తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tg Indiramma Housing Survey : 'ఇందిరమ్మ' ఇంటి సర్వేలో 35 ప్రశ్నలు - అంతా యాప్ లోనే..!

TG Indiramma Housing Survey : 'ఇందిరమ్మ' ఇంటి సర్వేలో 35 ప్రశ్నలు - అంతా యాప్ లోనే..!

13 December 2024, 21:11 IST

TG Indiramma Housing Scheme App : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అమలు కోసం 'యాప్' అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారి వద్దకు వెళ్లి వివరాలను సేకరిస్తున్నారు. ప్రతి అంశాన్ని యాప్ లో నమోదు చేస్తున్నారు. అన్ని కోణాల్లో పరిశీలించి… లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. 

  • TG Indiramma Housing Scheme App : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అమలు కోసం 'యాప్' అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారి వద్దకు వెళ్లి వివరాలను సేకరిస్తున్నారు. ప్రతి అంశాన్ని యాప్ లో నమోదు చేస్తున్నారు. అన్ని కోణాల్లో పరిశీలించి… లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. 
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవలే ప్రత్యేక మొబైల్ యాప్ ను తీసుకొచ్చింది. అన్ని జిల్లాల్లోనూ యాప్ ద్వారా అధికారులు వివరాలను సేకరిస్తున్నారు. 
(1 / 6)

ప్రజాపాలనలో పెట్టుకున్న దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. ప్రతి దరఖాస్తును క్లుప్తంగా పరిశీలించి… వివరాలను సేకరిస్తున్నారు. యాప్ లో నమోదు చేసే వివరాల ఆధారంగా… దరఖాస్తుదారుడు అర్హులా? కాదా? అనేది వెల్లడవుతుంది.
(2 / 6)

గతంలో ఏదైనా గృహ పథకంలో లబ్ది పొందారా?, ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి స్వరూపం ఎలా ఉంది వంటి వివరాలను యాప్ లో సేకరిస్తున్నారు. ఇళ్లు నిర్మించుకోవడానికి భూమి అందుబాటులో ఉందా? లేదా?, స్థలం లబ్దిదారుడి పేరు మీద ఉందా? కుటుంబ సభ్యుల పేరు మీద ఉందా?, ఇంట్లో వివాహిత జంటల సంఖ్య, ప్రస్తుత గ్రామం/పట్టణంలో ఎన్నేళ్లుగా నివసిస్తున్నారు వంటి వాటిపై ఆరా తీస్తున్నారు. 
(3 / 6)

లబ్దిదారులు వికలాంగులు/అనాథలు/ ఒంటరి మహిళలు/వితంతువులు/ ట్రాన్సో జెండర్లు, పారిశుద్ధ్య కార్మికులు ఉంటే ఇందిరమ్మ ఇళ్లలో ప్రాధాన్యం ఉంటుందని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిని కూడా యాప్ ద్వారానే గుర్తిస్తారు, అన్ని కలిపి 30 - 35 ప్రశ్నలు ఉంటాయి. దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి అధికారులు ఆయా వివరాలను యాప్లో నమోదు చేస్తున్నారు. 
(4 / 6)

మొదటి విడతలో సొంత స్థలం ఉన్న నిరు పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనుంది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 
(5 / 6)

తొలి సంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లను కేటాయిస్తారు. మొత్తంగా 4.5 లక్షల ఇండ్లకు ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున నిధులను విడుదల చేస్తారు. ఈ నిధులను ధపాలు వారీగా ఇస్తారు.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి