తెలుగు న్యూస్  /  ఫోటో  /  Infertility: మీ సంతానోత్పత్తిని పెంచే ఆహారాలు ఇవి, రోజూ తినండి

Infertility: మీ సంతానోత్పత్తిని పెంచే ఆహారాలు ఇవి, రోజూ తినండి

19 January 2024, 18:24 IST

గ్లైసెమిక్ ఇండెక్స్‌లో తక్కువగా ఉండే ఆహారాలను తినడం వల్ల సంతానోత్పత్తి అవకాశాలు పెరుగుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను ఈ ఆహారాలు తగ్గిస్తాయి.

గ్లైసెమిక్ ఇండెక్స్‌లో తక్కువగా ఉండే ఆహారాలను తినడం వల్ల సంతానోత్పత్తి అవకాశాలు పెరుగుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను ఈ ఆహారాలు తగ్గిస్తాయి.
రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల  సంతానోత్పత్తి కష్టమైపోతుంది. గ్లైసెమిక్ ఇండెక్స్‌ తక్కువగా ఉన్న ఎంపిక చేసుకుని తినాలి. ఎవరైతే పిల్లలను కనేందుకు సిద్ధపడుతున్నారో వారు కచ్చితంగా తినాల్సిన ఆహారాలు కొన్ని ఉన్నాయి. 
(1 / 11)
రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల  సంతానోత్పత్తి కష్టమైపోతుంది. గ్లైసెమిక్ ఇండెక్స్‌ తక్కువగా ఉన్న ఎంపిక చేసుకుని తినాలి. ఎవరైతే పిల్లలను కనేందుకు సిద్ధపడుతున్నారో వారు కచ్చితంగా తినాల్సిన ఆహారాలు కొన్ని ఉన్నాయి. (Unsplash)
బెర్రీ జాతి పండ్లలో  యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.  స్తీలు వీటిని తింటే వారి గర్భాశయంలోని అండాలు గుడ్లు దెబ్బతినకుండా ఉంటాయి. అలాగే లైంగికాసక్తిని పెంచుతాయి. 
(2 / 11)
బెర్రీ జాతి పండ్లలో  యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.  స్తీలు వీటిని తింటే వారి గర్భాశయంలోని అండాలు గుడ్లు దెబ్బతినకుండా ఉంటాయి. అలాగే లైంగికాసక్తిని పెంచుతాయి. (Unsplash)
బచ్చలికూర, పాలకూర, కరివేపాకు, మెంతాకు,  బ్రోకలీ వంటి ఆకు కూరల్లో అండోత్సర్గానికి సహాయపడే ఫోలేట్ ఉంటుంది. 
(3 / 11)
బచ్చలికూర, పాలకూర, కరివేపాకు, మెంతాకు,  బ్రోకలీ వంటి ఆకు కూరల్లో అండోత్సర్గానికి సహాయపడే ఫోలేట్ ఉంటుంది. (Pixabay)
బీన్స్‌లోని లీన్ ప్రొటీన్, ఐరన్‌తో పాటు సంతానోత్పత్తిని పెంచే లక్షణాలు ఉంటాయి. ఇనుము లోపం ఉంటే అండోత్సర్గము సమయంలో ఆరోగ్యకరమైన అండాలు ఉత్పత్తి కావు. అందుకే బీన్స్ ను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి.  వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. 
(4 / 11)
బీన్స్‌లోని లీన్ ప్రొటీన్, ఐరన్‌తో పాటు సంతానోత్పత్తిని పెంచే లక్షణాలు ఉంటాయి. ఇనుము లోపం ఉంటే అండోత్సర్గము సమయంలో ఆరోగ్యకరమైన అండాలు ఉత్పత్తి కావు. అందుకే బీన్స్ ను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి.  వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. (Unsplash)
పురాతన గ్రీకులు అంజీర్ పండ్లను లైంగిక శక్తిని పెంచేందుకు ఉపయోగించుకునేవారు. అంజీర్ పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.  ఇది అండాల ఆరోగ్యాన్ని కాపాడటమే కాదు, అండోత్సర్గానికి మేలు చేస్తుంది.
(5 / 11)
పురాతన గ్రీకులు అంజీర్ పండ్లను లైంగిక శక్తిని పెంచేందుకు ఉపయోగించుకునేవారు. అంజీర్ పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.  ఇది అండాల ఆరోగ్యాన్ని కాపాడటమే కాదు, అండోత్సర్గానికి మేలు చేస్తుంది.(Shutterstock)
గర్భం ధరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ప్రతిరోజూ తాజా పండ్లు, కూరగాయలను  తినడం చాలా ముఖ్యం.
(6 / 11)
గర్భం ధరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ప్రతిరోజూ తాజా పండ్లు, కూరగాయలను  తినడం చాలా ముఖ్యం.(Shutterstock)
ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనేది పోషకాలు అధికంగా ఉండే పాలు. ఇది సంతానోత్పత్తికి తోడ్పడుతుంది.  కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్ వంటి ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటుంది. ఇది హార్మోన్ పనితీరును మెరుగపరచడంతో పాటూ, నెలసరి సమయానికి వచ్చేలా చేస్తుంది. 
(7 / 11)
ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనేది పోషకాలు అధికంగా ఉండే పాలు. ఇది సంతానోత్పత్తికి తోడ్పడుతుంది.  కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్ వంటి ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటుంది. ఇది హార్మోన్ పనితీరును మెరుగపరచడంతో పాటూ, నెలసరి సమయానికి వచ్చేలా చేస్తుంది. (Shutterstock)
పాలకూరను ప్రతి ఒక్కరూ తినాలి. ఇది అన్ని సీజన్లలో లభిస్తుంది.  డైటరీ ఫైబర్, విటమిన్లు, ఫోలిక్ యాసిడ్, క్లోరోఫిల్, మాంగనీస్, కాల్షియం, పొటాషియం, జింక్, ఫాస్పరస్, ప్రొటీన్, కెరోటిన్ వంటి పోషకాలన్నీ ఇందులో ఉంటాయి. పాలకూర గ్లైసెమిక్ ఇండెక్స్  దాదాపు సున్నా. కాబట్టి మధుమేహం ఉన్నవారు తమ రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచుకోవడం దీన్ని తినాలి. 
(8 / 11)
పాలకూరను ప్రతి ఒక్కరూ తినాలి. ఇది అన్ని సీజన్లలో లభిస్తుంది.  డైటరీ ఫైబర్, విటమిన్లు, ఫోలిక్ యాసిడ్, క్లోరోఫిల్, మాంగనీస్, కాల్షియం, పొటాషియం, జింక్, ఫాస్పరస్, ప్రొటీన్, కెరోటిన్ వంటి పోషకాలన్నీ ఇందులో ఉంటాయి. పాలకూర గ్లైసెమిక్ ఇండెక్స్  దాదాపు సున్నా. కాబట్టి మధుమేహం ఉన్నవారు తమ రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచుకోవడం దీన్ని తినాలి. (Freepik)
ఇవి క్రూసిఫరస్ కూరగాయల జాతికి చెందిన ఆహారాలను ప్రతిరోజూ తింటే మంచిది. కాలే, బ్రస్సెల్స్, బ్రోకలీ, మొలకలు, క్యాబేజీ, టర్నిప్‌లు మొదలైన వాటిని తినడం వల్ల పోషకాలు అధికంగా అంది, తక్కువ కేలరీలు శరీరంలో చేరుతాయి.
(9 / 11)
ఇవి క్రూసిఫరస్ కూరగాయల జాతికి చెందిన ఆహారాలను ప్రతిరోజూ తింటే మంచిది. కాలే, బ్రస్సెల్స్, బ్రోకలీ, మొలకలు, క్యాబేజీ, టర్నిప్‌లు మొదలైన వాటిని తినడం వల్ల పోషకాలు అధికంగా అంది, తక్కువ కేలరీలు శరీరంలో చేరుతాయి.(Shutterstock)
చిలగడదుంపలు... బంగాళాదుంప కుటుంబానికి చెందినవి. అయినా వీటి గ్లైసెమిక్ సూచిక 44. కాబట్టి దీన్ని అందరూ తినవచ్చు. పిల్లలను కనాలనుకుంటున్న వారు స్వీట్ పొటాటోను తినడం వల్ల ఉపయోగం ఉంటుంది.
(10 / 11)
చిలగడదుంపలు... బంగాళాదుంప కుటుంబానికి చెందినవి. అయినా వీటి గ్లైసెమిక్ సూచిక 44. కాబట్టి దీన్ని అందరూ తినవచ్చు. పిల్లలను కనాలనుకుంటున్న వారు స్వీట్ పొటాటోను తినడం వల్ల ఉపయోగం ఉంటుంది.(Unsplash)
ఆపిల్ పండ్లు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటాయి. అవి రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెరగనివ్వవు. వాటిలో అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. వీటిని తినడం వల్ల పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
(11 / 11)
ఆపిల్ పండ్లు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటాయి. అవి రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెరగనివ్వవు. వాటిలో అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. వీటిని తినడం వల్ల పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.(File Photo)

    ఆర్టికల్ షేర్ చేయండి