తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ts Inter Results 2024 Updates : ఆలోపు మార్కుల ఎంట్రీ పూర్తి..! తెలంగాణ ఇంటర్‌ ఫలితాల తాజా అప్డేట్స్ ఇవే

TS Inter Results 2024 Updates : ఆలోపు మార్కుల ఎంట్రీ పూర్తి..! తెలంగాణ ఇంటర్‌ ఫలితాల తాజా అప్డేట్స్ ఇవే

29 March 2024, 17:55 IST

Telangana Inter Results 2024 Updates : తెలంగాణ ఇంటర్  జవాబు పత్రాల మూల్యాంకనం కొనసాగుతోంది. మొత్తం నాలుగు విడుతల్లో స్పాట్ పూర్తి చేయాలని నిర్ణయించగా… మూడు దశలు పూర్తి అయ్యాయి. ప్రస్తుతం నాలుగో విడత కొనసాగుతోంది. ఫలితాల విడుదలకు సంబంధించి లెటేస్ట్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…..

  • Telangana Inter Results 2024 Updates : తెలంగాణ ఇంటర్  జవాబు పత్రాల మూల్యాంకనం కొనసాగుతోంది. మొత్తం నాలుగు విడుతల్లో స్పాట్ పూర్తి చేయాలని నిర్ణయించగా… మూడు దశలు పూర్తి అయ్యాయి. ప్రస్తుతం నాలుగో విడత కొనసాగుతోంది. ఫలితాల విడుదలకు సంబంధించి లెటేస్ట్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…..
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే.. మార్చి 19వ తేదీతో ఈ ఎగ్జామ్స్ అన్ని పూర్తి అయ్యాయి. ఈసారి పరీక్షలకు మొత్తం 9,22,520 మంది విద్యార్థులు ఎగ్జామ్ ఫీజును చెల్లించారు. ఇందులో 4,78,527 మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఉండగా... 4 లక్షలకుపైగా సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు. 
(1 / 6)
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే.. మార్చి 19వ తేదీతో ఈ ఎగ్జామ్స్ అన్ని పూర్తి అయ్యాయి. ఈసారి పరీక్షలకు మొత్తం 9,22,520 మంది విద్యార్థులు ఎగ్జామ్ ఫీజును చెల్లించారు. ఇందులో 4,78,527 మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఉండగా... 4 లక్షలకుపైగా సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు. (TS Inter Board Website)
ఇంటర్ పరీక్షలు పూర్తి కావటంతో వెంటనే స్పాట్ ను నిర్వహిస్తోంది ఇంటర్మీడియట్ బోర్డు. మొత్తం 4 విడతల్లో వాల్యూయేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది. అయితే ఇప్పటికే మూడు విడుతలు పూర్తి అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాలుగో విడుత కొనసాగుతోంది.
(2 / 6)

ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ పరీక్షల మూల్యాంకనం కోసం రాష్ట్రవ్యాప్తంగా 16 కేంద్రాలను ఏర్పాటు చేసింది తెలంగాణ ఇంటర్ బోర్డు. మొత్తం 60 లక్షల పేపర్లు మూల్యాంకనం కానున్నాయి. సబ్జెక్టుల వారీగా 20 వేల మంది అధ్యాపకులు ఈ ప్రక్రియలో ఉన్నారు.
(3 / 6)

స్పాట్ విధుల్లో ఉన్న లెక్చరర్… రోజు మొత్తంలో 30 పేపర్లను వాల్యూయేషన్ చేస్తున్నారు. రెండు షిఫ్టుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు.  జవాబు పత్రాల మూల్యాంకనంలో సిబ్బంది ఎలాంటి తప్పులు చేయవద్దని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. గత అనుభవాల దృష్ట్యా.... ఈసారి ఎలాంటి వాటికి అవకాశం ఇవ్వొద్దని సూచించింది. పూర్తిస్థాయిలో క్షుణ్ణంగా జవాబు పత్రాలను పరిశీలించిన తర్వాతే... మార్కులను ఎంట్రీ చేయాలని సిబ్బందికి దిశానిర్దేశం చేసింది. వాల్యూయేషన్ ప్రక్రియను మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేక అధికారులను కూడా నియమించింది.
(4 / 6)

వాల్యూయేషన్ పూర్తి అయిన తర్వాత… దాదాపు పది రకాలుగా పరిశీలించిన తర్వాతే…ఆన్ లైన్ లో మార్కులను నమోదు చేసేలా ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంది. ఆన్ లైన్ లో మార్కుల ఎంట్రీతో పాటు సాంకేతికపరమైన అంశాలన్నీ కూడా ఏప్రిల్ రెండో వారంలోపు పూర్తి అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏప్రిల్ మూడో వారం చివర లేదా నాల్గో వారంలో ఫలితాలను ప్రకటించే ఛాన్స్ ఉంది.
(5 / 6)

 ఎన్నికల ప్రక్రియ నడుస్తున్న నేపథ్యంలో… . సాధ్యమైనంత త్వరగా పరీక్షల  ఫలితాలను ప్రకటించే యోచనలో విద్యాశాఖ ఉంది. ఈ ఫలితాలను  https://tsbie.cgg.gov.in/home.do వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. గతేడాది మాదిరిగానే హిందుస్తాన్ తెలుగు వెబ్ సైట్ లోని  https://telugu.hindustantimes.com/telangana/results  లోకి వెళ్లి సింపుల్ గా రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు.
(6 / 6)
 ఎన్నికల ప్రక్రియ నడుస్తున్న నేపథ్యంలో… . సాధ్యమైనంత త్వరగా పరీక్షల  ఫలితాలను ప్రకటించే యోచనలో విద్యాశాఖ ఉంది. ఈ ఫలితాలను  https://tsbie.cgg.gov.in/home.do వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. గతేడాది మాదిరిగానే హిందుస్తాన్ తెలుగు వెబ్ సైట్ లోని  https://telugu.hindustantimes.com/telangana/results  లోకి వెళ్లి సింపుల్ గా రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు.(Photo From https://unsplash.com/)

    ఆర్టికల్ షేర్ చేయండి