తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ind Vs Sa 1st T20 Match Highlights: బౌండరీతో మొదలెట్టిన దక్షిణాఫ్రికా.. గొడవతో ముగించిన భారత్, మ్యాచ్ స్కోర్, హైలైట్స్

IND vs SA 1st T20 Match Highlights: బౌండరీతో మొదలెట్టిన దక్షిణాఫ్రికా.. గొడవతో ముగించిన భారత్, మ్యాచ్ స్కోర్, హైలైట్స్

09 November 2024, 11:36 IST

IND vs SA T20 Highlights: దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా బోణి అదిరిపోయింది. తొలి టీ20లో భారీ స్కోరు చేసిన భారత్ జట్టు.. అనంతరం బౌలింగ్‌లోనూ అదరగొట్టేసింది. మ్యాచ్‌లో సంజు శాంసన్ సెంచరీ, హార్దిక్ పాండ్య క్యాచ్‌‌ మిస్, క్షమాపణ, గొడవలు, రివేంజ్‌లతో తొలి టీ20 ఆసక్తిగా జరిగింది. 

IND vs SA T20 Highlights: దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా బోణి అదిరిపోయింది. తొలి టీ20లో భారీ స్కోరు చేసిన భారత్ జట్టు.. అనంతరం బౌలింగ్‌లోనూ అదరగొట్టేసింది. మ్యాచ్‌లో సంజు శాంసన్ సెంచరీ, హార్దిక్ పాండ్య క్యాచ్‌‌ మిస్, క్షమాపణ, గొడవలు, రివేంజ్‌లతో తొలి టీ20 ఆసక్తిగా జరిగింది. 
డర్బన్ వేదికగా శుక్రవారం అర్ధరాత్రి ముగిసిన తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 8 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా టీమ్ 17.5 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది.
(1 / 11)
డర్బన్ వేదికగా శుక్రవారం అర్ధరాత్రి ముగిసిన తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 8 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా టీమ్ 17.5 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది.(AFP)
మ్యాచ్‌లో 50 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్లు బాదిన సంజు శాంసన్ 107 పరుగులు చేశాడు. 9 ఏళ్ల సంజు శాంసన్ అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో ఇది రెండో శతకంకాగా.. నెల రోజుల వ్యవధిలోనే ఈ రెండూ నమోదు చేయడం గమనార్హం.
(2 / 11)
మ్యాచ్‌లో 50 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్లు బాదిన సంజు శాంసన్ 107 పరుగులు చేశాడు. 9 ఏళ్ల సంజు శాంసన్ అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో ఇది రెండో శతకంకాగా.. నెల రోజుల వ్యవధిలోనే ఈ రెండూ నమోదు చేయడం గమనార్హం.(AFP)
202 పరుగుల ఛేదనని దక్షిణాఫ్రికా చాలా దూకుడుగా ప్రారంభించింది. ఆ జట్టు కెప్టెన్ ఆడెన్ మార్‌క్రమ్ ఫస్ట్ రెండు బంతుల్నీ వరుసగా 4, 4గా తరలించాడు. కానీ.. మూడో బంతికే అతడ్ని  అర్షదీప్ సింగ్ ఔట్ చేసి రివేంజ్ తీర్చుకున్నాడు. 
(3 / 11)
202 పరుగుల ఛేదనని దక్షిణాఫ్రికా చాలా దూకుడుగా ప్రారంభించింది. ఆ జట్టు కెప్టెన్ ఆడెన్ మార్‌క్రమ్ ఫస్ట్ రెండు బంతుల్నీ వరుసగా 4, 4గా తరలించాడు. కానీ.. మూడో బంతికే అతడ్ని  అర్షదీప్ సింగ్ ఔట్ చేసి రివేంజ్ తీర్చుకున్నాడు. (REUTERS)
ఒకే ఓవర్‌లో డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్ వికెట్లు పడగొట్టిన భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి.. మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. ఈ ఇద్దరూ దాదాపు 6 ఓవర్లు వికెట్ ఇవ్వకుండా భారీ షాట్లు ఆడుతూ కనిపించారు. 
(4 / 11)
ఒకే ఓవర్‌లో డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్ వికెట్లు పడగొట్టిన భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి.. మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. ఈ ఇద్దరూ దాదాపు 6 ఓవర్లు వికెట్ ఇవ్వకుండా భారీ షాట్లు ఆడుతూ కనిపించారు. (REUTERS)
మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టీమ్ ఓడినప్పటికీ.. ఆ జట్టులోని ఏడుగురు బ్యాటర్లు కనీసం ఒక సిక్స్ కొట్టడం గమనార్హం. భారత్ బౌలర్లపై మొదటి ఓవర్ నుంచి ఆ జట్టు ఎదురుదాడి చేస్తూ వచ్చింది. వికెట్లు పడుతున్నా వెనక్కి తగ్గలేదు. 
(5 / 11)
మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టీమ్ ఓడినప్పటికీ.. ఆ జట్టులోని ఏడుగురు బ్యాటర్లు కనీసం ఒక సిక్స్ కొట్టడం గమనార్హం. భారత్ బౌలర్లపై మొదటి ఓవర్ నుంచి ఆ జట్టు ఎదురుదాడి చేస్తూ వచ్చింది. వికెట్లు పడుతున్నా వెనక్కి తగ్గలేదు. (REUTERS)
మ్యాచ్‌లో మార్కో జాన్సెన్ క్యాచ్‌ని నేలపాలు చేసిన హార్దిక్ పాండ్యా.. బౌలర్ రవి బిష్ణోయ్‌కి క్షమాపణలు చెప్పాడు. ఆ తర్వాత బంతికే మళ్లీ క్యాచ్‌రాగా.. వెనక్కి పరుగెత్తుకుంటూ వెళ్లి జాన్సన్ క్యాచ్‌ను హార్దిక్ పట్టాడు. 
(6 / 11)
మ్యాచ్‌లో మార్కో జాన్సెన్ క్యాచ్‌ని నేలపాలు చేసిన హార్దిక్ పాండ్యా.. బౌలర్ రవి బిష్ణోయ్‌కి క్షమాపణలు చెప్పాడు. ఆ తర్వాత బంతికే మళ్లీ క్యాచ్‌రాగా.. వెనక్కి పరుగెత్తుకుంటూ వెళ్లి జాన్సన్ క్యాచ్‌ను హార్దిక్ పట్టాడు. (AP)
మ్యాచ్‌లో రనౌట్ కోసం బంతిని అందుకునే క్రమంలో పిచ్ డేంజర్ జోన్‌లో అడుగుపెట్టాడని వికెట్ కీపర్ సంజు శాంసన్‌తో దక్షిణాఫ్రికా క్రికెటర్ మార్కో జాన్సెన్ గొడవ పడ్డాడు. దాంతో విషయం తెలుసుకున్న సూర్య.. జాన్సన్ దగ్గరికి వెళ్లి వార్నింగ్ ఇచ్చాడు. 
(7 / 11)
మ్యాచ్‌లో రనౌట్ కోసం బంతిని అందుకునే క్రమంలో పిచ్ డేంజర్ జోన్‌లో అడుగుపెట్టాడని వికెట్ కీపర్ సంజు శాంసన్‌తో దక్షిణాఫ్రికా క్రికెటర్ మార్కో జాన్సెన్ గొడవ పడ్డాడు. దాంతో విషయం తెలుసుకున్న సూర్య.. జాన్సన్ దగ్గరికి వెళ్లి వార్నింగ్ ఇచ్చాడు. (AFP)
దక్షిణాఫ్రికా టీమ్‌తో సూర్యకుమార్ యాదవ్ గొడవ ఈరోజుది కాదు. టీ20 వరల్డ్‌కప్-2024 ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ బౌండరీ లైన్ వద్ద పట్టిన అద్భుతమైన క్యాచ్‌తో దక్షిణాఫ్రికా జట్టుకి కప్ దూరమైంది. ఆ క్యాచ్‌పై అప్పట్లో పెద్ద ఎత్తున వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. 
(8 / 11)
దక్షిణాఫ్రికా టీమ్‌తో సూర్యకుమార్ యాదవ్ గొడవ ఈరోజుది కాదు. టీ20 వరల్డ్‌కప్-2024 ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ బౌండరీ లైన్ వద్ద పట్టిన అద్భుతమైన క్యాచ్‌తో దక్షిణాఫ్రికా జట్టుకి కప్ దూరమైంది. ఆ క్యాచ్‌పై అప్పట్లో పెద్ద ఎత్తున వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. 
మ్యాచ్‌లో మార్కో జాన్సెన్‌తో గొడవపడిన సూర్యకుమార్ యాదవ్‌పై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే.. ఫీల్డ్ అంపైర్లు ఇప్పటి వరకు ఈ గొడవ గురించి ఫిర్యాదు చేశారా? లేదా? అనేది క్లారిటీ రాలేదు. ఒకవేళ ఫిర్యాదు చేస్తే సూర్యకి జరిమానా లేదా మందలింపు రావొచ్చు.
(9 / 11)
మ్యాచ్‌లో మార్కో జాన్సెన్‌తో గొడవపడిన సూర్యకుమార్ యాదవ్‌పై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే.. ఫీల్డ్ అంపైర్లు ఇప్పటి వరకు ఈ గొడవ గురించి ఫిర్యాదు చేశారా? లేదా? అనేది క్లారిటీ రాలేదు. ఒకవేళ ఫిర్యాదు చేస్తే సూర్యకి జరిమానా లేదా మందలింపు రావొచ్చు.(AP)
భారత్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో సంజు శాంసన్ అరుదైన ఘనత సాధించాడు. 17 ఏళ్ల భారత టీ20 క్రికెట్ చరిత్రలో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు బాదిన తొలి క్రికెటర్‌గా సంజు శాంసన్ నిలిచాడు. 
(10 / 11)
భారత్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో సంజు శాంసన్ అరుదైన ఘనత సాధించాడు. 17 ఏళ్ల భారత టీ20 క్రికెట్ చరిత్రలో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు బాదిన తొలి క్రికెటర్‌గా సంజు శాంసన్ నిలిచాడు. (AP)
డర్బన్ టీ20 విజయంతో నాలుగు టీ20 సిరీస్‌లో భారత్ జట్టు 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో టీ20 మ్యాచ్ ఆదివారం రాత్రి 7.30 గంటలకి జరగనుంది. 
(11 / 11)
డర్బన్ టీ20 విజయంతో నాలుగు టీ20 సిరీస్‌లో భారత్ జట్టు 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో టీ20 మ్యాచ్ ఆదివారం రాత్రి 7.30 గంటలకి జరగనుంది. (REUTERS)

    ఆర్టికల్ షేర్ చేయండి