తెలుగు న్యూస్  /  ఫోటో  /  Omicron | మీ పిల్లలు దగ్గుతున్నారా? అది ఒమిక్రానా? జలుబా? ఇలా తెలుసుకోండి!

Omicron | మీ పిల్లలు దగ్గుతున్నారా? అది ఒమిక్రానా? జలుబా? ఇలా తెలుసుకోండి!

26 January 2022, 16:23 IST

దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. దీని బారి నుంచి పిల్లలు కూడా తప్పించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో వాళ్లలో ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఫోర్టిస్ హాస్పిటల్ సీనియర్ పీడియాట్రిషియన్ డాక్టర్ జేసల్ సేథ్ చెబుతున్నారు.

  • దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. దీని బారి నుంచి పిల్లలు కూడా తప్పించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో వాళ్లలో ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఫోర్టిస్ హాస్పిటల్ సీనియర్ పీడియాట్రిషియన్ డాక్టర్ జేసల్ సేథ్ చెబుతున్నారు.
కరోనా వైరస్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకినా సాధారణ ఫ్లూ వంటి లక్షణాలే కనిపిస్తున్నాయి. ముక్కు కారడం, తుమ్ములు, గొంతు నొప్పి, తలనొప్పి, దగ్గు వంటివి ఉంటున్నాయి. మీ పిల్లల్లోనూ ఇలాంటి లక్షణాలే కనిపిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎప్పుడు ఒమిక్రాన్‌ కోసం టెస్ట్‌ చేయించాలో ఫోర్టిస్‌ హాస్పిటల్‌ సీనియర్‌ పీడియాట్రిషియన్‌ జేసల్‌ సేథ్‌ చెబుతున్నారు.
(1 / 7)
కరోనా వైరస్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకినా సాధారణ ఫ్లూ వంటి లక్షణాలే కనిపిస్తున్నాయి. ముక్కు కారడం, తుమ్ములు, గొంతు నొప్పి, తలనొప్పి, దగ్గు వంటివి ఉంటున్నాయి. మీ పిల్లల్లోనూ ఇలాంటి లక్షణాలే కనిపిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎప్పుడు ఒమిక్రాన్‌ కోసం టెస్ట్‌ చేయించాలో ఫోర్టిస్‌ హాస్పిటల్‌ సీనియర్‌ పీడియాట్రిషియన్‌ జేసల్‌ సేథ్‌ చెబుతున్నారు.(Pexels)
జలుపు, ఫ్లూ లక్షణాలు తగ్గించడానికి తరచూ పిల్లలకు నీళ్లు తాగించడం మంచిది. దీనివల్ల శరీరంలో ద్రవాలు తగిన స్థాయిలో ఉంటాయి. పిల్లలకు దాహం వేయకపోయినా.. తరచూ నీళ్లు తాగుతుండాలని పేరెంట్స్‌ చెబుతుండాలి.
(2 / 7)
జలుపు, ఫ్లూ లక్షణాలు తగ్గించడానికి తరచూ పిల్లలకు నీళ్లు తాగించడం మంచిది. దీనివల్ల శరీరంలో ద్రవాలు తగిన స్థాయిలో ఉంటాయి. పిల్లలకు దాహం వేయకపోయినా.. తరచూ నీళ్లు తాగుతుండాలని పేరెంట్స్‌ చెబుతుండాలి.(Pixabay)
వేపర్‌ రబ్స్‌ కూడా పిల్లలకు బాగా పని చేస్తాయి. వీటిని వారి ఛాతీ, వెనుక భాగాల్లో రాస్తూ ఉండండి. నేరుగా ముక్కుకు రాయకూడదు. వేపర్‌ రబ్స్‌ వారికి తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తాయి.
(3 / 7)
వేపర్‌ రబ్స్‌ కూడా పిల్లలకు బాగా పని చేస్తాయి. వీటిని వారి ఛాతీ, వెనుక భాగాల్లో రాస్తూ ఉండండి. నేరుగా ముక్కుకు రాయకూడదు. వేపర్‌ రబ్స్‌ వారికి తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తాయి.(Pixabay)
ఒకవేళ మీ పిల్లలకు రెండు రోజులుగా జలుపు, దగ్గు, ముక్కు కారడం వంటి లక్షణాలు ఉంటే వారిని వెంటనే డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లి తగిన చికిత్స అందేలా చూడండి. కరోనా వేరియంట్లు సోకినప్పుడైనా, సాధారణ జలుబులో కూడా ఒకే లక్షణాలు కనిపిస్తుండటంతో చాలా మందిలో అయోమయం నెలకొంది. అందువల్ల సాధ్యమైనంత త్వరగా డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లి చికిత్స అందించడం ముఖ్యం.
(4 / 7)
ఒకవేళ మీ పిల్లలకు రెండు రోజులుగా జలుపు, దగ్గు, ముక్కు కారడం వంటి లక్షణాలు ఉంటే వారిని వెంటనే డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లి తగిన చికిత్స అందేలా చూడండి. కరోనా వేరియంట్లు సోకినప్పుడైనా, సాధారణ జలుబులో కూడా ఒకే లక్షణాలు కనిపిస్తుండటంతో చాలా మందిలో అయోమయం నెలకొంది. అందువల్ల సాధ్యమైనంత త్వరగా డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లి చికిత్స అందించడం ముఖ్యం.(Pixabay)
కరోనా వైరస్‌ సోకకుండా ఉండాలంటే మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలి. పిల్లలకు కూడా మాస్కులు కచ్చితంగా పెట్టండి. అలాగే చేతులను శుభ్రంగా కడుక్కునే అలవాటు చేయండి.
(5 / 7)
కరోనా వైరస్‌ సోకకుండా ఉండాలంటే మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలి. పిల్లలకు కూడా మాస్కులు కచ్చితంగా పెట్టండి. అలాగే చేతులను శుభ్రంగా కడుక్కునే అలవాటు చేయండి.(Pixabay)
ఇంట్లో అయినా, బయట అయినా.. ఎక్కువ మంది గుమిగూడిన చోట ఉండొద్దు. మీరైనా, పిల్లలైనా ఇంట్లో ఉండటమే సురక్షితం. మీ పిల్లలకు ఫ్లూ లక్షణాలు ఉన్నప్పుడు అత్యవసరమైతేనే బయటకు వెళ్లండి.
(6 / 7)
ఇంట్లో అయినా, బయట అయినా.. ఎక్కువ మంది గుమిగూడిన చోట ఉండొద్దు. మీరైనా, పిల్లలైనా ఇంట్లో ఉండటమే సురక్షితం. మీ పిల్లలకు ఫ్లూ లక్షణాలు ఉన్నప్పుడు అత్యవసరమైతేనే బయటకు వెళ్లండి.(Pexels)
ఈ కష్టకాలంలో తల్లిదండ్రులు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండాలి. పిల్లలకు ఏమైనా అయితే పేరెంట్స్‌ తల్లడిల్లడం సహజమే. కానీ ఇలాంటి సమయంలో ప్రతికూల ఆలోచనలు చేస్తూ ఆందోళన చెందడం కంటే.. అవసరమైన చర్యలు చేపట్టడం మంచిది.
(7 / 7)
ఈ కష్టకాలంలో తల్లిదండ్రులు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండాలి. పిల్లలకు ఏమైనా అయితే పేరెంట్స్‌ తల్లడిల్లడం సహజమే. కానీ ఇలాంటి సమయంలో ప్రతికూల ఆలోచనలు చేస్తూ ఆందోళన చెందడం కంటే.. అవసరమైన చర్యలు చేపట్టడం మంచిది.(Pixabay)

    ఆర్టికల్ షేర్ చేయండి