తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ind Vs Ban 2nd Test: భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్టుకు వర్షం ముప్పు ఉందా?

IND vs BAN 2nd Test: భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్టుకు వర్షం ముప్పు ఉందా?

24 September 2024, 22:28 IST

IND vs BAN 2nd Test: భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు సెప్టెంబర్ 27వ తేదీన మొదలుకానుంది. అయితే, ఈ మ్యాచ్‍పై వర్షం ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

  • IND vs BAN 2nd Test: భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు సెప్టెంబర్ 27వ తేదీన మొదలుకానుంది. అయితే, ఈ మ్యాచ్‍పై వర్షం ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
బంగ్లాదేశ్‍తో రెండు టెస్టుల సిరీస్‍ను క్వీన్‍స్వీప్ చేయాలనే కసితో భారత్ ఉంది. ఇప్పటికే తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య ఈ శుక్రవారం (సెప్టెంబర్ 27) రెండో టెస్టు షురూ కానుంది. 
(1 / 5)
బంగ్లాదేశ్‍తో రెండు టెస్టుల సిరీస్‍ను క్వీన్‍స్వీప్ చేయాలనే కసితో భారత్ ఉంది. ఇప్పటికే తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య ఈ శుక్రవారం (సెప్టెంబర్ 27) రెండో టెస్టు షురూ కానుంది. (AFP)
ఈ రెండో టెస్టు కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే భారత జట్టు అక్కడికి చేరుకుంది. అయితే, ఈ రెండో టెస్టుకు వాన ముప్పు కూడా పొంచి ఉంది. 
(2 / 5)
ఈ రెండో టెస్టు కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే భారత జట్టు అక్కడికి చేరుకుంది. అయితే, ఈ రెండో టెస్టుకు వాన ముప్పు కూడా పొంచి ఉంది. 
అక్యువెదర్ ప్రకారం, భారత్, బంగ్లా మధ్య రెండో టెస్టు తొలి రోజైన సెప్టెంబర్ 27న కాన్పూర్‌లో వర్షం పడే అవకాశాలు 92 శాతం ఉన్నాయి. దీంతో ఫస్ట్ డే వాన వల్ల అంతరాయాలు ఉండొచ్చు.
(3 / 5)
అక్యువెదర్ ప్రకారం, భారత్, బంగ్లా మధ్య రెండో టెస్టు తొలి రోజైన సెప్టెంబర్ 27న కాన్పూర్‌లో వర్షం పడే అవకాశాలు 92 శాతం ఉన్నాయి. దీంతో ఫస్ట్ డే వాన వల్ల అంతరాయాలు ఉండొచ్చు.
ఈ టెస్టు రెండో రోజైన సెప్టెంబర్ 28న కాన్పూర్ గ్రీన్‍పార్క్ స్టేడియం వద్ద వాన పడే అవకాశాలు 80 శాతం ఉన్నాయి. మూడో రోజుకు ఇది 59 శాతానికి తగ్గింది. ఈ మ్యాచ్ నాలుగు, ఐదు రోజుల్లో వాన పడే అవకాశాలు లేనట్టే. దీన్నిబట్టి, కాన్పూర్ టెస్టులో తొలి రెండు రోజులు వాన వల్ల ఆట ప్రభావితమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 
(4 / 5)

చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ 280 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్‍ను చిత్తు చేసింది. కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ 27 నుంచి జరిగే రెండో టెస్టులోనూ దుమ్మురేపి క్లీన్‍స్వీప్ చేసేందుకు రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ పట్టుదలగా ఉంది. 
(5 / 5)
చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ 280 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్‍ను చిత్తు చేసింది. కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ 27 నుంచి జరిగే రెండో టెస్టులోనూ దుమ్మురేపి క్లీన్‍స్వీప్ చేసేందుకు రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ పట్టుదలగా ఉంది. (PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి