తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pawan Kalyan : పవన్ కు తరచూ జ్వరం, కారణమేంటో చెప్పిన జనసేన-గజమాలలు, కరచాలనాలు వద్దని విజ్ఞప్తి

Pawan Kalyan : పవన్ కు తరచూ జ్వరం, కారణమేంటో చెప్పిన జనసేన-గజమాలలు, కరచాలనాలు వద్దని విజ్ఞప్తి

20 April 2024, 21:22 IST

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కు తరచూ జ్వరం రావడానికి కారణాలను ఆ పార్టీ ప్రకటించింది. పవన్ రికరెంట్ ఇన్‌ఫ్లూయెంజాతో బాధపడుతున్నారని తెలిపింది. దీని కారణంగా ఊపిరితిత్తుల్లో నిమ్ముచేరి రోజూ ఏదో ఒక సమయంలో పవన్ జ్వరంతో బాధపడుతున్నారని పేర్కొంది.

  • Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కు తరచూ జ్వరం రావడానికి కారణాలను ఆ పార్టీ ప్రకటించింది. పవన్ రికరెంట్ ఇన్‌ఫ్లూయెంజాతో బాధపడుతున్నారని తెలిపింది. దీని కారణంగా ఊపిరితిత్తుల్లో నిమ్ముచేరి రోజూ ఏదో ఒక సమయంలో పవన్ జ్వరంతో బాధపడుతున్నారని పేర్కొంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచార సమయాల్లో తరచూ అస్వస్థతకు లోనవుతున్నారు. పిఠాపురం ఎన్నికల ప్రచారంలో తీవ్ర జ్వరంతో బాధపడ్డారు. కొన్ని రోజుల విశ్రాంతి తర్వాత తిరిగి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. 
(1 / 6)

పవన్ కల్యాణ్‌ కు తరచూ జ్వరం రావడానికి కారణాలను జనసేన ప్రకటించింది.  పవన్ రికరెంట్ ఇన్‌ఫ్లుయంజాతో బాధపడుతున్నారని తెలిపింది. దీని కారణంగా ఊపిరితిత్తుల్లో నిమ్ముచేరి రోజూ ఏదో ఒక సమయంలో పవన్ జ్వరంతో బాధపడుతున్నారని పేర్కొంది.  
(2 / 6)

పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితి కారణంగా క్రేన్ గజమాలలు ఏర్పాటు చేయొద్దని జనసేన రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ఓ ప్రకటన విడుదల చేశారు. క్రేన్ గజమాలలు ఏర్పాటు చేయొద్దని కోరారు.  కరచాలనాలు, ఫొటోల కోసం ఒత్తిడి చేయొద్దని కోరారు. పూలు జల్లినప్పుడు పవన్ కల్యాణ్ ముఖం మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జనసేన నాయకులు, అభిమానులను విజ్ఞప్తి చేశారు. 
(3 / 6)

పవన్ కల్యాణ్ వారాహి విజయ భేరి యాత్ర కొనసాగిస్తున్నారు. దీంతో పాటు కూటమి పార్టీల ప్రజాగళం ఉమ్మడి ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రచార సమయంలో పవన్ తరచూ జ్వరంతో  బాధపడుతున్నారని తెలిసి అభిమానులు, జనసైనికులు ఆందోళన చెందున్నారు. 
(4 / 6)

రాజానగరం వారాహి సభలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. నా వ్యక్తిగత జీవితం, మిత్రులు కూడా కులాలను దాటి ఉంటారు, నా భార్య కూడా ఒక క్రిస్టియన్  తెలిపారు. వివేకా హత్య గురించి ప్రశ్నిస్తే కడప కోర్టుకు వెళ్లి బాబాయ్ హత్య గురించి, కత్తిపోట్ల గురించి మాట్లాడకూడదని స్టే తెచ్చుకుంటారని ఎద్దేవా చేశారు. వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడనని సభాముఖంగా చెబుతున్నానన్నారు.  
(5 / 6)

"జక్కంపూడి రాజా కాపు కార్పొరేషన్ ఛైర్మన్ గా ఉన్నారు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేం అన్నారు, సంవత్సరానికి రూ.2 వేల కోట్లు ఇస్తామన్నారు, నిధులు ఇవ్వడం కాదు కదా, కనీసం ఆఫీస్ లో టైపిస్ట్ కు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి తీసుకెళ్లారు" శనివారం రాజానగరం వారాహి విజయభేరి సభలో పవన్ కల్యాణ్  
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి