తెలుగు న్యూస్  /  ఫోటో  /  Iphone 15 Pro Max: ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ ధర ఎంతో తెలుసా?

iPhone 15 Pro Max: ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ ధర ఎంతో తెలుసా?

06 September 2023, 21:05 IST

ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్స్ కోసం ఎదురు చూపులు త్వరలో ముగియనున్నాయి. సెప్టెంబర్ 12న జరిగే యాపిల్ ఈవెంట్ లో ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్స్ లాంచ్ కానున్నాయి. వాటితో పాటు రెండు స్మార్ట్ వాచ్ లను కూడా యాపిల్ లాంచ్ చేయనుంది.

ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్స్ కోసం ఎదురు చూపులు త్వరలో ముగియనున్నాయి. సెప్టెంబర్ 12న జరిగే యాపిల్ ఈవెంట్ లో ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్స్ లాంచ్ కానున్నాయి. వాటితో పాటు రెండు స్మార్ట్ వాచ్ లను కూడా యాపిల్ లాంచ్ చేయనుంది.
సెప్టెంబర్ 12న జరిగే యాపిల్ ఈవెంట్ లో ఐ ఫోన్ 15, ఐ ఫోన్ 15 ప్లస్, ఐ ఫోన్ 15 ప్రొ, ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ స్మార్ట్ ఫోన్స్ ను యాపిల్ లాంచ్ చేయనుంది. వాటితో పాటు యాపిల్ వాచ్ 9, యాపిల్ వాచ్ అల్ట్రా 2 స్మార్ట్ వాచ్ లను కూడా లాంచ్ చేయనుంది.
(1 / 5)
సెప్టెంబర్ 12న జరిగే యాపిల్ ఈవెంట్ లో ఐ ఫోన్ 15, ఐ ఫోన్ 15 ప్లస్, ఐ ఫోన్ 15 ప్రొ, ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ స్మార్ట్ ఫోన్స్ ను యాపిల్ లాంచ్ చేయనుంది. వాటితో పాటు యాపిల్ వాచ్ 9, యాపిల్ వాచ్ అల్ట్రా 2 స్మార్ట్ వాచ్ లను కూడా లాంచ్ చేయనుంది.(Unsplash)
ఐ పోన్ 15 ప్రొ మాక్స్ టైటానియం ఫ్రేమ్ తో వస్తోంది. దాంతో ఫోన్ బరువు గణనీయంగా తగ్గనుంది. కొత్తగా ఈ ఫోన్ లో మ్యూట్ బటన్ స్థానంలో యాక్షన్ బటన్ ఉండబోతోంది. అలాగే, డైనమిక్ ఐలండ్ డిజైన్ ఉంటుంది. అలాగే, 6.7 ఇంచ్ ల డిస్ ప్లే ఉండబోతోంది. 
(2 / 5)
ఐ పోన్ 15 ప్రొ మాక్స్ టైటానియం ఫ్రేమ్ తో వస్తోంది. దాంతో ఫోన్ బరువు గణనీయంగా తగ్గనుంది. కొత్తగా ఈ ఫోన్ లో మ్యూట్ బటన్ స్థానంలో యాక్షన్ బటన్ ఉండబోతోంది. అలాగే, డైనమిక్ ఐలండ్ డిజైన్ ఉంటుంది. అలాగే, 6.7 ఇంచ్ ల డిస్ ప్లే ఉండబోతోంది. (Unsplash)
అన్ని ఐ ఫోన్ 15 మోడల్స్ లో 48 ఎంపీ ప్రైమరీ కెమెరా ఉండబోతోంది. ఐ ఫోన్ ప్రొ మాక్స్ లో అదనంగా 10 ఎక్స్ జూమ్ తో పెరిస్కోప్ కెమెరా ఉంటుంది.
(3 / 5)
అన్ని ఐ ఫోన్ 15 మోడల్స్ లో 48 ఎంపీ ప్రైమరీ కెమెరా ఉండబోతోంది. ఐ ఫోన్ ప్రొ మాక్స్ లో అదనంగా 10 ఎక్స్ జూమ్ తో పెరిస్కోప్ కెమెరా ఉంటుంది.(Unsplash)
ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ లో 3 నానోమీటర్ నోడ్ తో ఏ 17 బయోనిక్ చిప్ సెట్ ను అమర్చనున్నారు. దీనివల్ల 15% వరకు పర్ఫార్మెన్స్ మెరుగుపడనుంది. ఐ ఫోన్ ప్రొ మోడల్స్ లో8 జీబీ ర్యామ్ ఉంటుంది. 
(4 / 5)
ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ లో 3 నానోమీటర్ నోడ్ తో ఏ 17 బయోనిక్ చిప్ సెట్ ను అమర్చనున్నారు. దీనివల్ల 15% వరకు పర్ఫార్మెన్స్ మెరుగుపడనుంది. ఐ ఫోన్ ప్రొ మోడల్స్ లో8 జీబీ ర్యామ్ ఉంటుంది. (Unsplash)
 ఐ ఫోన్ 14 ప్రొ మాక్స్ తో పోలిస్తే, ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ ధర 100 డాలర్ల నుంచి 200 డాలర్ల వరకు అదనంగా ఉండనుందని సమాచారం. డిజైన్, ధర, స్పెసిఫికేషన్స్ కు సంబంధించిన పూర్తి సమాచారం సెప్టెంబర్ 12న జరిగే యాపిల్ ఈవెంట్ లోనే తెలుస్తుంది.
(5 / 5)
 ఐ ఫోన్ 14 ప్రొ మాక్స్ తో పోలిస్తే, ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ ధర 100 డాలర్ల నుంచి 200 డాలర్ల వరకు అదనంగా ఉండనుందని సమాచారం. డిజైన్, ధర, స్పెసిఫికేషన్స్ కు సంబంధించిన పూర్తి సమాచారం సెప్టెంబర్ 12న జరిగే యాపిల్ ఈవెంట్ లోనే తెలుస్తుంది.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి