తెలుగు న్యూస్  /  ఫోటో  /  Control Cholesterol | ఇవి తింటే చాలు.. కొలెస్ట్రాల్ అదుపులోకి వచ్చేస్తుంది..

Control Cholesterol | ఇవి తింటే చాలు.. కొలెస్ట్రాల్ అదుపులోకి వచ్చేస్తుంది..

28 February 2022, 11:46 IST

ఏదైనా మితిమీరితే అనర్థమే. వాటిలో ముఖ్యంగా కొలెస్ట్రాల్ గురించి చెప్పవచ్చు. కొలెస్ట్రాల్ ప్రతీ శరీరానికి అవసరమే. కానీ ఎక్కువైతేనే ప్రమాదం. ఒక వేళ మీ తల్లిదండ్రలకు అధిక కొలెస్ట్రాల్ ఉంటే.. మీరు కూడా చెక్​ చేయించుకోండి. ఉన్నా.. లేకున్నా మాత్రం కొలెస్ట్రాల్​ను ఈ పదార్థాలతో అదుపులో ఉంచుకోండి. 

  • ఏదైనా మితిమీరితే అనర్థమే. వాటిలో ముఖ్యంగా కొలెస్ట్రాల్ గురించి చెప్పవచ్చు. కొలెస్ట్రాల్ ప్రతీ శరీరానికి అవసరమే. కానీ ఎక్కువైతేనే ప్రమాదం. ఒక వేళ మీ తల్లిదండ్రలకు అధిక కొలెస్ట్రాల్ ఉంటే.. మీరు కూడా చెక్​ చేయించుకోండి. ఉన్నా.. లేకున్నా మాత్రం కొలెస్ట్రాల్​ను ఈ పదార్థాలతో అదుపులో ఉంచుకోండి. 
కుటుంబంలో అధిక కొలెస్ట్రాల్ చరిత్ర ఉన్నట్లయితే.. తర్వాత తరం వారిపై కూడా దాని ప్రభావం ఉంటుందని అంటున్నారు నిపుణులు. చిన్న వయసులో కొలెస్ట్రాల్​ సమస్యలు కనిపించకపోయినా.. తర్వాత దశలో ఇది ప్రధాన సమస్యగా మారుతుంది అంటున్నారు. ఈ సమస్యను దూరంగా ఉంచడానికి ఆహారంలో మార్పులు అవసరమని సూచిస్తున్నారు. 
(1 / 7)

కొలెస్ట్రాల్​లో చెడు కొలెస్ట్రాల్​ ఎంత ముప్పో.. మంచి కొలెస్ట్రాల్​ కూడా అంతే ముఖ్యం. విటమిన్ బి12లో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. ఆలివ్ ఆయిల్, గింజలు, గుడ్లు వంటి వాటిలో బి12 పుష్కలంగా ఉంటుంది. ఇవి మంచి కొలెస్ట్రాల్​ను అందించడమే కాకుండా.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తాయి. 
(2 / 7)

రెడ్​ మీట్ శరీరంలోని​ కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. అంతే కాకుండా రుచికి బాగుండే వేయించిన పదార్థాలను తీసుకోకపోవడమే మంచిది అంటున్నారు నిపుణలు. వీటి వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి రెగ్యూలర్ డైట్​లో వేయించినవాటికి, రెడ్​మీట్​కు దూరంగా ఉండటమే మంచిదని సూచిస్తున్నారు. 
(3 / 7)

ఏ డైట్​లో అయినా ఉదయం తీసుకునే అల్పహారం ముఖ్యం. కాబట్టి టిఫెన్స్​లో ఓట్స్ తీసుకోవడం మంచిది. ఇవి శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. ఓట్స్​తో పాటు వివిధ రకాల పండ్లను కలిపి తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. 
(4 / 7)

మధ్యాహ్నం భోజనాన్ని వెల్లుల్లితో ప్రారంభించమంటున్నారు ఆరోగ్య నిపుణులు. వారి అభిప్రాయం ప్రకారం వెల్లుల్లి కొలెస్ట్రాల్​ను అదుపులో ఉంచడమే కాకుండా.. అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుందని నమ్మకం.
(5 / 7)

కొలెస్ట్రాల్​ను అదుపులో ఉంచేవాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గ్రీన్ టీ గురించి. దీనిలో ఉండే ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్..  కొలెస్ట్రాల్ స్థాయిని​ అదుపులో ఉంచేందుకు సహకరిస్తాయి. అందుకే ప్రతిరోజూ కనీసం ఒక కప్పు గ్రీన్​టీని తీసుకోవడం మంచిది.
(6 / 7)

స్ట్రాబెర్రీ పళ్లు అధిక కొలెస్ట్రాల్​ను దూరంగా ఉంచడంలో చాలా సహాయపడతాయి. నెల రోజుల పాటు రోజూ ఒక స్ట్రాబెర్రీ తీసుకుంటే కొలెస్ట్రాల్​ స్థాయిలు అదుపులో ఉంటాయి. 
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి