తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  మీలో ఇలాంటి చర్మ సమస్యలు ఉన్నాయా? అది ఈ వ్యాధికి కారణం కావచ్చు!

మీలో ఇలాంటి చర్మ సమస్యలు ఉన్నాయా? అది ఈ వ్యాధికి కారణం కావచ్చు!

08 September 2022, 20:38 IST

Kidney Problems Symptoms: ఈ రోజుల్లో చాలా మందిని కిడ్నీ సమస్యలు వేధిస్తున్నాయి. ఈ ప్రారంభంలోనే గుర్తించకుంటే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఉంటాయి. చర్మంపై వచ్చే మార్పుల అధారంగా కిడ్నీ సమస్యలను గుర్తించవచ్చు. మరి ఆ సంకేతాలెంటో ఓ సారి చూద్దాం. 

కిడ్నీలు శరీరంలో అతి ముఖ్యమైన అవయవాలలో ఒకటి. అవి సరిగ్గా పని చేయకపోతే, రక్తం సరిగ్గా శుద్ధి చేయబడదు. ఇది శరీరంలోని అన్ని భాగాలను ప్రభావితం చేస్తుంది. అవి క్రమంగా క్షీణిస్తాయి. కాబట్టి కిడ్నీ సమస్యలను మొదట్లోనే గుర్తించడం చాలా ముఖ్యమైన విషయం.
(1 / 8)

ముఖం, చర్మంపై ఏర్పడే కొన్ని అసాధరణ మార్పులు కిడ్నీలలో తలెత్తే సమస్యలకు కారణం కావచ్చు. ఈ మార్పుల అధారంగా కిడ్నీ సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు. మరి ఆ లక్షాణాలెంటో ఓ సారి చూద్దాం
(2 / 8)

చర్మం రంగు మారడం: రక్తాన్ని శుద్ధి చేయడం మూత్రపిండాల ముఖ్యమైన విధి. ఒక్కవేళ కిడ్నీలు సరిగా పనిచేయకపోతే శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతాయి. ఇది చర్మంలోని వివిధ భాగాల రంగును మారుస్తుంది.
(3 / 8)

దురద: కిడ్నీలు సరిగా పనిచేయకపోతే, రక్తం శుద్ధి కానందున, చర్మం కింద టాక్సిన్స్ పేరుకుపోతాయి. ఫలితంగా, కొన్ని భాగాలు దురదగా మారవచ్చు. ఇలాంటి పరిస్థితి ఏర్పడితే వైద్యుడిని సంప్రదించండి
(4 / 8)

రక్తస్రావం: కిడ్నీ సమస్యల వల్ల కొన్నిసార్లు చర్మం కింద టాక్సిన్స్ పేరుకుపోయి దురద, చర్మం పగుళ్లు, రక్తస్రావం ఏర్పడుతుంది. ఇలాంటి సందర్భంలో, వైద్యుడిని సంప్రదించడం మంచిది.
(5 / 8)

డార్క్ స్పాట్స్ లేదా హైపర్పిగ్మెంటేషన్: ఇది కిడ్నీ సమస్యల వల్ల కూడా కావచ్చు. ఎటువంటి కారణం లేకుండా చర్మంపై నల్లటి మచ్చ ఉంటే, ఖచ్చితంగా వైద్యుడికి చెప్పండి.
(6 / 8)

పొడి చర్మం లేదా జిరోసిస్: మూత్రపిండాల సమస్యల్లో కనిపించే అత్యంత సాధారణ సమస్య. కిడ్నీ సమస్యలలో చెమట గ్రంథులు సరిగా పనిచేయవు. ఇది చర్మం పొడిబారి పగుళ్లు ఏర్పడేలా చేస్తుంది.
(7 / 8)

చర్మం దురద లేదా ప్రురిటస్: ఇది కిడ్నీ సమస్యల వల్ల కూడా వస్తుంది. ఇది చర్మం కింద టాక్సిన్స్ పేరుకుపోవడం వల్ల కలిగే సమస్య. ముఖ్యంగా రాత్రిపూట ఈ సమస్య పెరుగుతుంది. మీలో అలాంటివి కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
(8 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి