తెలుగు న్యూస్  /  ఫోటో  /  Medaram Forest : మేడారం అడవుల్లో రాకాసి గుహలు.. వాటి గురించి ఆసక్తికర విషయాలు

Medaram Forest : మేడారం అడవుల్లో రాకాసి గుహలు.. వాటి గురించి ఆసక్తికర విషయాలు

13 September 2024, 9:26 IST

Medaram Forest : అందమైన మేడారం అడవుల్లో అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఆ అంతుచిక్కని రహస్యాల్లో ముఖ్యమైనవి రాకాసి గుహలు. అవును.. మేడారం సమీపంలోని తాడ్వాయి అడవుల్లో రాకాసి గుహలు ఉన్నాయి. వాటిని చూసేందుకు ఇటీవల పర్యాటకులు క్యూ కడుతున్నారు. ఆ గుహలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

  • Medaram Forest : అందమైన మేడారం అడవుల్లో అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఆ అంతుచిక్కని రహస్యాల్లో ముఖ్యమైనవి రాకాసి గుహలు. అవును.. మేడారం సమీపంలోని తాడ్వాయి అడవుల్లో రాకాసి గుహలు ఉన్నాయి. వాటిని చూసేందుకు ఇటీవల పర్యాటకులు క్యూ కడుతున్నారు. ఆ గుహలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం దామెరవాయి గ్రామ సమీపంలో సూర గుండయ్య గుట్ట ఉంది. ఆ గుట్టపై దాదాపు 150 వరకు పెద్ద పెద్ద రాళ్లతో నిర్మాణాలు ఉన్నాయి. అక్కడి ప్రజలు వీటిని రాక్షస గుహలు, రాకాసి గుహలుగా పిలుస్తుంటారు. రాక్షసుల శవాలను వీటిలో పాతి పెట్టారని.. చనిపోయిన ఆ రాక్షసులు ఎప్పటికీ మళ్లీ బతికి బయటకు రాకుండా ఇలా కట్టారని అక్కడి ప్రజలు చెబుతున్నారు. 
(1 / 5)

ఈ గుహలపై పురావస్తు శాఖ అధికారులు గతంలో ఇక్కడ పరిశోధనలు జరిపారు. ఇవి రాక్షస గుహలు కాదని.. ఆదిమానవులకు చెందిన సమాధులు అని శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు. అయితే.. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో ఇలాంటి నిర్మాణాలు ఎలా చేశారని పర్యాటకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 
(2 / 5)

గుట్టపై ఉన్న గుహల నిర్మాణంలో అత్యంత నైపుణ్యం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. నాలుగు మీటర్ల పొడవు మూడు మీటర్ల వెడల్పు విస్తీర్ణంలో ఇసుక రాళ్లతో వీటిని నిర్మించారు. చుట్టూ నాలుగు పెద్ద బండరాళ్లను పెట్టి వాటికి పై కప్పుగా మరో పెద్ద బండరాయిని పెట్టారు. ప్రతి గుహలోనూ నీటి తొట్టి ఆకారంలో ఉన్న శవపేటికను నిర్మించారు. ఈ నిర్మాణాల్లో వాడిన రాళ్ల బరువు సుమారు 10 నుంచి 20 టన్నుల ఉంటుందని అంచనా వేశారు. 
(3 / 5)

డాక్టర్ విలియం కింగ్ ములహరాన్ అనే జియాలజిస్టు 1877వ సంవత్సరంలో ఈ నిర్మాణాలను పరిశీలించారని చరిత్ర చెబుతోంది. నిజాం కాలంలోనూ ఖాజా హమ్మద్ అనే వ్యక్తి పరిశోధనలు చేశారని చెబుతున్నారు. అయితే.. పరిశోధనలు చేసిన ప్రతీఒక్కరూ.. ఇవి ఆదిమానవుల సమాధులు అని నిర్ధారణకు రావడం గమనార్హం.
(4 / 5)

ఈ ప్రాంతం ములుగు జిల్లా కేంద్రం నుంచి 56 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడికి చేరుకోవాలంటే హనుమకొండ నుంచి ములుగు చేరుకొని.. అక్కడి నుంచి ప్రైవేట్ వాహనాల్లో వెళ్లాలి. పర్యాటక శాఖ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే.. భవిష్యత్ తరాలకు చరిత్రను అందించే అవకాశం ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి