తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ts Govt New Ration Card Updates : ఆ రోజే నిర్ణయం...! కొత్త రేషన్ కార్డుల మంజూరుపై తాజా అప్డేట్ ఇదే

TS Govt New Ration Card Updates : ఆ రోజే నిర్ణయం...! కొత్త రేషన్ కార్డుల మంజూరుపై తాజా అప్డేట్ ఇదే

10 March 2024, 13:27 IST

Telangana Govt Latest News : రేషన్ కార్డులకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది తెలంగాణ సర్కార్. గృహజ్యోతి పథకం కింద ఇస్తున్న ఉచిత కరెంట్ పై ప్రకటన చేసింది. ఇదే కాకుండా కొత్త రేషన్ కార్డుల విషయంలోనూ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

  • Telangana Govt Latest News : రేషన్ కార్డులకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది తెలంగాణ సర్కార్. గృహజ్యోతి పథకం కింద ఇస్తున్న ఉచిత కరెంట్ పై ప్రకటన చేసింది. ఇదే కాకుండా కొత్త రేషన్ కార్డుల విషయంలోనూ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
కొత్త రేషన్ కార్డుల మంజూరుపై దృష్టిపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. నూతన కార్డుల మంజూరుపై నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
(1 / 5)
కొత్త రేషన్ కార్డుల మంజూరుపై దృష్టిపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. నూతన కార్డుల మంజూరుపై నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.(https://epds.telangana.gov.in/)
ప్రజాపాలన కార్యక్రమంలో చాలా మంది కొత్త రేషన్ కార్డు కోసం తెల్ల కాగితంపై రాసి దరఖాస్తు పెట్టుకున్నారు. ఇక దరఖాస్తు చేసుకొనివాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే రేషన్ కార్డుల మంజూరు విషయంలో ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది సర్కార్.
(2 / 5)
ప్రజాపాలన కార్యక్రమంలో చాలా మంది కొత్త రేషన్ కార్డు కోసం తెల్ల కాగితంపై రాసి దరఖాస్తు పెట్టుకున్నారు. ఇక దరఖాస్తు చేసుకొనివాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే రేషన్ కార్డుల మంజూరు విషయంలో ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది సర్కార్.(https://epds.telangana.gov.in/)
మార్చి 12వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలోనే కొత్త రేషన్ కార్డుల మంజూరుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. 
(3 / 5)
మార్చి 12వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలోనే కొత్త రేషన్ కార్డుల మంజూరుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. (CMO Twitter Telangana)
ఇప్పటికే ఈకేవైసీ ప్రక్రియ గురించి పౌరసరఫరాల శాఖ నుంచి వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది. 
(4 / 5)
ఇప్పటికే ఈకేవైసీ ప్రక్రియ గురించి పౌరసరఫరాల శాఖ నుంచి వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది. (https://epds.telangana.gov.in/)
మరోవైపు తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి రేవంత్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రేషన్ కార్డు ఉండి.. 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడినా జీరో కరెంట్ బిల్లులు రాకపోతే అలాంటి వారు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు. అర్హతలు ఉండి జీరో బిల్లులు రానివారు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 
(5 / 5)
మరోవైపు తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి రేవంత్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రేషన్ కార్డు ఉండి.. 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడినా జీరో కరెంట్ బిల్లులు రాకపోతే అలాంటి వారు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు. అర్హతలు ఉండి జీరో బిల్లులు రానివారు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. (https://epds.telangana.gov.in/)

    ఆర్టికల్ షేర్ చేయండి