తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ipl 2024 Points Table: పంజాబ్‍ చేతిలో రాజస్థాన్ ఓటమి.. పాయింట్ల పట్టిక, ప్లేఆఫ్స్ రేస్ ఎలా ఉన్నాయంటే!

IPL 2024 Points Table: పంజాబ్‍ చేతిలో రాజస్థాన్ ఓటమి.. పాయింట్ల పట్టిక, ప్లేఆఫ్స్ రేస్ ఎలా ఉన్నాయంటే!

16 May 2024, 8:30 IST

IPL 2024 Points Table Update: ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరిన రాజస్థాన్ రాయల్స్… పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‍లో బుధవారం (మే 15) ఓటమి పాలైంది. కీలక దశలో ఫామ్ కోల్పోయింది. ఐపీఎల్ 2024 సీజన్‍‍లో 65వ మ్యాచ్‍ తర్వాత ప్రస్తుతం పాయింట్ల పట్టిక ఎలా ఉందంటే..

  • IPL 2024 Points Table Update: ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరిన రాజస్థాన్ రాయల్స్… పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‍లో బుధవారం (మే 15) ఓటమి పాలైంది. కీలక దశలో ఫామ్ కోల్పోయింది. ఐపీఎల్ 2024 సీజన్‍‍లో 65వ మ్యాచ్‍ తర్వాత ప్రస్తుతం పాయింట్ల పట్టిక ఎలా ఉందంటే..
ఐపీఎల్ 2024 సీజన్‍లో కోల్‍కతా నైట్‍రైడర్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడంతో పాటు టాప్ ప్లేస్‍ను కూడా ఇప్పటికే ఖరారు చేసుంది. కోల్‍కతా ఇప్పటి వరకు 13 మ్యాచ్‍ల్లో 9 గెలిచి మూడు ఓడగా.. ఓ మ్యాచ్ రద్దయింది. దీంతో 19 పాయింట్లతో (నెట్‍రన్ రేట్ +1.428) ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్‍లో కొనసాగుతోంది. ఆ జట్టుకు మరో లీగ్ మ్యాచ్ మిగిలి ఉంది.
(1 / 9)

పంజాబ్‍తో ఓటమి తర్వాత కూడా రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగింది. అయితే, ఈ ప్లేస్ నిలబెట్టుకోవడం సందిగ్ధంగా మారింది. ఇప్పటి వరకు 13 మ్యాచ్‍ల్లో 8 గెలిచి, 5 ఓడింది రాజస్థాన్. దీంతో 16 పాయింట్లతో (+0.273)లో పట్టికలో రెండో ప్లేస్‍లో ఉంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరినా గత నాలుగు మ్యాచ్‍ల్లో వరుసగా ఓడి ఫామ్ కోల్పోయింది. రాజస్థాన్‍కు మరో లీగ్ మ్యాచ్ మిగిలిఉంది. 
(2 / 9)
పంజాబ్‍తో ఓటమి తర్వాత కూడా రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగింది. అయితే, ఈ ప్లేస్ నిలబెట్టుకోవడం సందిగ్ధంగా మారింది. ఇప్పటి వరకు 13 మ్యాచ్‍ల్లో 8 గెలిచి, 5 ఓడింది రాజస్థాన్. దీంతో 16 పాయింట్లతో (+0.273)లో పట్టికలో రెండో ప్లేస్‍లో ఉంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరినా గత నాలుగు మ్యాచ్‍ల్లో వరుసగా ఓడి ఫామ్ కోల్పోయింది. రాజస్థాన్‍కు మరో లీగ్ మ్యాచ్ మిగిలిఉంది. (AP)
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటి వరకు 13 మ్యాచ్‍ల్లో 7 గెలిచి 6 ఓడింది. 14 పాయింట్లతో (+0.528)తో ఉంది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. మే 18న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్‍లో గెలిస్తే చెన్నై ప్లేఆఫ్స్ చేరుతుంది. 
(3 / 9)
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటి వరకు 13 మ్యాచ్‍ల్లో 7 గెలిచి 6 ఓడింది. 14 పాయింట్లతో (+0.528)తో ఉంది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. మే 18న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్‍లో గెలిస్తే చెన్నై ప్లేఆఫ్స్ చేరుతుంది. (PTI)
ఈ సీజన్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటి వరకు 12 మ్యాచ్‍ల్లో 7 గెలిచి.. 5 ఓడింది. 14 పాయింట్లతో (+0.406) ఉంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం నాలుగో ప్లేస్‍లో ఉంది. లీగ్ దశలో మిగిలిన రెండు మ్యాచ్‍లు గెలిస్తే.. రెండో ప్లేస్‍ను ఖరారు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకటి గెలిచినా ప్లేఆఫ్స్ చేరుతుంది.
(4 / 9)
ఈ సీజన్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటి వరకు 12 మ్యాచ్‍ల్లో 7 గెలిచి.. 5 ఓడింది. 14 పాయింట్లతో (+0.406) ఉంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం నాలుగో ప్లేస్‍లో ఉంది. లీగ్ దశలో మిగిలిన రెండు మ్యాచ్‍లు గెలిస్తే.. రెండో ప్లేస్‍ను ఖరారు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకటి గెలిచినా ప్లేఆఫ్స్ చేరుతుంది.( AFP)
ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్‍లో తన పూర్తి 14 లీగ్‍ మ్యాచ్‍లను ఆడేసింది. 7 గెలిచి, 7 ఓడి 14 పాయింట్లతో  (-0.377) ఉంది. ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది. అయితే, ఆ జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు చాలా అత్యల్పమే.
(5 / 9)
ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్‍లో తన పూర్తి 14 లీగ్‍ మ్యాచ్‍లను ఆడేసింది. 7 గెలిచి, 7 ఓడి 14 పాయింట్లతో  (-0.377) ఉంది. ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది. అయితే, ఆ జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు చాలా అత్యల్పమే.(AFP)
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 13 మ్యాచ్‍ల్లో 6 గెలిచి, 7 ఓడింది. ప్రస్తుతం 12 పాయింట్లతో (+0.387) ఆరో ప్లేస్‍లో ఉంది. మే 18న చెన్నైతో మ్యాచ్‍లో భారీగా గెలిస్తే.. ఈ జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. 
(6 / 9)
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 13 మ్యాచ్‍ల్లో 6 గెలిచి, 7 ఓడింది. ప్రస్తుతం 12 పాయింట్లతో (+0.387) ఆరో ప్లేస్‍లో ఉంది. మే 18న చెన్నైతో మ్యాచ్‍లో భారీగా గెలిస్తే.. ఈ జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. (PTI)
ఈ ఐపీఎల్ 2024 సీజన్‍లో లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటి వరకు 13 మ్యాచ్‍ల్లో 6 గెలిచి, 7 ఓడి.. 12 పాయింట్లతో (-0.787)తో ఉంది. ఏడో స్థానంలో ఉంది. లీగ్ దశలో ఓ మ్యాచ్ మిగిలే ఉన్నా.. నెట్ రన్‍రేట్ తక్కువగా ఉండడం చాలా మైనస్‍గా మారింది. మిగిలిన మ్యాచ్‍లో అత్యంత భారీగా గెలిస్తే లక్నో టీమ్‍కు కాస్త ప్లేఆఫ్స్ ఆశలు ఉండొచ్చు. 
(7 / 9)
ఈ ఐపీఎల్ 2024 సీజన్‍లో లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటి వరకు 13 మ్యాచ్‍ల్లో 6 గెలిచి, 7 ఓడి.. 12 పాయింట్లతో (-0.787)తో ఉంది. ఏడో స్థానంలో ఉంది. లీగ్ దశలో ఓ మ్యాచ్ మిగిలే ఉన్నా.. నెట్ రన్‍రేట్ తక్కువగా ఉండడం చాలా మైనస్‍గా మారింది. మిగిలిన మ్యాచ్‍లో అత్యంత భారీగా గెలిస్తే లక్నో టీమ్‍కు కాస్త ప్లేఆఫ్స్ ఆశలు ఉండొచ్చు. (ANI)
ఈ సీజన్ ప్లేఆఫ్స్ రేసు నుంచి పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ఔటయ్యాయి. గుజరాత్ 13 మ్యాచ్‍ల్లో 5 గెలిచి, ఏడు ఓడింది. ఓ మ్యాచ్ రద్దయింది. 11 పాయింట్లతో (-0.063)తో పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ 13 మ్యాచ్‍ల్లో 5 గెలిచి, 8 ఓడింది. 10 పాయింట్లతో (-.347) టేబుల్‍లో 9వ ప్లేస్‍లో ఉంది. ఈ జట్లకు లీగ్ దశలో మరో మ్యాచ్‍ మిగిలి ఉంది. 
(8 / 9)

ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ కూడా ఇప్పటికే ఐపీఎల్ 2024 సీజన్ ప్లేఆఫ్స్ రేసు నుంచి ఔట్ అయింది. 13 మ్యాచ్‍ల్లో నాలుగు మాత్రమే గెలిచిన హార్దిక్ పాండ్యా సేన 9సార్లు ఓటమి పాలైంది. దీంతో 8 పాయింట్లే (-0.271) ఖాతాలో ఉన్నాయి. పాయింట్ల పట్టికలో చివరిదైన పదో స్థానంలో ప్రస్తుతం ఉంది. లీగ్ దశలో ముంబై మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. 
(9 / 9)

    ఆర్టికల్ షేర్ చేయండి