగిలించుకున్నాడు. ఇక టీషర్ట్ మీదకు స్టైలిష్ డెనిమ్ జాకెట్‌ తొడుక్కుని స్టైల్ గా ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఇది చూసిన అభిమానులు.. వావ్ రంగురంగుల రణవీర్ అంటూ కమెంట్స్ చేస్తున్నారు.(Instagram/@ranveersingh)
సాధారణంగా అమ్మాయిలకు మాత్రమే సాధ్యపడే ఇలాంటి కాంబినేషన్ దుస్తులను, రణవీర్ సింగ్ ధరించి ఫ్యాషన్ కు కొత్త ట్రెండ్ ను పరిచయం చేస్తున్నాడు.
(3 / 6)
సాధారణంగా అమ్మాయిలకు మాత్రమే సాధ్యపడే ఇలాంటి కాంబినేషన్ దుస్తులను, రణవీర్ సింగ్ ధరించి ఫ్యాషన్ కు కొత్త ట్రెండ్ ను పరిచయం చేస్తున్నాడు.(Instagram/@ranveersingh)
"హై కీ ప్రోక్రాస్టినేటింగ్" అని రణవీర్ తన పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చాడు. అంటే చివరి క్షణం వరకు వేచి చూడు అనే అర్థం వస్తుంది.. ఇది అసలైన దుబాయ్ షాపింగ్ అంటే అని మరో బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ కమెంట్ చేశాడు.
(4 / 6)
"హై కీ ప్రోక్రాస్టినేటింగ్" అని రణవీర్ తన పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చాడు. అంటే చివరి క్షణం వరకు వేచి చూడు అనే అర్థం వస్తుంది.. ఇది అసలైన దుబాయ్ షాపింగ్ అంటే అని మరో బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ కమెంట్ చేశాడు.(Instagram/@ranveersingh)
రణవీర్ వేసుకునే క్యాజువల్ దుస్తులు కూడా కనుల విందుగా ఉంటాయి. కొన్ని రోజుల క్రితం.. పువ్వులు.. పైనాపిల్ పండ్లు ప్రింట్ చేసిన పూలపూల చొక్కా ఒకటి ధరించి ఫ్యాషన్ ట్రాఫిక్‌ను పెంచాడు.
(5 / 6)
రణవీర్ వేసుకునే క్యాజువల్ దుస్తులు కూడా కనుల విందుగా ఉంటాయి. కొన్ని రోజుల క్రితం.. పువ్వులు.. పైనాపిల్ పండ్లు ప్రింట్ చేసిన పూలపూల చొక్కా ఒకటి ధరించి ఫ్యాషన్ ట్రాఫిక్‌ను పెంచాడు.(Instagram/@ranveersingh)
రణవీర్ తాను వేసుకునే దుస్తులకు తగినట్లుగా యాక్సెసరీస్ కూడా ధరిస్తాడు. మెడలో వెండి నెక్కిలేసు గొలుసు వేసుకోవడం కూడా రణవీర్ కే చెల్లుతుంది.
(6 / 6)
రణవీర్ తాను వేసుకునే దుస్తులకు తగినట్లుగా యాక్సెసరీస్ కూడా ధరిస్తాడు. మెడలో వెండి నెక్కిలేసు గొలుసు వేసుకోవడం కూడా రణవీర్ కే చెల్లుతుంది.(Instagram/@ranveersingh)

    ఆర్టికల్ షేర్ చేయండి