తెలుగు న్యూస్  /  ఫోటో  /  Lsg Vs Rr: ఐపీఎల్‍లో రికార్డు సృష్టించిన కేఎల్ రాహుల్.. ఓపెనర్‌గా మరో మైల్‍స్టోన్ దాటిన లక్నో కెప్టెన్

LSG vs RR: ఐపీఎల్‍లో రికార్డు సృష్టించిన కేఎల్ రాహుల్.. ఓపెనర్‌గా మరో మైల్‍స్టోన్ దాటిన లక్నో కెప్టెన్

27 April 2024, 21:46 IST

LSG vs RR - KL Rahul: ఐపీఎల్ 2024 సీజన్‍లో రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‍లో అర్ధ శకతంతో అదరగొట్టాడు లక్నో కెెప్టెన్ కేఎల్ రాహుల్. ఈ క్రమంలో ఓపెనర్‌గా ఓ మైల్‍స్టోన్ దాటి.. రికార్డు సృష్టించాడు.

  • LSG vs RR - KL Rahul: ఐపీఎల్ 2024 సీజన్‍లో రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‍లో అర్ధ శకతంతో అదరగొట్టాడు లక్నో కెెప్టెన్ కేఎల్ రాహుల్. ఈ క్రమంలో ఓపెనర్‌గా ఓ మైల్‍స్టోన్ దాటి.. రికార్డు సృష్టించాడు.
ఐపీఎల్ 2024 సీజన్‍లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్ కేఎల్ రాహుల్ మరోసారి అదరగొట్టాడు. రాయల్ చాలెంజర్స్ (RR)తో ఎఖానా స్టేడియం వేదికగా నేటి మ్యాచ్‍లో హాఫ్ సెంచరీతో రాహుల్ మెరిపించాడు. 
(1 / 6)
ఐపీఎల్ 2024 సీజన్‍లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్ కేఎల్ రాహుల్ మరోసారి అదరగొట్టాడు. రాయల్ చాలెంజర్స్ (RR)తో ఎఖానా స్టేడియం వేదికగా నేటి మ్యాచ్‍లో హాఫ్ సెంచరీతో రాహుల్ మెరిపించాడు. (AP)
ఈ మ్యాచ్‍లో 48 బంతుల్లోనే 76 పరుగులు సాధించాడు ఓపెనర్ కేఎల్ రాహుల్. 8 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టి దుమ్మురేపాడు. 11 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయినా దూకుడుగానే ఆడాడు రాహుల్. 
(2 / 6)
ఈ మ్యాచ్‍లో 48 బంతుల్లోనే 76 పరుగులు సాధించాడు ఓపెనర్ కేఎల్ రాహుల్. 8 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టి దుమ్మురేపాడు. 11 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయినా దూకుడుగానే ఆడాడు రాహుల్. (PTI)
ఈ క్రమంలో ఓపెనర్‌గా ఐపీఎల్‍లో 4000 పరుగులను కేఎల్ రాహుల్ పూర్తి చేసుకున్నాడు. అలాగే, ఓపెనర్‌గా అత్యంత వేగంగా 4000 పరుగుల మార్క్ చేరిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఓపెనర్‌గా 94 ఇన్నింగ్స్‌లోనే 4041 పరుగులు చేశాడు రాహుల్. ఐపీఎల్‍లో మొత్తంగా ఇప్పటి వరకు 127 మ్యాచ్‍ల్లో 4,541 పరుగులు చేశాడు. 
(3 / 6)
ఈ క్రమంలో ఓపెనర్‌గా ఐపీఎల్‍లో 4000 పరుగులను కేఎల్ రాహుల్ పూర్తి చేసుకున్నాడు. అలాగే, ఓపెనర్‌గా అత్యంత వేగంగా 4000 పరుగుల మార్క్ చేరిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఓపెనర్‌గా 94 ఇన్నింగ్స్‌లోనే 4041 పరుగులు చేశాడు రాహుల్. ఐపీఎల్‍లో మొత్తంగా ఇప్పటి వరకు 127 మ్యాచ్‍ల్లో 4,541 పరుగులు చేశాడు. (PTI)
విరాట్ కోహ్లీ ఐపీఎల్‍లో ఓపెనర్‌గా 107 ఇన్నింగ్స్‌లో 4041 పరుగులు చేశాడు. అయితే, రాహుల్ 94 ఇన్నింగ్స్‌లోనే ఓపెనర్‌గా 4000 రన్స్ మార్క్ దాటాడు. ఓవరాల్‍గా ఐపీఎల్‍లో కోహ్లీ ఇప్పటి వరకు 246 మ్యాచ్‍ల్లో 7,693 పరుగులు చేశాడు. 
(4 / 6)
విరాట్ కోహ్లీ ఐపీఎల్‍లో ఓపెనర్‌గా 107 ఇన్నింగ్స్‌లో 4041 పరుగులు చేశాడు. అయితే, రాహుల్ 94 ఇన్నింగ్స్‌లోనే ఓపెనర్‌గా 4000 రన్స్ మార్క్ దాటాడు. ఓవరాల్‍గా ఐపీఎల్‍లో కోహ్లీ ఇప్పటి వరకు 246 మ్యాచ్‍ల్లో 7,693 పరుగులు చేశాడు. (PTI)
ఐపీఎల్‍లో 4000 మార్కును దాటిన ఐదో ఓపెనర్‌గా రాహుల్ నిలిచాడు. ఐపీఎల్‍లో ఓపెనర్‌గా వచ్చి అత్యధిక పరుగులు చేసిన జాబితాలో శిఖర్ ధావన్ (6,362), డేవిడ్ వార్నర్ (5,909), క్రిస్ గేల్ (4,480), విరాట్ కోహ్లీ (4,041), కేఎల్ రాహుల్ (4041) టాప్-5లో ఉన్నారు. 
(5 / 6)
ఐపీఎల్‍లో 4000 మార్కును దాటిన ఐదో ఓపెనర్‌గా రాహుల్ నిలిచాడు. ఐపీఎల్‍లో ఓపెనర్‌గా వచ్చి అత్యధిక పరుగులు చేసిన జాబితాలో శిఖర్ ధావన్ (6,362), డేవిడ్ వార్నర్ (5,909), క్రిస్ గేల్ (4,480), విరాట్ కోహ్లీ (4,041), కేఎల్ రాహుల్ (4041) టాప్-5లో ఉన్నారు. (PTI)
రాజస్థాన్‍తో మ్యాచ్‍లో రాహుల్‍తో పాటు లక్నో బ్యాటర్ దీపక్ హూడా (50) కూడా అర్ధ శకతం చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 5 వికెట్లకు 196 పరుగులు సాధించింది. రాజస్థాన్ ముందు 197 పరుగుల టార్గెట్ ఉంది. 
(6 / 6)
రాజస్థాన్‍తో మ్యాచ్‍లో రాహుల్‍తో పాటు లక్నో బ్యాటర్ దీపక్ హూడా (50) కూడా అర్ధ శకతం చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 5 వికెట్లకు 196 పరుగులు సాధించింది. రాజస్థాన్ ముందు 197 పరుగుల టార్గెట్ ఉంది. (PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి