తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ipl 2024 Points Table: సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచినా.. పంజాబ్ కింగ్స్ ఓడినా పాయింట్ల టేబుల్లో మారని స్థానాలు.. ఎందుకు?

IPL 2024 Points Table: సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచినా.. పంజాబ్ కింగ్స్ ఓడినా పాయింట్ల టేబుల్లో మారని స్థానాలు.. ఎందుకు?

10 April 2024, 7:40 IST

IPL 2024 Points Table: పంజాబ్ కింగ్స్ ను వాళ్ల సొంత మైదానంలో చిత్తు చేసినా ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్లో సన్ రైజర్స్ స్థానం మాత్రం మారలేదు. తాజా మ్యాచ్ తర్వాత ఏ టీమ్ ఏ స్థానంలో ఉందో ఒకసారి చూద్దాం.

  • IPL 2024 Points Table: పంజాబ్ కింగ్స్ ను వాళ్ల సొంత మైదానంలో చిత్తు చేసినా ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్లో సన్ రైజర్స్ స్థానం మాత్రం మారలేదు. తాజా మ్యాచ్ తర్వాత ఏ టీమ్ ఏ స్థానంలో ఉందో ఒకసారి చూద్దాం.
IPL 2024 Points Table: పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు శశాంక్ సింగ్, అశుతోష్ శర్మలు వరుసగా రెండో మ్యాచ్ లోనూ భయపెట్టినా.. చివరికి 2 పరుగులతో గెలిచింది సన్ రైజర్స్ హైదరాబాద్. అయితే ఈ గెలుపు తర్వాత కూడా ఆ టీమ్ ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలోనే ఉంది. కేకేఆర్, లక్నో, సీఎస్కేలతో సమానంగా 6 పాయింట్లతోనే ఉన్నా.. నెట్ రన్ రేట్ (0.344) విషయంలో ఆ టీమ్స్ కంటే వెనుకబడింది.
(1 / 8)
IPL 2024 Points Table: పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు శశాంక్ సింగ్, అశుతోష్ శర్మలు వరుసగా రెండో మ్యాచ్ లోనూ భయపెట్టినా.. చివరికి 2 పరుగులతో గెలిచింది సన్ రైజర్స్ హైదరాబాద్. అయితే ఈ గెలుపు తర్వాత కూడా ఆ టీమ్ ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలోనే ఉంది. కేకేఆర్, లక్నో, సీఎస్కేలతో సమానంగా 6 పాయింట్లతోనే ఉన్నా.. నెట్ రన్ రేట్ (0.344) విషయంలో ఆ టీమ్స్ కంటే వెనుకబడింది.(AP)
IPL 2024 Points Table: అటు సన్ రైజర్స్ చేతుల్లో ఓడినా పంజాబ్ కింగ్స్ కూడా ఆరో స్థానంలోనే కొనసాగుతోంది. ఆ టీమ్ 5 మ్యాచ్ లలో 2 గెలిచి, మూడు ఓడి 4 పాయింట్లు, -0.196 నెట్ రన్ రేట్ తో ఆరో స్థానంలో ఉంది.
(2 / 8)
IPL 2024 Points Table: అటు సన్ రైజర్స్ చేతుల్లో ఓడినా పంజాబ్ కింగ్స్ కూడా ఆరో స్థానంలోనే కొనసాగుతోంది. ఆ టీమ్ 5 మ్యాచ్ లలో 2 గెలిచి, మూడు ఓడి 4 పాయింట్లు, -0.196 నెట్ రన్ రేట్ తో ఆరో స్థానంలో ఉంది.(ANI)
IPL 2024 Points Table: ఈ మ్యాచ్ అసలు ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్లో ఎలాంటి మార్పులు తీసుకురాలేదు. టాప్ లో రాజస్థాన్ రాయల్స్ 8 పాయింట్లు, 1.120 నెట్ రన్ రేట్ తో కొనసాగుతోంది. ఈ సీజన్లో ఓటమెరగని టీమ్ ఇదొక్కటే.
(3 / 8)
IPL 2024 Points Table: ఈ మ్యాచ్ అసలు ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్లో ఎలాంటి మార్పులు తీసుకురాలేదు. టాప్ లో రాజస్థాన్ రాయల్స్ 8 పాయింట్లు, 1.120 నెట్ రన్ రేట్ తో కొనసాగుతోంది. ఈ సీజన్లో ఓటమెరగని టీమ్ ఇదొక్కటే.(ANI)
IPL 2024 Points Table: కోల్‌కతా నైట్ రైడర్స్ రెండోస్థానంలోనే ఉంది. ఆ టీమ్ 4 మ్యాచ్ లలో 3 గెలిచి, ఒకటి ఓడింది. ఆ టీమ్ 6 పాయింట్లు, 1.528 నెట్ రన్ రేట్ తో కొనసాగుతోంది.
(4 / 8)
IPL 2024 Points Table: కోల్‌కతా నైట్ రైడర్స్ రెండోస్థానంలోనే ఉంది. ఆ టీమ్ 4 మ్యాచ్ లలో 3 గెలిచి, ఒకటి ఓడింది. ఆ టీమ్ 6 పాయింట్లు, 1.528 నెట్ రన్ రేట్ తో కొనసాగుతోంది.(PTI)
IPL 2024 Points Table: లక్నో సూపర్ జెయింట్స్ కూడా 4 మ్యాచ్ లలో 3 విజయాలు, ఒక ఓటమితో 6 పాయింట్లు, 0.775 నెట్ రన్ రేట్ తో మూడో స్థానంలో కొనసాగుతోంది.
(5 / 8)
IPL 2024 Points Table: లక్నో సూపర్ జెయింట్స్ కూడా 4 మ్యాచ్ లలో 3 విజయాలు, ఒక ఓటమితో 6 పాయింట్లు, 0.775 నెట్ రన్ రేట్ తో మూడో స్థానంలో కొనసాగుతోంది.( AFP)
IPL 2024 Points Table: చెన్నై సూపర్ కింగ్స్ 5 మ్యాచ్ లలో 3 విజయాలు, 2 ఓటములతో 6 పాయింట్లు, 0.666 నెట్ రన్ రేట్ తో నాలుగో స్థానంలోనే ఉంది.
(6 / 8)
IPL 2024 Points Table: చెన్నై సూపర్ కింగ్స్ 5 మ్యాచ్ లలో 3 విజయాలు, 2 ఓటములతో 6 పాయింట్లు, 0.666 నెట్ రన్ రేట్ తో నాలుగో స్థానంలోనే ఉంది.(csk twitter)
IPL 2024 Points Table: గుజరాత్ టైటన్స్ 5 మ్యాచ్ లలో 2 గెలిచి, 3 ఓడి 4 పాయింట్లు, -0.797 నెట్ రన్ రేట్ తో ఏడో స్థానంలో ఉంది.
(7 / 8)
IPL 2024 Points Table: గుజరాత్ టైటన్స్ 5 మ్యాచ్ లలో 2 గెలిచి, 3 ఓడి 4 పాయింట్లు, -0.797 నెట్ రన్ రేట్ తో ఏడో స్థానంలో ఉంది.(ANI)
IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్లో చిట్ట చివరి మూడు స్థానాల్లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నాయి. ఈ మూడు టీమ్స్ ఒక్కో విజయంతో రెండేసి పాయింట్లు సాధించినా నెట్ రన్ రేట్ విషయంలో ముంబై ఇండియన్స్ (-0.704) మెరుగ్గా ఉంది.
(8 / 8)
IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్లో చిట్ట చివరి మూడు స్థానాల్లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నాయి. ఈ మూడు టీమ్స్ ఒక్కో విజయంతో రెండేసి పాయింట్లు సాధించినా నెట్ రన్ రేట్ విషయంలో ముంబై ఇండియన్స్ (-0.704) మెరుగ్గా ఉంది.(ANI)

    ఆర్టికల్ షేర్ చేయండి