తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Iphone Hacked?: మీ ఐ ఫోన్ హ్యాక్ అయిందో? లేదో తెలుసుకోవాలా? ఇలా చేయండి..

iPhone hacked?: మీ ఐ ఫోన్ హ్యాక్ అయిందో? లేదో తెలుసుకోవాలా? ఇలా చేయండి..

13 April 2024, 19:02 IST

జనరల్ గా ఐ ఫోన్ అత్యంత సురక్షితమైన స్మార్ట్ ఫోన్. ఐ ఫోన్ లో సెక్యూరిటీ, ప్రైవసీ ఫీచర్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. అయినా, హ్యాకర్లు ఐ ఫోన్ లను కూడా వదలడం లేదు. ఇటీవల ఆపిల్ సంస్థ ఐ ఫోన్ యూజర్లకు హ్యాకింగ్ హెచ్చరికలను జారీ చేసింది. మీ ఐ ఫోన్ హ్యాక్ అయిందని ఈ సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు.

జనరల్ గా ఐ ఫోన్ అత్యంత సురక్షితమైన స్మార్ట్ ఫోన్. ఐ ఫోన్ లో సెక్యూరిటీ, ప్రైవసీ ఫీచర్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. అయినా, హ్యాకర్లు ఐ ఫోన్ లను కూడా వదలడం లేదు. ఇటీవల ఆపిల్ సంస్థ ఐ ఫోన్ యూజర్లకు హ్యాకింగ్ హెచ్చరికలను జారీ చేసింది. మీ ఐ ఫోన్ హ్యాక్ అయిందని ఈ సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు.
1. బ్యాటరీ డ్రైన్, హీటింగ్ సమస్యలు: మీ ఐ ఫోన్ బ్యాటరీ చాలా త్వరగా డ్రైన్ అవుతుండడం మీ ఐఫోన్ హ్యాక్ లేదా స్పైవేర్ బారిన పడిందనడానికి ప్రధాన సంకేతాలలో ఒకటి. అలాగే, మీ ఫోన్ వేడెక్కడం కూడా మీ ఐ ఫోన్ హ్యాక్ అయిందనడానికి మరో సంకేతం. మీ ఐఫోన్ సెట్టింగ్స్ లో ఏ యాప్ ఎక్కువ బ్యాటరీని వినియోగిస్తోందో చెక్ చేసుకోండి.
(1 / 5)
1. బ్యాటరీ డ్రైన్, హీటింగ్ సమస్యలు: మీ ఐ ఫోన్ బ్యాటరీ చాలా త్వరగా డ్రైన్ అవుతుండడం మీ ఐఫోన్ హ్యాక్ లేదా స్పైవేర్ బారిన పడిందనడానికి ప్రధాన సంకేతాలలో ఒకటి. అలాగే, మీ ఫోన్ వేడెక్కడం కూడా మీ ఐ ఫోన్ హ్యాక్ అయిందనడానికి మరో సంకేతం. మీ ఐఫోన్ సెట్టింగ్స్ లో ఏ యాప్ ఎక్కువ బ్యాటరీని వినియోగిస్తోందో చెక్ చేసుకోండి.(Unsplash)
2. పెరిగిన మొబైల్ డేటా వినియోగం: మీరు ఇంటర్నెట్ ను ఎప్పటిలాగానే వినియోగిస్తున్నప్పటికీ.. మీ మొబైల్ డేటా వినియోగం అకస్మాత్తుగా భారీగా పెరిగితే, మీ ఐ ఫోన్ హ్యాక్ అయి ఉండవచ్చనడానికి సంకేతం. ఏదైనా అసాధారణ డేటా వినియోగాన్ని గుర్తించడానికి మీరు మీ ఐఫోన్లోని వివిధ యాప్స్ వినియోగించే డేటాను చెక్ చేయవచ్చు. హ్యాకర్లు ఏదైనా రహస్య సర్వీస్ ను మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేస్తే, మీ డేటా వినియోగం పెరుగుతుంది.
(2 / 5)
2. పెరిగిన మొబైల్ డేటా వినియోగం: మీరు ఇంటర్నెట్ ను ఎప్పటిలాగానే వినియోగిస్తున్నప్పటికీ.. మీ మొబైల్ డేటా వినియోగం అకస్మాత్తుగా భారీగా పెరిగితే, మీ ఐ ఫోన్ హ్యాక్ అయి ఉండవచ్చనడానికి సంకేతం. ఏదైనా అసాధారణ డేటా వినియోగాన్ని గుర్తించడానికి మీరు మీ ఐఫోన్లోని వివిధ యాప్స్ వినియోగించే డేటాను చెక్ చేయవచ్చు. హ్యాకర్లు ఏదైనా రహస్య సర్వీస్ ను మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేస్తే, మీ డేటా వినియోగం పెరుగుతుంది.(Unsplash)
3. తెలియని యాప్స్: మీరు ఇన్స్టాల్ చేయని ఏదైనా యాప్ ను మీ ఐఫోన్లో మీరు చూసినట్లయితే, అది మీ ఐఫోన్ స్పైవేర్ బారిన పడిందని సంకేతం కావచ్చు. బ్లోట్ వేర్ తో పాటు, కొన్ని యాప్స్ సాధారణ పేర్లతోనే ఉంటాయి. కానీ రహస్య ఆపరేషన్లలో పాలు పంచుకుంటూ ఉంటాయి. అవి యాప్ డ్రాయర్ లో కూడా కనిపించవు. అలాంటి యాప్స్ ను వెంటనే అన్ ఇన్ స్టాల్ చేయండి.
(3 / 5)
3. తెలియని యాప్స్: మీరు ఇన్స్టాల్ చేయని ఏదైనా యాప్ ను మీ ఐఫోన్లో మీరు చూసినట్లయితే, అది మీ ఐఫోన్ స్పైవేర్ బారిన పడిందని సంకేతం కావచ్చు. బ్లోట్ వేర్ తో పాటు, కొన్ని యాప్స్ సాధారణ పేర్లతోనే ఉంటాయి. కానీ రహస్య ఆపరేషన్లలో పాలు పంచుకుంటూ ఉంటాయి. అవి యాప్ డ్రాయర్ లో కూడా కనిపించవు. అలాంటి యాప్స్ ను వెంటనే అన్ ఇన్ స్టాల్ చేయండి.(Unsplash)
4. ఐఫోన్ స్లో డౌన్: మీ ఐఫోన్ పనితీరు ఇటీవల దెబ్బతిన్నట్లయితే, మీరు వెబ్ పేజీలను సరిగ్గా లోడ్ చేయలేకపోతే, తరచుగా మీ ఐ ఫోన్ ను రీస్టార్ట్ చేయాల్సి వస్తోందంటే.. మీ ఫోన్ లో స్పై వేర్ ఉండే అవకాశం ఉందని అర్థం.
(4 / 5)
4. ఐఫోన్ స్లో డౌన్: మీ ఐఫోన్ పనితీరు ఇటీవల దెబ్బతిన్నట్లయితే, మీరు వెబ్ పేజీలను సరిగ్గా లోడ్ చేయలేకపోతే, తరచుగా మీ ఐ ఫోన్ ను రీస్టార్ట్ చేయాల్సి వస్తోందంటే.. మీ ఫోన్ లో స్పై వేర్ ఉండే అవకాశం ఉందని అర్థం.(Unsplash)
5. యాప్స్ తో సమస్య: ఫేస్ బుక్, వాట్సాప్ లేదా ఇన్స్టాగ్రామ్ వంటి మీరు క్రమం తప్పకుండా ఉపయోగించే యాప్స్ అకస్మాత్తుగా పనిచేయకుండా పోవడం, లేదా సడన్ గా కనిపించకుండా పోవడం జరిగితే, మీ ఐఫోన్ లో హానికరమైన సాఫ్ట్ వేర్ ఉండి ఉండవచ్చు. దానివల్ల మీ ఐ ఫోన్ మెమొరీ అయిపోయి ఉండవచ్చు.
(5 / 5)
5. యాప్స్ తో సమస్య: ఫేస్ బుక్, వాట్సాప్ లేదా ఇన్స్టాగ్రామ్ వంటి మీరు క్రమం తప్పకుండా ఉపయోగించే యాప్స్ అకస్మాత్తుగా పనిచేయకుండా పోవడం, లేదా సడన్ గా కనిపించకుండా పోవడం జరిగితే, మీ ఐఫోన్ లో హానికరమైన సాఫ్ట్ వేర్ ఉండి ఉండవచ్చు. దానివల్ల మీ ఐ ఫోన్ మెమొరీ అయిపోయి ఉండవచ్చు.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి