తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ts Govt Gruha Jyoti Scheme : తెరపైకి తెల్ల రేషన్ కార్డు...! 'ఉచిత్ విద్యుత్ స్కీమ్' తాజా అప్డేట్ ఇదే

TS Govt Gruha Jyoti Scheme : తెరపైకి తెల్ల రేషన్ కార్డు...! 'ఉచిత్ విద్యుత్ స్కీమ్' తాజా అప్డేట్ ఇదే

03 February 2024, 11:25 IST

Telangana Govt Free Electricity Scheme Updates : ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పట్టాలెక్కించే పనిలో పడింది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం. తాజాగా ఉచిత విద్యుత్ పై కూడా ప్రకటన చేసింది. ఇందుకు సంబంధించి  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక విషయాలను పేర్కొన్నారు.

  • Telangana Govt Free Electricity Scheme Updates : ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పట్టాలెక్కించే పనిలో పడింది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం. తాజాగా ఉచిత విద్యుత్ పై కూడా ప్రకటన చేసింది. ఇందుకు సంబంధించి  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక విషయాలను పేర్కొన్నారు.
గృహజ్యోతి : ఈ పథకం కింద ఇళ్లల్లో వాడే 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల హామీలో ప్రకటించింది. ఆరు గ్యారెంటీలలో ఇది ఒకటిగా కూడా ఉంది.
(1 / 6)
గృహజ్యోతి : ఈ పథకం కింద ఇళ్లల్లో వాడే 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల హామీలో ప్రకటించింది. ఆరు గ్యారెంటీలలో ఇది ఒకటిగా కూడా ఉంది.(Minister Komatireddy Venkat Reddy Twitter)
ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్… త్వరలోనే ఉచిత విద్యుత్ స్కీమ్ ను అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ వేదికగా ప్రకటించారు. 200 యూనిట్ల లోపు వాడే వారికి ఫ్రీగా కరెంట్ ఇస్తామన్నారు.
(2 / 6)
ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్… త్వరలోనే ఉచిత విద్యుత్ స్కీమ్ ను అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ వేదికగా ప్రకటించారు. 200 యూనిట్ల లోపు వాడే వారికి ఫ్రీగా కరెంట్ ఇస్తామన్నారు.(TSSPDCL)
గత కరెంటు బిల్లుల ఆధారంగా ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికే ఈ స్కీమ్ ను వర్తింపజేయనున్నట్లు పేర్కొన్నారు.
(3 / 6)
గత కరెంటు బిల్లుల ఆధారంగా ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికే ఈ స్కీమ్ ను వర్తింపజేయనున్నట్లు పేర్కొన్నారు.(TSNPDCL)
రూ. 500 కే గ్యాస్ సిలిండర్ స్కీమ్ ను ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి. అయితే ఉచిత విద్యుత్ కు తెల్ల రేషన్ కార్డు ఉండాలనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పటంతో…. వైట్ రేషన్ కార్డు లేనివారికి ఈ స్కీమ్ వర్తింపజేసే అకాశం లేదని తెలుస్తోంది.
(4 / 6)
రూ. 500 కే గ్యాస్ సిలిండర్ స్కీమ్ ను ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి. అయితే ఉచిత విద్యుత్ కు తెల్ల రేషన్ కార్డు ఉండాలనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పటంతో…. వైట్ రేషన్ కార్డు లేనివారికి ఈ స్కీమ్ వర్తింపజేసే అకాశం లేదని తెలుస్తోంది.(TSSPDCL)
త్వరలోనే ఉచిత విద్యుత్ స్కీమ్ కు సంబంధించి అధికారికంగా ప్రకటన వస్తుందని… సంబంధిత శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నానరని వివరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 
(5 / 6)
త్వరలోనే ఉచిత విద్యుత్ స్కీమ్ కు సంబంధించి అధికారికంగా ప్రకటన వస్తుందని… సంబంధిత శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నానరని వివరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. (TS TRANSCO)
ఈ స్కీమ్ అమలుకు సంబంధించి ఇచ్చే తుది ఉత్తర్వుల్లో తెల్ల రేషన్ కార్డు అంశాన్ని స్పష్టంగా పేర్కొంటారా లేదా అనేది తేలాల్సి ఉంటుంది. అయితే రాష్ట్రంలో చాలా మంది వైట్ రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. కొత్త కార్డులు మంజూరు అయితేనే… వారంతా ఈ స్కీమ్ కు అర్హత సాధిస్తారు. ఈ విషయంలో సర్కార్ ఏం చేయబోతుందనేది చూడాలు.
(6 / 6)
ఈ స్కీమ్ అమలుకు సంబంధించి ఇచ్చే తుది ఉత్తర్వుల్లో తెల్ల రేషన్ కార్డు అంశాన్ని స్పష్టంగా పేర్కొంటారా లేదా అనేది తేలాల్సి ఉంటుంది. అయితే రాష్ట్రంలో చాలా మంది వైట్ రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. కొత్త కార్డులు మంజూరు అయితేనే… వారంతా ఈ స్కీమ్ కు అర్హత సాధిస్తారు. ఈ విషయంలో సర్కార్ ఏం చేయబోతుందనేది చూడాలు.(TSSPDCL)

    ఆర్టికల్ షేర్ చేయండి