తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ipl 2024 Points Table: రెండు మ్యాచ్‌లతో మొత్తం మారిపోయిన పాయింట్ల టేబుల్.. సీఎస్కే, ఆర్సీబీ స్థానాలు ఇలా..

IPL 2024 Points Table: రెండు మ్యాచ్‌లతో మొత్తం మారిపోయిన పాయింట్ల టేబుల్.. సీఎస్కే, ఆర్సీబీ స్థానాలు ఇలా..

13 May 2024, 7:43 IST

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్ మొత్తం మారిపోయింది. సూపర్ సండే రెండు మ్యాచ్ లతో సీఎస్కే మూడో స్థానానికి చేరగా.. ఆర్సీబీ ఐదో స్థానానికి వచ్చి ప్లేఆఫ్స్ కు చేరువైంది.

  • IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్ మొత్తం మారిపోయింది. సూపర్ సండే రెండు మ్యాచ్ లతో సీఎస్కే మూడో స్థానానికి చేరగా.. ఆర్సీబీ ఐదో స్థానానికి వచ్చి ప్లేఆఫ్స్ కు చేరువైంది.
IPL 2024 Points Table: ఐపీఎల్ 2024లో ఆదివారం (మే 12) జరిగిన కీలకమైన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ను చిత్తు చేసిన చెన్నై సూపర్ కింగ్స్ మూడో స్థానానికి ఎగబాకింది. 13 మ్యాచ్ లలో ఏడు విజయాలతో 14 పాయింట్లు సీఎస్కే ఖాతాలో ఉన్నాయి. సన్ రైజర్స్ కంటే నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండటంతో చెన్నై మూడో స్థానానికి చేరింది.
(1 / 7)

IPL 2024 Points Table: హ్యాట్రిక్ ఓటములతో షాక్ మీద షాక్ తింటున్న రాజస్థాన్ రాయల్స్ ఇంకా రెండో స్థానంలోనే కొనసాగుతోంది. ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయమవుతుంది అనుకున్న సమయంలో వరుసగా మూడు మ్యాచ్ లలో ఆ టీమ్ ఓడిపోయింది. ప్రస్తుతం 12 మ్యాచ్ లలో 16 పాయింట్లు, 0.349 నెట్ రన్ రేట్ తో రెండోస్థానంలో ఉంది.
(2 / 7)

IPL 2024 Points Table: ఆదివారం (మే 12) ఢిల్లీ క్యాపిటల్స్ పై గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఐదో స్థానానికి ఎగబాకింది. ఆ టీమ్ 13 మ్యాచ్ లలో 12 పాయింట్లు, 0.387 నెట్ రన్ రేట్ తో ఉంది. ఢిల్లీ, లక్నోలను సమం చేసినా.. నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండటంతో వాటి కంటే పైకి చేరింది.
(3 / 7)

IPL 2024 Points Table: ఆర్సీబీ చేతుల్లో ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ ఆశలకు దెబ్బ పడింది. ఆ టీమ్ 13 మ్యాచ్ లలో 6 విజయాలు 12 పాయింట్లతో ఆరోస్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ -0.482గా ఉండటం డీసీకి ప్రతికూలాంశం అని చెప్పాలి.
(4 / 7)

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024లో ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకున్న తొలి జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ టాప్ లోనే కొనసాగుతోంది. ఆ టీమ్ 12 మ్యాచ్ లలో 9 విజయాలు 18 పాయింట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. నెట్ రన్ రేట్ కూడా 1.428గా ఉండటం విశేషం.
(5 / 7)

IPL 2024 Points Table: సన్ రైజర్స్ హైదరాబాద్ నాలుగో స్థానానికి పడిపోయింది. చెన్నై విజయంతో మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న ఆ టీమ్ మూడో స్థానానికి చేరుకుంది. సన్ రైజర్స్ 12 మ్యాచ్ లలో 7 విజయాలు 14 పాయింట్లతో ఉంది. నెట్ రన్ రేట్ 0.406గా ఉంది.
(6 / 7)

IPL 2024 Points Table: లక్నో సూపర్ జెయింట్స్ 12 మ్యాచ్ లలో 12 పాయింట్లతో ఏడో స్థానానికి పడిపోయింది. ఆ టీమ్ నెట్ రన్ రేట్ -0.769గా ఉంది. ఆర్సీబీ, ఢిల్లీలతో పాయింట్ల విషయంలో సమంగా ఉన్నా కూడా.. నెట్ రన్ రేట్ దారుణంగా ఉంది. ఇక గుజరాత్ టైటన్స్ 12 మ్యాచ్ లలో ఐదు విజయాలు 10 పాయింట్లతో ఎనిమిది, ముంబై ఇండియన్స్ 13 మ్యాచ్ లలో 4 విజయాలు, 8 పాయింట్లతో తొమ్మిది, పంజాబ్ కింగ్స్ 12 మ్యాచ్ లలో 4 విజయాలు, 8 పాయింట్లతో పదవ స్థానాల్లో ఉన్నాయి.
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి