తెలుగు న్యూస్  /  ఫోటో  /  Kkr Vs Srh Shreyas Iyer: చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. ఐపీఎల్లో ధోనీకి కూడా సాధ్యం కాని రికార్డు సొంతం

KKR vs SRH Shreyas Iyer: చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. ఐపీఎల్లో ధోనీకి కూడా సాధ్యం కాని రికార్డు సొంతం

22 May 2024, 8:51 IST

KKR vs SRH Shreyas Iyer: ఐపీఎల్ 2024లో కేకేఆర్ ను ఫైనల్ తీసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో ధోనీకి కూడా సాధ్యం కాని అరుదైన రికార్డును అతడు సొంతం చేసుకున్నాడు.

  • KKR vs SRH Shreyas Iyer: ఐపీఎల్ 2024లో కేకేఆర్ ను ఫైనల్ తీసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో ధోనీకి కూడా సాధ్యం కాని అరుదైన రికార్డును అతడు సొంతం చేసుకున్నాడు.
KKR vs SRH Shreyas Iyer: ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫైనల్ చేరడం ద్వారా ఆ టీమ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్ గా రెండు వేర్వేరు జట్లను ఫైనల్ కు చేర్చిన తొలి ప్లేయర్ అతడే. 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా ఆ జట్టును కూడా ఫైనల్ కు తీసుకెళ్లాడు.
(1 / 5)

KKR vs SRH Shreyas Iyer: ఐపీఎల్లో ధోనీకి కూడా సాధ్యం కాని రికార్డు ఇది. అయితే 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ చేరినా ట్రోఫీ గెలవలేకపోయింది. మరి ఈసారి కేకేఆర్ కు ముచ్చటగా మూడో ట్రోఫీ అందిస్తాడేమో చూడాలి. అది కూడా ధోనీ ఐపీఎల్ హోమ్ గ్రౌండ్ చెన్నైలో కావడం విశేషం. చెన్నై కెప్టెన్ గా ధోనీ ఆ టీమ్ ను చాలాసార్లు ఫైనల్ చేర్చినా.. మధ్యలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ కెప్టెన్ గా మాత్రం విఫలమయ్యాడు.
(2 / 5)

KKR vs SRH Shreyas Iyer: ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో కెప్టెన్ గా అత్యధిక విజయాలు సాధించిన వారిలో శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానానికి వెళ్లాడు. ఈ లిస్ట్ లో హార్దిక్ పాండ్యాను మించిపోయాడు. ధోనీ ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో 17 మ్యాచ్ లలో గెలిచాడు. రెండో స్థానంలో రోహిత్ శర్మ 11 మ్యాచ్ లలో, మూడో స్థానంలో గంభీర్ ఐదు మ్యాచ్ లలో విజయాలు సాధించారు.
(3 / 5)

KKR vs SRH Shreyas Iyer: ఇక సన్ రైజర్స్ తో మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ మరో రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో కేకేఆర్ తరఫున అత్యధిక భాగస్వామ్యాల జాబితాలో శ్రేయస్ ఉన్న జోడీ రెండో స్థానానికి దూసుకెళ్లింది. సన్ రైజర్స్ తో మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్ జోడీ మూడో వికెట్ కు 97 పరుగులు జోడించింది. అంతకుముందు 2012 ఫైనల్లో కేకేఆర్ తరఫున కలిస్, మణిందర్ బిస్లా జోడీ 136 పరుగులు జోడించారు.
(4 / 5)

KKR vs SRH Shreyas Iyer: ఐపీఎల్ ప్లేఆఫ్స్ చేజింగ్ లో అజేయ హాఫ్ సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలోనూ శ్రేయస్ అయ్యర్ చేరాడు. అతడు ఈ మ్యాచ్ లో 58 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అంతకుముందు 2016లో సన్ రైజర్స్ తరఫున డేవిడ్ వార్నర్ 93 రన్స్ తో అజేయంగా ఉన్నాడు.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి