తెలుగు న్యూస్  /  ఫోటో  /  Cake Healthy Or Unhealthy : హలో గురూ.. లొట్టలేసుకుంటూ కేక్ తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి!

Cake Healthy or Unhealthy : హలో గురూ.. లొట్టలేసుకుంటూ కేక్ తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి!

21 December 2024, 13:23 IST

Cake Healthy or Unhealthy : కొద్ది రోజుల్లో క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రెషన్స్ ఉన్నాయి. ఈ రెండు రోజుల్లో కేక్ కటింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇవే కాకుండా బర్త్‌డేల సందర్భంగా కేక్ కట్ చేసి పంచుతారు. అయితే.. ఈ కేక్‌లు తినడం వల్ల సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అవేంటో ఓసారి చూద్దాం.

  • Cake Healthy or Unhealthy : కొద్ది రోజుల్లో క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రెషన్స్ ఉన్నాయి. ఈ రెండు రోజుల్లో కేక్ కటింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇవే కాకుండా బర్త్‌డేల సందర్భంగా కేక్ కట్ చేసి పంచుతారు. అయితే.. ఈ కేక్‌లు తినడం వల్ల సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అవేంటో ఓసారి చూద్దాం.
కేక్‌ల్లో చక్కెర, నూనెలు అధికంగా ఉండటం వల్ల అధిక కేలరీలను అందిస్తాయి. కేక్‌లను తరచుగా, అధికంగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుదలకు దారితీస్తుంది. బరువు పెరుగుదల వల్ల మధుమేహం, గుండె జబ్బులు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
(1 / 6)
కేక్‌ల్లో చక్కెర, నూనెలు అధికంగా ఉండటం వల్ల అధిక కేలరీలను అందిస్తాయి. కేక్‌లను తరచుగా, అధికంగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుదలకు దారితీస్తుంది. బరువు పెరుగుదల వల్ల మధుమేహం, గుండె జబ్బులు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.(istockphoto)
కేక్‌లలో అధికంగా ఉండే చక్కెర వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఇది మధుమేహం ఉన్నవారికి చాలా ప్రమాదకరం. తరచుగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల ఇన్సులిన్ నిరోధకత పెరిగి మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
(2 / 6)
కేక్‌లలో అధికంగా ఉండే చక్కెర వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఇది మధుమేహం ఉన్నవారికి చాలా ప్రమాదకరం. తరచుగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల ఇన్సులిన్ నిరోధకత పెరిగి మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది.(istockphoto)
కేక్‌లలో ఉండే చక్కెర దంతాలపై ప్లాక్ ఏర్పడటానికి కారణమవుతుంది. ఇది క్యావిటీలు, దంత క్షయంకు దారితీస్తుంది. కేక్‌లు తిన్న తర్వాత బాగా నోరు శుభ్రం చేసుకోకపోతే దంతాలకు హాని కలుగుతుంది.
(3 / 6)
కేక్‌లలో ఉండే చక్కెర దంతాలపై ప్లాక్ ఏర్పడటానికి కారణమవుతుంది. ఇది క్యావిటీలు, దంత క్షయంకు దారితీస్తుంది. కేక్‌లు తిన్న తర్వాత బాగా నోరు శుభ్రం చేసుకోకపోతే దంతాలకు హాని కలుగుతుంది.(istockphoto)
కేక్‌లలో ఉండే కొవ్వులు, ప్రాసెస్ చేసిన పిండి పదార్థాలు జీర్ణ సమస్యలకు దారితీస్తాయి. అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తవచ్చు. కొందరికి కేక్‌లు అలర్జీలను కలిగించవచ్చు.
(4 / 6)
కేక్‌లలో ఉండే కొవ్వులు, ప్రాసెస్ చేసిన పిండి పదార్థాలు జీర్ణ సమస్యలకు దారితీస్తాయి. అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తవచ్చు. కొందరికి కేక్‌లు అలర్జీలను కలిగించవచ్చు.(istockphoto)
కేక్‌లు కేవలం రుచికరమైనవి మాత్రమే కాకుండా, అవసరమైన పోషకాలను అందించవు. అధికంగా కేక్‌లు తీసుకోవడం వల్ల ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలను తినడం తగ్గి, శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు లభించవు.
(5 / 6)
కేక్‌లు కేవలం రుచికరమైనవి మాత్రమే కాకుండా, అవసరమైన పోషకాలను అందించవు. అధికంగా కేక్‌లు తీసుకోవడం వల్ల ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలను తినడం తగ్గి, శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు లభించవు.(istockphoto)
కేక్‌లు తిన్నప్పుడు మనకు సంతోషం కలుగుతుంది. కానీ.. తరచుగా కేక్‌లను తినడం వల్ల మూడ్ స్వింగ్స్, ఆందోళన, నిరాశ వంటి మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
(6 / 6)
కేక్‌లు తిన్నప్పుడు మనకు సంతోషం కలుగుతుంది. కానీ.. తరచుగా కేక్‌లను తినడం వల్ల మూడ్ స్వింగ్స్, ఆందోళన, నిరాశ వంటి మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.(istockphoto)

    ఆర్టికల్ షేర్ చేయండి