తెలుగు న్యూస్  /  ఫోటో  /  Kangana Ranaut: పూజలు చేసిన కంగనా రనౌత్.. సినిమా రిలీజ్‍కు ముందు..: ఫొటోలు

Kangana Ranaut: పూజలు చేసిన కంగనా రనౌత్.. సినిమా రిలీజ్‍కు ముందు..: ఫొటోలు

16 October 2023, 20:47 IST

Kangana Ranaut: బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన తేజస్ సినిమా అక్టోబర్ 27న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ తరుణంలో అహ్మదాబాద్‍లో ప్రత్యేక పూజలు చేశారు కంగన. వివరాలివే..

  • Kangana Ranaut: బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన తేజస్ సినిమా అక్టోబర్ 27న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ తరుణంలో అహ్మదాబాద్‍లో ప్రత్యేక పూజలు చేశారు కంగన. వివరాలివే..
గుజరాత్‍లోని అహ్మదాబాద్‍లో కంగనా రనౌత్ తన సోదరి రంగోలీ చండేల్‍తో కలిసి పూజలు నిర్వహించారు. తేజస్ సినిమా అక్టోబర్ 27న రిలీజ్ కానుండటంతో దేవుడి ఆశీర్వాదం కోసం పూజలు చేశారు. సినిమా ప్రమోషన్ల కోసం అక్కడికి వెళ్లారు కంగనా. ఆమెను చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో వచ్చారు. 
(1 / 9)

ఈ ఈవెంట్‍కు మల్టీ కలర్డ్ లెహంగా ధరించి వచ్చారు కంగనా. అక్కడి వచ్చిన అభిమానులతో ఆమె మాట్లాడారు. తేజస్ సినిమాకు సంబంధించి ఆమె కొన్ని డైలాగ్స్ చెప్పగా.. ప్రజలు హర్షధ్వానాలు చేశారు. 
(2 / 9)

కొందరు అభిమానులతో ఫొటోలు కూడా దిగారు కంగనా. మరికొందరితో ముచ్చటించారు. 
(3 / 9)
కొందరు అభిమానులతో ఫొటోలు కూడా దిగారు కంగనా. మరికొందరితో ముచ్చటించారు. 
తేజస్ చిత్రానికి సర్వేశ్ మెవాహా దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందింది. పైలట్‌గా నటించారు కంగనా. ఈ సినిమా అక్టోబర్ 27న థియేటర్లలో రిలీజ్ కానుంది. 
(4 / 9)

తేజస్ సినిమా కోసం దేవుడి ఆశీర్వాదాలు తీసుకున్నారు కంగనా, రంగోలి. ఇద్దరూ సంప్రదాయ దుస్తులు ధరించి భక్తిగా పూజలు చేశారు. 
(5 / 9)

ఈవెంట్‍కు వెళ్లే ముందు తన ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍లో కొన్ని ఫొటోలు పోస్ట్ చేశారు కంగనా రనౌత్. 
(6 / 9)

“నా మనసంతా గుజరాత్. తేజస్‍తో అహ్మదాబాద్‍లో గార్బా నైట్” అని క్యాప్షన్ రాశారు కంగనా.
(7 / 9)

తేజస్ సినిమాలో భారత వాయిసేన పైలట్‍ పాత్రను కంగనా రనౌత్ పోషించారు. దేశంలో పైలెట్లు నిరంతరం ఎంత కష్టపడి పని చేస్తున్నారో ఈ చిత్రం ద్వారా తెలియజేయనున్నారు. 
(8 / 9)

కంగనా రనౌత్ ప్రస్తుతం ఎమర్జెన్సీ సినిమా కూడా చేస్తున్నారు. దివంగత మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాత్రను ఈ చిత్రంలో చేస్తున్నారు కంగనా. ఎమర్జెన్సీ మూవీకి స్వయంగా కంగనానే దర్శకత్వం వహిస్తున్నారు. 
(9 / 9)

    ఆర్టికల్ షేర్ చేయండి