తెలుగు న్యూస్  /  ఫోటో  /  Beauty Benefits Of Beetroot Juice: బీట్‌రూట్‌ జ్యూస్‌తో మీ అందం రెట్టింపు

Beauty benefits of beetroot juice: బీట్‌రూట్‌ జ్యూస్‌తో మీ అందం రెట్టింపు

16 March 2023, 9:25 IST

Beauty benefits of beetroot juice: బీట్‌రూట్ జ్యూస్ బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. అలాగే చర్మానికి కూడా సహజ సంరక్షణను అందించి మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది.

  • Beauty benefits of beetroot juice: బీట్‌రూట్ జ్యూస్ బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. అలాగే చర్మానికి కూడా సహజ సంరక్షణను అందించి మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది.
బీట్‌రూట్ రసం అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది, అయితే ఇది మీ చర్మానికి కూడా అద్భుతాలు చేస్తుందని మీకు తెలుసా? విటమిన్లు, మినరల్స్‌తో నిండిన బీట్‌రూట్ రసం మీకు మెరిసే ఛాయను అందిస్తుంది, ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడానికి, వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేయడానికి సహాయపడుతుంది. బీట్‌రూట్ రసం యొక్క సౌందర్య ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోండి.
(1 / 6)
బీట్‌రూట్ రసం అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది, అయితే ఇది మీ చర్మానికి కూడా అద్భుతాలు చేస్తుందని మీకు తెలుసా? విటమిన్లు, మినరల్స్‌తో నిండిన బీట్‌రూట్ రసం మీకు మెరిసే ఛాయను అందిస్తుంది, ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడానికి, వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేయడానికి సహాయపడుతుంది. బీట్‌రూట్ రసం యొక్క సౌందర్య ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోండి.(Pinterest)
1. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం: బీట్‌రూట్ జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్తం చేయడంలో సహాయపడతాయి. ఫ్రీ రాడికల్స్ చర్మానికి హాని కలిగిస్తాయి, ఇది అకాల వృద్ధాప్యానికి, నిస్తేజమైన ఛాయకు దారితీస్తుంది. బీట్‌రూట్ జ్యూస్ తాగడం ద్వారా, మీరు మీ చర్మాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించుకోవడానికి, ఆరోగ్యంగా, యవ్వనంగా కనిపించేలా చేయడంలో సహాయపడుతుంది.
(2 / 6)
1. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం: బీట్‌రూట్ జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్తం చేయడంలో సహాయపడతాయి. ఫ్రీ రాడికల్స్ చర్మానికి హాని కలిగిస్తాయి, ఇది అకాల వృద్ధాప్యానికి, నిస్తేజమైన ఛాయకు దారితీస్తుంది. బీట్‌రూట్ జ్యూస్ తాగడం ద్వారా, మీరు మీ చర్మాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించుకోవడానికి, ఆరోగ్యంగా, యవ్వనంగా కనిపించేలా చేయడంలో సహాయపడుతుంది.(Unsplash)
2. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది: కొల్లాజెన్ ఆరోగ్యకరమైన, మృదువుగా ఉండే చర్మానికి అవసరమైన ప్రోటీన్. వయస్సు పైబడిన కొద్దీ మన శరీరాలు తక్కువ కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తాయి, దీంతో ముడతలు, గీతలు ఏర్పడతాయి. చర్మం కుంగిపోతుంది. బీట్‌రూట్ రసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి అవసరం. మీ ఆహారంలో బీట్‌రూట్ రసాన్ని చేర్చుకుంటే కొల్లాజెన్ సంశ్లేషణ సాధ్యమవుతుంది. మీ చర్మం రూపాన్ని మెరుగుపడుతుంది.
(3 / 6)
2. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది: కొల్లాజెన్ ఆరోగ్యకరమైన, మృదువుగా ఉండే చర్మానికి అవసరమైన ప్రోటీన్. వయస్సు పైబడిన కొద్దీ మన శరీరాలు తక్కువ కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తాయి, దీంతో ముడతలు, గీతలు ఏర్పడతాయి. చర్మం కుంగిపోతుంది. బీట్‌రూట్ రసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి అవసరం. మీ ఆహారంలో బీట్‌రూట్ రసాన్ని చేర్చుకుంటే కొల్లాజెన్ సంశ్లేషణ సాధ్యమవుతుంది. మీ చర్మం రూపాన్ని మెరుగుపడుతుంది.(ROMAN ODINTSOV)
3. వాపు (ఇన్‌ఫ్లమేషన్/మంట)ను తగ్గిస్తుంది: మంట లేదా వాపు అనేది గాయానికి సహజ ప్రతిస్పందన, అయితే దీర్ఘకాలిక మంట అనేది మొటిమలు, రోసేసియా , సోరియాసిస్‌తో సహా అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. బీట్‌రూట్ జ్యూస్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్న సమ్మేళనాలు ఉన్నాయి, ఇవి చర్మం యొక్క ఎరుపు, వాపు, మంట, చికాకును తగ్గించడంలో సహాయపడతాయి.
(4 / 6)
3. వాపు (ఇన్‌ఫ్లమేషన్/మంట)ను తగ్గిస్తుంది: మంట లేదా వాపు అనేది గాయానికి సహజ ప్రతిస్పందన, అయితే దీర్ఘకాలిక మంట అనేది మొటిమలు, రోసేసియా , సోరియాసిస్‌తో సహా అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. బీట్‌రూట్ జ్యూస్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్న సమ్మేళనాలు ఉన్నాయి, ఇవి చర్మం యొక్క ఎరుపు, వాపు, మంట, చికాకును తగ్గించడంలో సహాయపడతాయి.(istockphoto)
4. మలినాలు బయటకు పంపిస్తుంది: బీట్‌రూట్ జ్యూస్ ఒక సహజమైన డిటాక్సిఫైయర్, అంటే ఇది శరీరం నుండి టాక్సిన్స్, మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది. మీ శరీరం టాక్సిన్స్‌తో ఓవర్‌లోడ్ అయినప్పుడు, అది మీ చర్మంపై పగుళ్లు ఏర్పరస్తుంది. బీట్‌రూట్ జ్యూస్‌ని క్రమం తప్పకుండా తాగడం వల్ల మీ చర్మం కాంతివంతంగా మారుతుంది.
(5 / 6)
4. మలినాలు బయటకు పంపిస్తుంది: బీట్‌రూట్ జ్యూస్ ఒక సహజమైన డిటాక్సిఫైయర్, అంటే ఇది శరీరం నుండి టాక్సిన్స్, మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది. మీ శరీరం టాక్సిన్స్‌తో ఓవర్‌లోడ్ అయినప్పుడు, అది మీ చర్మంపై పగుళ్లు ఏర్పరస్తుంది. బీట్‌రూట్ జ్యూస్‌ని క్రమం తప్పకుండా తాగడం వల్ల మీ చర్మం కాంతివంతంగా మారుతుంది.(Pixabay)
5. చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది: చర్మం ఆరోగ్యకరంగా, ప్రకాశవంతంగా ఉండాలంటే తేమ అవసరం. బీట్‌రూట్ జ్యూస్‌లో నీరు, ఎలక్ట్రోలైట్‌లు పుష్కలంగా ఉంటాయి, ఇది మీ చర్మాన్ని లోపలి నుండి హైడ్రేట్‌గా ఉంచడానికి ఒక అద్భుతమైన మార్గం. హైడ్రేటెడ్ చర్మంపై ముడతలు, గీతలకు అవకాశం తక్కువగా ఉంటుంది.
(6 / 6)
5. చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది: చర్మం ఆరోగ్యకరంగా, ప్రకాశవంతంగా ఉండాలంటే తేమ అవసరం. బీట్‌రూట్ జ్యూస్‌లో నీరు, ఎలక్ట్రోలైట్‌లు పుష్కలంగా ఉంటాయి, ఇది మీ చర్మాన్ని లోపలి నుండి హైడ్రేట్‌గా ఉంచడానికి ఒక అద్భుతమైన మార్గం. హైడ్రేటెడ్ చర్మంపై ముడతలు, గీతలకు అవకాశం తక్కువగా ఉంటుంది.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి