తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tg New Ration Cards : కొత్త రేషన్ కార్డు కోసం చూస్తున్నారా..? కీలక అప్డేట్ వచ్చేసింది

TG New Ration Cards : కొత్త రేషన్ కార్డు కోసం చూస్తున్నారా..? కీలక అప్డేట్ వచ్చేసింది

20 December 2024, 20:57 IST

New Ration Cards in Telangana : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి కసరత్తు చేస్తోంది. ఇందుకు ముహుర్తం ఖరారు చేసే పనిలో పడింది. వచ్చే సంక్రాంతి తర్వాత 10 లక్షల కొత్త కార్డులను జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇదే విషయంపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ప్రకటన చేశారు.

  • New Ration Cards in Telangana : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి కసరత్తు చేస్తోంది. ఇందుకు ముహుర్తం ఖరారు చేసే పనిలో పడింది. వచ్చే సంక్రాంతి తర్వాత 10 లక్షల కొత్త కార్డులను జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇదే విషయంపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ప్రకటన చేశారు.
తెలంగాణలోని చాలా కుటుంబాలు కొత్త రేషన్ కార్డులు కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రజాపాలనలో కూడా దరఖాస్తులు చేశారు. అయితే ఇప్పటివరకు కొత్త కార్డులు జారీ కాలేదు.  
(1 / 6)

కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం వచ్చిన నాటి నుంచే… కొత్త కార్డుల మంజూరుపై దృష్టిపెట్టింది. కేబినెట్ సబ్ కమిటీని కూడా నియమించటంతో పాటు సిఫార్సులను కూడా స్వీకరించింది. ప్రాథమికంగా అర్హతలను నిర్ణయించిన సంగతి కూడా తెలిసిందే.
(2 / 6)

ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే కొత్త రేషన్ కార్డులపై పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బదులిచ్చారు. సంక్రాంతి తర్వాత 10 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.
(3 / 6)

శాసనమండలిలో మాట్లాడిన మంత్రి ఉత్తమ్…  ఇటీవల నిర్వహించిన సర్వేలో సేకరించిన వివరాల ఆధారంగా స్మార్ట్‌కార్డుల తరహాలో కొత్త రేషన్‌కార్డులు అందజేస్తామని తెలిపారు.
(4 / 6)

కొత్త కార్డుల జారీ ద్వారా రాష్ట్ర ఖజానాపై అదనంగా రూ.956 కోట్ల భారం పడనుందని ఉత్తమ్ వెల్లడించారు. ప్రస్తుతం 18 లక్షల రేషన్‌ కార్డుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణకు ముందు తెలంగాణలో 91.68 లక్షల రేషన్ కార్డుదారులు ఉండేవని పేర్కొన్నారు.
(5 / 6)

 ప్రస్తుతం రాష్ట్రంలో 89. 95 లక్షల మంది కార్డుదారులు ఉన్నారని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. మొత్తం 2.81 కోట్ల మంది ప్రజలు ఇప్పుడు ప్రయోజనాలను పొందుతున్నారని ప్రకటించారు. అంతేకాకుండా.. దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం ఇస్తామని కూడా చెప్పారు. మరో ఒకటి రెండు నెలల్లోనే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు..
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి