తెలుగు న్యూస్  /  ఫోటో  /  Vastu Tips: తులసి మొక్కను ఓ దిక్కుల్లో ఉంచాలి? నీరు ఎలా పోస్తే ఎక్కువ మంచి జరుగుతుందంటే..

Vastu Tips: తులసి మొక్కను ఓ దిక్కుల్లో ఉంచాలి? నీరు ఎలా పోస్తే ఎక్కువ మంచి జరుగుతుందంటే..

26 June 2024, 17:39 IST

Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉండడం అన్ని విధాల మంచిది అనే విశ్వాసం చాలా మందికి ఉంటుంది. అయితే, ఇంట్లో ఏ దిక్కులో ఈ మొక్క ఉండాలో.. ఎక్కడ ఉంచకూడదో ఇక్కడ తెలుసుకోండి. 

హిందూ గ్రంథాల్లో తులసి మొక్కకు చాలా ప్రాముఖ్యత ఉంది. తులసి మొక్క ఉంటే ఇంటికి మంచిది జరుగుతుందనే విశ్వాసం ఉంది. తులసి చెట్టును పూజించే వారికి సిరిసంపదలు, అదృష్టం దక్కుతుందనే నమ్మకం ఉంది. 
(1 / 5)

ఇంట్లో తులసి మొక్కను ఇంటికి తూర్పు దిక్కులో ఉంచాలి. లేకపోతే ఉత్తరం, ఈశాన్య దిశలోనూ ఉంచవచ్చు. ఈ దిశల్లో తులసి మొక్కను ఉంచితే మంచి జరుగుతుంది. అయితే, ఎప్పటిపరిస్థితుల్లోనూ తులసి మొక్కను దక్షిణ దిశలో పెట్టకూడదు. దక్షిణంలో పెడితే ఇబ్బందులు ఎదురవుతాయనే నమ్మకం ఉంది. 
(2 / 5)

శాస్త్రాల ప్రకారం తులసి చెట్టుకు ఆదివారం, ఏకాదశి రోజుల్లో నీరు పోయకూడదు. మిగిలిన అన్ని రోజుల్లో నీరు పోయవచ్చు. ఏకాదశి రోజుల్లో మహా విష్ణువు కోసం తులసి దేవి ఉపవాసం ఉంటుందని, అందుకే ఆ రోజు నీరు పోయకూడదనే విశ్వాసం ఉంది.
(3 / 5)

తులసి చెట్టుకు లోహపు పాత్రల ద్వారా నీరు పోయాలని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా రాగిపాత్ర నుంచి నీరు పోస్తే మరింత మంచి జరుగుతుందనే నమ్మకం ఉంది. 
(4 / 5)
తులసి చెట్టుకు లోహపు పాత్రల ద్వారా నీరు పోయాలని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా రాగిపాత్ర నుంచి నీరు పోస్తే మరింత మంచి జరుగుతుందనే నమ్మకం ఉంది. (Unsplash)
రాగి పాత్ర ద్వారా తులసి చెట్టుకు నీరు పోస్తే కుటుంబంలో సంపద, శాంతి పెరుగుతుందని విశ్వసిస్తారు. శుభాలు జరిగే అవకాశాలు ఉంటాయి. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ కథనాన్ని రూపొందించాం. వీటిసి శాస్త్రీయ ఆధారాలు ఉండవు.)
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి