తెలుగు న్యూస్  /  ఫోటో  /  Top 5 National Parks: భారత్ లో తప్పక చూడాల్సిన బెస్ట్ అండ్ టాప్ నేషనల్ పార్క్స్

Top 5 national parks: భారత్ లో తప్పక చూడాల్సిన బెస్ట్ అండ్ టాప్ నేషనల్ పార్క్స్

06 March 2024, 16:07 IST

Top 5 national parks: అరుదైన, అద్భుతమైన జంతుజాలాలు, అటవీ అందాలు చూడాలనుకునే వారు భారత్ లోని ఈ ఐదు నేషనల్ పార్క్స్ ను సందర్శించాల్సిందే. వీటిలో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ నుండి రణథంబోర్ నేషనల్ పార్క్ వరకు ఉన్నాయి.

  • Top 5 national parks: అరుదైన, అద్భుతమైన జంతుజాలాలు, అటవీ అందాలు చూడాలనుకునే వారు భారత్ లోని ఈ ఐదు నేషనల్ పార్క్స్ ను సందర్శించాల్సిందే. వీటిలో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ నుండి రణథంబోర్ నేషనల్ పార్క్ వరకు ఉన్నాయి.
జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్: ఉత్తరాఖండ్ లో ఉన్న జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ బెంగాల్ పులులు, ఏనుగులు, వివిధ రకాల పక్షి జాతులతో సహా గొప్ప జీవవైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది. ఇది వన్యప్రాణుల సఫారీలను అందిస్తుంది. సుందరమైన ప్రకృతి దృశ్యాలను చూసే అవకాశం అందిస్తుంది. 
(1 / 5)
జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్: ఉత్తరాఖండ్ లో ఉన్న జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ బెంగాల్ పులులు, ఏనుగులు, వివిధ రకాల పక్షి జాతులతో సహా గొప్ప జీవవైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది. ఇది వన్యప్రాణుల సఫారీలను అందిస్తుంది. సుందరమైన ప్రకృతి దృశ్యాలను చూసే అవకాశం అందిస్తుంది. (File Photo)
రణథంబోర్ నేషనల్ పార్క్: రాజస్థాన్ లో ఉన్న రణథంబోర్ నేషనల్ పార్క్ లో పెద్ద సంఖ్యలో పులులు ఉన్నాయి. ఇక్కడ పులుల సందర్శన కోసమే పర్యాటకులు వస్తుంటారు.ఇక్కడ రణతంబోర్ కోటతో సహా వైవిధ్యమైన వన్యప్రాణులు, చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి.
(2 / 5)
రణథంబోర్ నేషనల్ పార్క్: రాజస్థాన్ లో ఉన్న రణథంబోర్ నేషనల్ పార్క్ లో పెద్ద సంఖ్యలో పులులు ఉన్నాయి. ఇక్కడ పులుల సందర్శన కోసమే పర్యాటకులు వస్తుంటారు.ఇక్కడ రణతంబోర్ కోటతో సహా వైవిధ్యమైన వన్యప్రాణులు, చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి.(HT Photo/Himanshu Vyas)
బాంధవ్ గఢ్ నేషనల్ పార్క్: మధ్యప్రదేశ్ లో ఉన్న బాంధవ్ గఢ్ కూడా పులులకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ జంగిల్ సఫారీ చాలా ఫేమస్. ఈ పార్కులోని పురాతన గుహలను, దేవాలయాలను అన్వేషించే అవకాశం కూడా ఉంది.
(3 / 5)
బాంధవ్ గఢ్ నేషనల్ పార్క్: మధ్యప్రదేశ్ లో ఉన్న బాంధవ్ గఢ్ కూడా పులులకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ జంగిల్ సఫారీ చాలా ఫేమస్. ఈ పార్కులోని పురాతన గుహలను, దేవాలయాలను అన్వేషించే అవకాశం కూడా ఉంది.(PTI)
కజిరంగా జాతీయ ఉద్యానవనం: అస్సాంలో ఉన్న కజిరంగా నేషనల్ పార్క్ భారతీయ ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందింది. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఇది పులులు, ఏనుగులు, వివిధ పక్షి జాతులకు నిలయం. 
(4 / 5)
కజిరంగా జాతీయ ఉద్యానవనం: అస్సాంలో ఉన్న కజిరంగా నేషనల్ పార్క్ భారతీయ ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందింది. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఇది పులులు, ఏనుగులు, వివిధ పక్షి జాతులకు నిలయం. (Wikipedia (File Photo))
పెరియార్ నేషనల్ పార్క్: కేరళలో ఉన్న పెరియార్ నేషనల్ పార్క్ పెరియార్ సరస్సు చుట్టూ కేంద్రీకృతమైన వన్యప్రాణుల అభయారణ్యం. ఇక్కడ బోట్ క్రూయిజ్ ఫేమస్. బోట్ లో విహరిస్తూ, వన్యప్రాణులను, పశ్చిమ కనుమల గొప్ప జీవవైవిధ్యాన్ని వీక్షించవచ్చు.
(5 / 5)
పెరియార్ నేషనల్ పార్క్: కేరళలో ఉన్న పెరియార్ నేషనల్ పార్క్ పెరియార్ సరస్సు చుట్టూ కేంద్రీకృతమైన వన్యప్రాణుల అభయారణ్యం. ఇక్కడ బోట్ క్రూయిజ్ ఫేమస్. బోట్ లో విహరిస్తూ, వన్యప్రాణులను, పశ్చిమ కనుమల గొప్ప జీవవైవిధ్యాన్ని వీక్షించవచ్చు.(File Photo)

    ఆర్టికల్ షేర్ చేయండి