తెలుగు న్యూస్  /  ఫోటో  /  Telangana Govt : తెలంగాణ రాష్ట్ర గీతం, నూతన చిహ్నంపై కసరత్తు - తుది రూపు సిద్ధం, జూన్ 2న విడుదల..!

Telangana Govt : తెలంగాణ రాష్ట్ర గీతం, నూతన చిహ్నంపై కసరత్తు - తుది రూపు సిద్ధం, జూన్ 2న విడుదల..!

29 May 2024, 17:48 IST

Telangana Govt New Emblem :తెలంగాణ రాష్ట్ర నూతన చిహ్నంతో పాటు రాష్ట్ర గీతం తుది రూపు సిద్ధమైంది. జూన్ 2వ తేదీన వీటిని విడుదల చేయనున్నారు.

  • Telangana Govt New Emblem :తెలంగాణ రాష్ట్ర నూతన చిహ్నంతో పాటు రాష్ట్ర గీతం తుది రూపు సిద్ధమైంది. జూన్ 2వ తేదీన వీటిని విడుదల చేయనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం కొత్త లోగోను ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. కళాకారుడు రుద్ర రాజేశం రూపొందించిన నమూనాపై బుధవారం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
(1 / 4)

ప్రజాస్వామ్యం, ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా కొత్త లోగోను తయారు చేసే దిశగా కసరత్తు చేస్తున్నట్లు రేవంత్ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పలు నమూనాలను పరిశీలించారు. 
(2 / 4)

బుధవారం రేవంత్ రెడ్డి జరిపిన  సమీక్ష సమావేశానికి  కళాకారుడు రుద్ర రాజేశం,మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, తదితరులు హాజరయ్యారు.
(3 / 4)

అందె శ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర ప్రభుత్వ గీతంగా నిర్ణయించింది ప్రభుత్వం. ఈ గీతానికి సంగీత బాణీలను సమకూర్చే బాధ్యతలను సంగీత దర్శకుడు కీరవాణికి అప్పగించారు. బుధవారం దీనిపై కూడా సీఎం రేవంత్ సమీక్షించారు. దాదాపు రాష్ట్ర గీతం రూపకల్పన ఖరారైనట్లు తెలుస్తోంది.
(4 / 4)

    ఆర్టికల్ షేర్ చేయండి