తెలుగు న్యూస్  /  ఫోటో  /  Lakshmi Devi: లక్ష్మీ దేవికి ఈ అలవాట్లు నచ్చవు, మీకు ఉంటే వెంటనే వదిలేయండి

Lakshmi Devi: లక్ష్మీ దేవికి ఈ అలవాట్లు నచ్చవు, మీకు ఉంటే వెంటనే వదిలేయండి

04 May 2024, 13:27 IST

Lakshmi Devi: లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే కొన్ని రకాల అలవాట్లు ఉండకూడదు. ఆమెకు నచ్చని పనులు మీరు ఇంట్లో చేస్తే ఆమె మిమ్మల్ని కటాక్షించదు.

  • Lakshmi Devi: లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే కొన్ని రకాల అలవాట్లు ఉండకూడదు. ఆమెకు నచ్చని పనులు మీరు ఇంట్లో చేస్తే ఆమె మిమ్మల్ని కటాక్షించదు.
లక్ష్మీదేవిని సంపదకు అధిదేవతగా శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఆమె కృప ఉండే ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. కానీ లక్ష్మీదేవికి కోపం వచ్చినప్పుడు మాత్రం ఇంట్లో మంచి జరుగదు.
(1 / 6)

లక్ష్మీదేవి ఆశీస్సులు పొందాలని, తన ఇల్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రతి మనిషి కోరుకుంటాడు. కానీ లక్ష్మీదేవికి నచ్చని కొన్ని అలవాట్లు, పనులు ఉన్నాయి.  వీటిని చేస్తే మీ ఇంటికి వచ్చిన లక్ష్మి కూడా తిరిగి వెళ్లిపోతుంది.
(2 / 6)

 లక్ష్మి మాత ఎప్పుడూ  శుభ్రంగా ఉండే ఇంట్లోనే ఉండడానికి ఇష్టపడుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం. కాబట్టి ఇంటిని క్రమం తప్పకుండా శుభ్రపరచండి.
(3 / 6)

డబ్బులు వృధా చేసే అలవాటు ఉన్నవారికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లభించదు. ముఖ్యంగా జూదం, బెట్టింగ్ లకు పాల్పడి డబ్బును దుర్వినియోగం చేసే వారిని లక్ష్మీదేవి ఇష్టపడదు. అందువల్ల, మీరు కష్టపడి సంపాదించిన డబ్బును తెలివిగా ఖర్చు చేయండి.
(4 / 6)

ప్లేట్లలో ఆహారాన్ని విడిచిపెట్టడం, ఆహారాన్ని వేస్టు చేయడం వంటివారిపై లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉండదని, ఆ ఇంట్లో పేదరికం రాజ్యమేలుతుందంటారు. మీ కుటుంబానికి లక్ష్మీదేవి ఆశీస్సులు కావాలంటే, ఆహారాన్ని వేస్టు చేయకండి.
(5 / 6)

సూర్యోదయం తర్వాత కూడా నిద్రపోయేవారంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అలాగే, సాయంత్రం పూట నిద్రపోయేవారి ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు. మీరు కూడా ఇలా చేస్తే వెంటనే మీ అలవాట్లను మార్చుకోండి.  
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి