తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ind Vs Aus In World Cup Knock Outs: వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లలో ఇండియా, ఆస్ట్రేలియా రికార్డులు ఇవీ

Ind vs Aus in World Cup Knock Outs: వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లలో ఇండియా, ఆస్ట్రేలియా రికార్డులు ఇవీ

19 November 2023, 9:17 IST

Ind vs Aus in World Cup Knock Outs: వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లలో గతంలోనూ ఇండియా, ఆస్ట్రేలియా తలపడ్డాయి. ఆదివారం (నవంబర్ 19) ఈ రెండు టీమ్స్ మధ్య మెగా ఫైనల్ జరగనున్న నేపథ్యంలో గతంలో నాకౌట్ మ్యాచ్ లలో ఈ రెండు టీమ్స్ లో ఎవరిది పైచేయి అన్నది ఇక్కడ చూడండి.

  • Ind vs Aus in World Cup Knock Outs: వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లలో గతంలోనూ ఇండియా, ఆస్ట్రేలియా తలపడ్డాయి. ఆదివారం (నవంబర్ 19) ఈ రెండు టీమ్స్ మధ్య మెగా ఫైనల్ జరగనున్న నేపథ్యంలో గతంలో నాకౌట్ మ్యాచ్ లలో ఈ రెండు టీమ్స్ లో ఎవరిది పైచేయి అన్నది ఇక్కడ చూడండి.
Ind vs Aus in World Cup Knock Outs: ఇప్పుడు జరగబోతున్న వరల్డ్ కప్ ఫైనల్ కంటే ముందు ఇండియా, ఆస్ట్రేలియా వరల్డ్ కప్ నాకౌట్ స్టేజ్ లో మూడుసార్లు తలపడ్డాయి. అందులో రెండుసార్లు ఆస్ట్రేలియా, ఒకసారి ఇండియా గెలిచాయి. చివరిసారి 2011లో ఆస్ట్రేలియాపై నాకౌట్ స్టేజ్ లో గెలిచిన మ్యాచ్ కు, ఈ ఫైనల్ కు పోలికలు ఉండటం ఇండియన్ ఫ్యాన్స్ ను ఆనందానికి గురి చేసేదే.
(1 / 5)

Ind vs Aus in World Cup Knock Outs: ఇండియా, ఆస్ట్రేలియా తొలిసారి వరల్డ్ కప్ నాకౌట్ లో తలపడింది 2003లోనే. అది కూడా ఆ వరల్డ్ కప్ ఫైనల్లో ఈ రెండు టీమ్స్ ఆడాయి. ఆ మ్యాచ్ లో ఇండియాను 125 పరుగుల తేడాతో చిత్తు చేసి ఆస్ట్రేలియా విశ్వవిజేతగా నిలిచింది. ఆ ఫైనల్లో రికీ పాంటింగ్ విధ్వంసకర సెంచరీతో ఆస్ట్రేలియా 359 రన్స్ చేసింది. తర్వాత చేజింగ్ లో ఇండియా 234 పరుగులకే ఆలౌటైంది.
(2 / 5)

Ind vs Aus in World Cup Knock Outs: 1999 వరల్డ్ కప్ లో మొదలైన ఆస్ట్రేలియా జైత్రయాత్రకు 2011 క్వార్టర్ ఫైనల్లో టీమిండియా బ్రేక్ వేసింది. ఆ మ్యాచ్ లో ఆస్ట్రేలియాను ఇండియా చిత్తు చేసింది. ఆ క్వార్టర్ ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 260 రన్స్ చేసింది. తర్వాత ఆ మెగా టోర్నీ హీరో యువరాజ్ సింగ్ 57 పరుగులు చేసి మ్యాచ్ ను గెలిపించాడు. అంతకుముందు బౌలింగ్ లోనూ రెండు వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.
(3 / 5)

Ind vs Aus in World Cup Knock Outs: 2011 క్వార్టర్ ఫైనల్లో ఇండియా విజయానికి 2015 సెమీఫైనల్లో ఆస్ట్రేలియా బదులు తీర్చుకుంది. సిడ్నీలో జరిగిన ఆ సెమీఫైనల్లో ఇండియాను 95 పరుగులతో చిత్తు చేసి ఫైనల్ చేరింది. ఆ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. స్టీవ్ స్మిత్ సెంచరీతో 328 రన్స్ చేసింది. తర్వాత ఇండియా కేవలం 233 రన్స్ మాత్రమే చేయగలిగింది.
(4 / 5)

Ind vs Aus in World Cup Knock Outs: ఇక ఇప్పుడు మరోసారి వరల్డ్ కప్ నాకౌట్ స్టేజ్ లో ఇండియా, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ఈసారి ఫైనల్లో ట్రోఫీ కోసం ఆడుతున్నాయి. 2003 తర్వాత వరల్డ్ కప్ ఫైనల్లో ఈ రెండు టీమ్స్ ఆడనుండటం ఇదే తొలిసారి. ఈ టోర్నీలో వరుసగా 10 విజయాలు సాధించి ఊపు మీదున్న టీమిండియా.. ఇదే ఆస్ట్రేలియాపైనే ఆ జైత్రయాత్రను ప్రారంభించింది. అక్టోబర్ 8న ఈ రెండు టీమ్స్ చెన్నైలో లీగ్ స్టేజ్ లో తలపడగా.. ఇండియా 6 వికెట్లతో గెలిచింది.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి