తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Ishan Kishan Girlfried Aditi Hundia Insatagram Post After He Make Double Hundred

Ishan Kishan Girlfriend: డబుల్ సెంచరీపై ఇషాన్ కిషన్ గర్ల్‌ఫ్రెండ్ అదిరిపోయే పోస్ట్.. ఏం చెప్పిందంటే?

12 December 2022, 8:40 IST

Ishan Kishan girlfriend Aditi Hundia instagram post: భారత యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ ఇటీవలే బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డే డబుల్ సెంచరీతో విజృంభించిన విషయం తెలిసిందే. 131 బంతుల్లోనే 210 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడు 24 ఫోర్లు, 10 సిక్సర్లు నమోదు చేశాడు. వన్డే క్రికెట్‌లోనే వేగవంతమైన డబుల్ సెంచరీ చేయడంతో సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే అతడి గర్ల్‌ఫ్రెండ్‌గా చెబుతున్న అదితి హుండియా ఇన్‌స్టా పోస్టు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

  • Ishan Kishan girlfriend Aditi Hundia instagram post: భారత యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ ఇటీవలే బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డే డబుల్ సెంచరీతో విజృంభించిన విషయం తెలిసిందే. 131 బంతుల్లోనే 210 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడు 24 ఫోర్లు, 10 సిక్సర్లు నమోదు చేశాడు. వన్డే క్రికెట్‌లోనే వేగవంతమైన డబుల్ సెంచరీ చేయడంతో సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే అతడి గర్ల్‌ఫ్రెండ్‌గా చెబుతున్న అదితి హుండియా ఇన్‌స్టా పోస్టు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
ఇషాన్ కిషన్ గర్ల్ ఫ్రెండ్ అదితి హుండియా అతడిని విభిన్నంగా అభినందించింది. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అతడికి సంబంధించిన చిత్రాలను షేర్ చేసింది. 
(1 / 7)

తన పోస్టుకు హార్ట్ ఎమోజీలను జత చేస్తూ ఇషాన్ ఫొటోలను షేర్ చేసింది. ఈ విధంగా అతడికి అభినందనలు తెలిపింది.
(2 / 7)

బంగ్లాతో జరిగిన మూడో వన్డేలో ఇషాన్ కిషన్ 131 బంతుల్లోనే 210 పరుగులు చేశాడు. ఇందులో 24 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. అంతేకాకుండా 126 బంతుల్లో డబుల్  సెంచరీని పూర్తి చేశాడు. వన్డేల్లో ఇదే అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ
(3 / 7)

2019 ఐపీఎల్‌లో ఇషాన్‌ను ఉత్సాహపరిచేందుకు అదితి స్టేడియానికి చేరుకుంది. అప్పటి నుంచి వీరిద్దరీ మధ్య ప్రేమయాణం కొనసాగుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై ఇద్దరూ బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. 
(4 / 7)

25 ఏళ్ల అదితి మోడలింగ్ రంగంలో రాణిస్తోంది. 2017లో మిస్ ఇండియా ఫైనల్్‌కు చేరింది. అలాగే 2018లో సూపర్ నేషనల్ మిస్ ఇండియాగా గుర్తింపు తెచ్చుకుంది.
(5 / 7)

గత కొన్నేళ్లుగా అదితి మ్యూజిక్ వీడియోలే కాకుండా..అనేక వాణిజ్య ప్రకటనల్లోనూ కనిపించింది. ఐపీఎల్ 2022 వేలంలో ముంబయి ఇండియన్స్ ఇషాన్ కిషన్‌ను 15.25 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఆ తర్వాత అతడిని అభినందిస్తూ షేర్ చేసింది. 
(6 / 7)

ఇషాన్ కిషన్-అదితి హుండియా
(7 / 7)
ఇషాన్ కిషన్-అదితి హుండియా(PHOTOS- Aditi Hundia instagram )

    ఆర్టికల్ షేర్ చేయండి