తెలుగు న్యూస్  /  ఫోటో  /  Irctc Shirdi Tour : తగ్గిన ‘షిర్డీ’ టూర్ ధర - హైదరాబాద్ నుంచి కొత్త ప్యాకేజీ ఇదే

IRCTC Shirdi Tour : తగ్గిన ‘షిర్డీ’ టూర్ ధర - హైదరాబాద్ నుంచి కొత్త ప్యాకేజీ ఇదే

11 May 2024, 13:04 IST

IRCTC Hyderabad Shirdi Tour: హైదరాబాద్ నుంచి షిర్డీకి కొత్త టూర్ ప్యాకేజీ వచ్చేసింది.  ఈ ప్యాకేజీని ఐఆర్‌సీటీసీ టూరిజం ఆపరేట్ చేస్తుంది. 4 రోజుల పాటు టూర్ ఉంటుంది. నాసిక్ , షిర్డీ వెళ్లి రావొచ్చు. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి…

  • IRCTC Hyderabad Shirdi Tour: హైదరాబాద్ నుంచి షిర్డీకి కొత్త టూర్ ప్యాకేజీ వచ్చేసింది.  ఈ ప్యాకేజీని ఐఆర్‌సీటీసీ టూరిజం ఆపరేట్ చేస్తుంది. 4 రోజుల పాటు టూర్ ఉంటుంది. నాసిక్ , షిర్డీ వెళ్లి రావొచ్చు. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి…
హైదరాబాద్ నుంచి షిర్డీ ‘సాయి శివమ్’ (SAI SHIVAM) పేరుతో ఐఆర్‌సీటీసీ టూరిజం ప్యాకేజీని  ప్రకటించింది. నాసిక్, షిరిడీ చూసి రావొచ్చు. హైదరాబాద్ నుంచి ప్రయణం మెుదలవుతుంది. మూడు రాత్రులు, నాలుగు రోజులతో  కూడిన ప్యాకేజీ ఇది.
(1 / 6)
హైదరాబాద్ నుంచి షిర్డీ ‘సాయి శివమ్’ (SAI SHIVAM) పేరుతో ఐఆర్‌సీటీసీ టూరిజం ప్యాకేజీని  ప్రకటించింది. నాసిక్, షిరిడీ చూసి రావొచ్చు. హైదరాబాద్ నుంచి ప్రయణం మెుదలవుతుంది. మూడు రాత్రులు, నాలుగు రోజులతో  కూడిన ప్యాకేజీ ఇది.(photo source unsplash.com)
ప్రస్తుతం మే 17, 2024న ప్యాకేజీ అందుబాటులో ఉంది. శుక్రవారం తేదీల్లో ఆపరేట్ చేస్తున్నారు. ఈ తేదీ మిస్ అయితే… మరో తేదీలో కూడా వెళ్లొచ్చు.
(2 / 6)
ప్రస్తుతం మే 17, 2024న ప్యాకేజీ అందుబాటులో ఉంది. శుక్రవారం తేదీల్లో ఆపరేట్ చేస్తున్నారు. ఈ తేదీ మిస్ అయితే… మరో తేదీలో కూడా వెళ్లొచ్చు.(photo source unsplash.com)
Day 1 షెడ్యూల్ : ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకున్న వారికి కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి 06:40 గంటలకు ట్రైన్ ఉంటుంది. రైలు నెం. 17064, అజంతా ఎక్స్‌ప్రెస్ లో ఎక్కాలి. రాత్రి మొత్తం జర్నీలోనే ఉంటారు.
(3 / 6)
Day 1 షెడ్యూల్ : ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకున్న వారికి కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి 06:40 గంటలకు ట్రైన్ ఉంటుంది. రైలు నెం. 17064, అజంతా ఎక్స్‌ప్రెస్ లో ఎక్కాలి. రాత్రి మొత్తం జర్నీలోనే ఉంటారు.(photo source unsplash.com)
Day 2 షెడ్యూల్ : ఉదయం 7:10 గంటలకు నాగర్‌సోల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. పికప్ చేసుకుని షిరిడీకి తీసుకెళ్తారు. ఆ తర్వాత హోటల్‌లో చెక్ ఇన్ అవ్వాలి. అనంతరం షిరిడీ ఆలయం సందర్శన ఉంటుంది. సాయంత్రం షిరిడీలో తిరగొచ్చు. రాత్రికి అక్కడే చేస్తారు.
(4 / 6)
Day 2 షెడ్యూల్ : ఉదయం 7:10 గంటలకు నాగర్‌సోల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. పికప్ చేసుకుని షిరిడీకి తీసుకెళ్తారు. ఆ తర్వాత హోటల్‌లో చెక్ ఇన్ అవ్వాలి. అనంతరం షిరిడీ ఆలయం సందర్శన ఉంటుంది. సాయంత్రం షిరిడీలో తిరగొచ్చు. రాత్రికి అక్కడే చేస్తారు.(photo source unsplash.com)
Day 3 షెడ్యూల్ : షిరిడీలో హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. త్రయంబకేశ్వర్, పంచవతి దర్శనం ఉంటుంది. నాగర్‌సోల్ స్టేషన్‌లో రాత్రి 08:30 గంటలకు రైలు ఉంటుంది. 09:20 గంటలకు బయల్దేరుతుంది. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది. 
(5 / 6)
Day 3 షెడ్యూల్ : షిరిడీలో హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. త్రయంబకేశ్వర్, పంచవతి దర్శనం ఉంటుంది. నాగర్‌సోల్ స్టేషన్‌లో రాత్రి 08:30 గంటలకు రైలు ఉంటుంది. 09:20 గంటలకు బయల్దేరుతుంది. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది. (photo source unsplash.com)
Day 4 - ఉదయం 09.45 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ షిర్డీ టూర్ ప్యాకేజీ టికెట్ ధరలు చూస్తే…. సింగిల్ షేరింగ్ కు రూ. 9320గా ఉండగా… డబుల్ షేరింగ్ కు రూ. 7960ధరగా నిర్ణయించారు.  కంఫర్ట్ క్లాస్ లోఈ ధరలు అందుబాటులో ఉన్నాయి. మార్చి నెలతో పోల్చితే స్వల్పంగా టూర్ ప్యాకేజీ ధర తగ్గింది. మార్చి నెలలో  సింగిల్ షేరింగ్ కు రూ. 9530గా ఉంది.  ఈ టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ వంటివి కవర్ అవుతాయి. నిబంధనలు కూడా వర్తిస్తాయి.  https://www.irctctourism.com/  క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు. 
(6 / 6)
Day 4 - ఉదయం 09.45 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ షిర్డీ టూర్ ప్యాకేజీ టికెట్ ధరలు చూస్తే…. సింగిల్ షేరింగ్ కు రూ. 9320గా ఉండగా… డబుల్ షేరింగ్ కు రూ. 7960ధరగా నిర్ణయించారు.  కంఫర్ట్ క్లాస్ లోఈ ధరలు అందుబాటులో ఉన్నాయి. మార్చి నెలతో పోల్చితే స్వల్పంగా టూర్ ప్యాకేజీ ధర తగ్గింది. మార్చి నెలలో  సింగిల్ షేరింగ్ కు రూ. 9530గా ఉంది.  ఈ టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ వంటివి కవర్ అవుతాయి. నిబంధనలు కూడా వర్తిస్తాయి.  https://www.irctctourism.com/  క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు. (photo source unsplash.com)

    ఆర్టికల్ షేర్ చేయండి