తెలుగు న్యూస్  /  ఫోటో  /  Wedding Destinations | వేసవిలో వివాహాలకు ఇండియాలోనే 5 అద్భుతమైన ప్రదేశాలు

Wedding Destinations | వేసవిలో వివాహాలకు ఇండియాలోనే 5 అద్భుతమైన ప్రదేశాలు

11 May 2022, 18:11 IST

వివాహాల కొరకు ఈ 2022 వేసవిలో ఏప్రిల్ నుంచి జూలై వరకు దాదాపు 29 మంచి ముహూర్తాలు వచ్చాయి. ఏడాది మొత్తంలో సగానికి పైగా ముహూర్తాలు ఈ మూడు నెలల్లోనే ఉన్నాయి.  అయితే ఎండాకాలంలో ఈ వేడికి దూరంగా ఎక్కడైనా చల్లని ప్రదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తే, ఇండియాలో ఈ 5 బెస్ట్.

వివాహాల కొరకు ఈ 2022 వేసవిలో ఏప్రిల్ నుంచి జూలై వరకు దాదాపు 29 మంచి ముహూర్తాలు వచ్చాయి. ఏడాది మొత్తంలో సగానికి పైగా ముహూర్తాలు ఈ మూడు నెలల్లోనే ఉన్నాయి.  అయితే ఎండాకాలంలో ఈ వేడికి దూరంగా ఎక్కడైనా చల్లని ప్రదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తే, ఇండియాలో ఈ 5 బెస్ట్.

ఈవెంట్ మేనేజ్మెంట్ గణాంకాల ప్రకారం ఏప్రిల్-జూలై మధ్య కాలంలో భారతదేశవ్యాప్తంగా దాదాపు 40 లక్షల వివాహాలు జరగనున్నట్లు అంచనా. అయితే మరి ఇంత మంది ఉన్నప్పుడు వివాహానికి సిద్ధమవుతున్న వారు వారి వివాహ వేదికకు సంబంధించి ముందస్తు ప్లాన్ వేసుకోవడం ఎంతైనా మంచిది. మీరు చల్లని ప్రదేశాల్లో వివాహం చేసుకోవాలనుకుంటే ఈ ప్రదేశాల్లో చేసుకోండి. మీకు జీవితాంతం గుర్తిండిపోతుంది.
(1 / 6)
ఈవెంట్ మేనేజ్మెంట్ గణాంకాల ప్రకారం ఏప్రిల్-జూలై మధ్య కాలంలో భారతదేశవ్యాప్తంగా దాదాపు 40 లక్షల వివాహాలు జరగనున్నట్లు అంచనా. అయితే మరి ఇంత మంది ఉన్నప్పుడు వివాహానికి సిద్ధమవుతున్న వారు వారి వివాహ వేదికకు సంబంధించి ముందస్తు ప్లాన్ వేసుకోవడం ఎంతైనా మంచిది. మీరు చల్లని ప్రదేశాల్లో వివాహం చేసుకోవాలనుకుంటే ఈ ప్రదేశాల్లో చేసుకోండి. మీకు జీవితాంతం గుర్తిండిపోతుంది.(Twitter/Expedition2Inc)
Shimla - సిమ్లా ప్రసిద్ధమైన పర్యాటక కేంద్రంతో పాటు వివాహాలకు గొప్ప వేదిక. ఇక్కడ ఎన్నో అందమైన ఎస్టేట్‌లు ఉన్నాయి. వీటిలో కొన్ని మరపురాని వివాహ వేడుకకు అద్భుత వేదికలుగా నిలుస్తాయి. చుట్టూ మంచుకొండల మధ్య వివాహం మీకు వీనుల విందును కల్పిస్తుంది.
(2 / 6)
Shimla - సిమ్లా ప్రసిద్ధమైన పర్యాటక కేంద్రంతో పాటు వివాహాలకు గొప్ప వేదిక. ఇక్కడ ఎన్నో అందమైన ఎస్టేట్‌లు ఉన్నాయి. వీటిలో కొన్ని మరపురాని వివాహ వేడుకకు అద్భుత వేదికలుగా నిలుస్తాయి. చుట్టూ మంచుకొండల మధ్య వివాహం మీకు వీనుల విందును కల్పిస్తుంది.(Instagram/@glenviewresortkasauli)
 Andaman and Nicobar Islands - మీరు అండమాన్- నికోబార్ దీవులలో వివాహం చేసుకుంటే హనీమూన్ కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. వివాహం- విహారం అన్నీ ఇక్కడే అవుతాయి. ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడి వాతావరణం.
(3 / 6)
 Andaman and Nicobar Islands - మీరు అండమాన్- నికోబార్ దీవులలో వివాహం చేసుకుంటే హనీమూన్ కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. వివాహం- విహారం అన్నీ ఇక్కడే అవుతాయి. ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడి వాతావరణం.(File Photo)
Rishikesh -రిషికేశ్ - పవిత్ర గంగానది ఒడ్డున వేదమంత్రోచ్ఛరణల మధ్య వివాహం ఎంతో కమనీయంగా ఉంటుంది. అత్యంత దైవికమైన వివాహ వేదికలలో ఇది ఒకటి. హిమాలయ పర్వతాలతో విరాజిల్లే రిషికేశ్ ప్రశాంతమైన, అందమైన గమ్యస్థానం. ఆఫ్‌బీట్ వేసవి వివాహానికి రిషికేశ్ అనువైన ప్రదేశం
(4 / 6)
Rishikesh -రిషికేశ్ - పవిత్ర గంగానది ఒడ్డున వేదమంత్రోచ్ఛరణల మధ్య వివాహం ఎంతో కమనీయంగా ఉంటుంది. అత్యంత దైవికమైన వివాహ వేదికలలో ఇది ఒకటి. హిమాలయ పర్వతాలతో విరాజిల్లే రిషికేశ్ ప్రశాంతమైన, అందమైన గమ్యస్థానం. ఆఫ్‌బీట్ వేసవి వివాహానికి రిషికేశ్ అనువైన ప్రదేశం(Twitter/SummitHRPL)
Kerala - కేరళలలో వివాహం అంటే భూలోక స్వర్గంలో చేసుకున్నట్లు ఉంటుంది. అందమైన తీరప్రాంతం, ప్రశాంతమైన బ్యాక్ వాటర్స్ మిమ్మల్ని మైమరింపజేస్తాయి. ఇక్కడి అలెప్పిలో విలాసవంతమైన వివాహ వేడుకను జరుపుకోవచ్చు. హానీమూన్ సెలవులను ఆస్వాదించవచ్చు. 
(5 / 6)
Kerala - కేరళలలో వివాహం అంటే భూలోక స్వర్గంలో చేసుకున్నట్లు ఉంటుంది. అందమైన తీరప్రాంతం, ప్రశాంతమైన బ్యాక్ వాటర్స్ మిమ్మల్ని మైమరింపజేస్తాయి. ఇక్కడి అలెప్పిలో విలాసవంతమైన వివాహ వేడుకను జరుపుకోవచ్చు. హానీమూన్ సెలవులను ఆస్వాదించవచ్చు. (Twitter/movinj)
Goa - యుగయుగాలుగా ఎన్నో అందమైన జంటలకు గోవా ఒక సుందరమైన వేదిక. ఆటాపాట, బాజాభజంత్రీలతో ఇక్కడ వివాహం అంటే ఒక పండగలా ఉంటుంది.
(6 / 6)
Goa - యుగయుగాలుగా ఎన్నో అందమైన జంటలకు గోవా ఒక సుందరమైన వేదిక. ఆటాపాట, బాజాభజంత్రీలతో ఇక్కడ వివాహం అంటే ఒక పండగలా ఉంటుంది.(Twitter/TourismGoa)

    ఆర్టికల్ షేర్ చేయండి