తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ts Crop Loan Waiver Updates : తెలంగాణలో రూ.2 లక్షల రైతు రుణమాఫీ - తెరపైకి ప్రత్యేక కార్పొరేషన్..! ఇవిగో తాజా అప్డేట్స్

TS Crop Loan Waiver Updates : తెలంగాణలో రూ.2 లక్షల రైతు రుణమాఫీ - తెరపైకి ప్రత్యేక కార్పొరేషన్..! ఇవిగో తాజా అప్డేట్స్

16 May 2024, 17:07 IST

Telangana Crop Loan Waiver Scheme Updates : రుణమాఫీ స్కీమ్ పై తెలంగాణ సర్కార్ కసరత్తు షురూ చేసింది.  ఆగస్టు 15వ తేదీలోపు రూ. 2 లక్షల లోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్పిన సంగతి తెలిసిందే. ఎన్నికలు ముగియటంతో ఇదే అంశంపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. 

  • Telangana Crop Loan Waiver Scheme Updates : రుణమాఫీ స్కీమ్ పై తెలంగాణ సర్కార్ కసరత్తు షురూ చేసింది.  ఆగస్టు 15వ తేదీలోపు రూ. 2 లక్షల లోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్పిన సంగతి తెలిసిందే. ఎన్నికలు ముగియటంతో ఇదే అంశంపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. 
లోక్ సభ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి రేవంత్ పదే పదే  రైతు రుణమాఫీపై  ప్రకటనలు చేస్త వచ్చారు. దీంతో రైతుల్లో ఆశలు పెరిగాయి.  ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ తప్పకుండా చేస్తామని హామీనిచ్చారు.
(1 / 5)
లోక్ సభ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి రేవంత్ పదే పదే  రైతు రుణమాఫీపై  ప్రకటనలు చేస్త వచ్చారు. దీంతో రైతుల్లో ఆశలు పెరిగాయి.  ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ తప్పకుండా చేస్తామని హామీనిచ్చారు.(photo source from https://clw.telangana.gov.in/)
మే 13వ తేదీ నాటితో లోక్ సభ ఎన్నికల పోలింగ్ తెలంగాణలో ముగిసింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టారు. బుధవారం (మే 15) రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై స్వయంగా సమీక్షించారు.
(2 / 5)
మే 13వ తేదీ నాటితో లోక్ సభ ఎన్నికల పోలింగ్ తెలంగాణలో ముగిసింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టారు. బుధవారం (మే 15) రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై స్వయంగా సమీక్షించారు.(photo source from https://clw.telangana.gov.in/)
ఏకకాలంలో రైతుల రుణమాఫీ ఎలా సాధ్యమవుతుందనేది కూడా చర్చనీయాంశంగా మారింది. దీనిపై ప్రతిపక్ష పార్టీల నుంచే అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే రేవంత్ సర్కార్ మాత్రం…. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తామని చెబుతున్నారు.
(3 / 5)
ఏకకాలంలో రైతుల రుణమాఫీ ఎలా సాధ్యమవుతుందనేది కూడా చర్చనీయాంశంగా మారింది. దీనిపై ప్రతిపక్ష పార్టీల నుంచే అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే రేవంత్ సర్కార్ మాత్రం…. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తామని చెబుతున్నారు.(photo source from https://clw.telangana.gov.in/)
తాజాగా నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలను ఇచ్చారు. రైతులకు రూ. 2 లక్షల మేరకు రుణమాఫీకి సంబంధించి విధి విధానాలతో అవసరమైన ప్రణాళికలు రూపొందించాలన్నారు.
(4 / 5)
తాజాగా నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలను ఇచ్చారు. రైతులకు రూ. 2 లక్షల మేరకు రుణమాఫీకి సంబంధించి విధి విధానాలతో అవసరమైన ప్రణాళికలు రూపొందించాలన్నారు.
రైతుల రుణమాఫీ కోసం అవసరమైతే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు నిధులు ఇచ్చేందుకు ముందుకొచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ విషయంలో మహారాష్ట్ర, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను అధ్యయనం చేయాలని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, దళారుల జోక్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతు నుంచి పంటను కొని మిల్లింగ్ చేసి రేషన్ షాపుల్లో సన్న బియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.  
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి