తెలుగు న్యూస్  /  ఫోటో  /  India Hockey Team: 52 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాను ఓడించిన ఇండియన్ హాకీ టీమ్.. పారిస్ ఒలింపిక్స్‌లో సంచలనం

India Hockey Team: 52 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాను ఓడించిన ఇండియన్ హాకీ టీమ్.. పారిస్ ఒలింపిక్స్‌లో సంచలనం

02 August 2024, 19:55 IST

India Hockey Team: పారిస్ ఒలింపిక్స్ 2024 హాకీలో భారత్ ఆస్ట్రేలియాను ఓడించి పూల్ బిలో రెండో స్థానానికి ఎగబాకింది. 52 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ లో ఆస్ట్రేలియాను ఇండియా ఓడించడం విశేషం.

  • India Hockey Team: పారిస్ ఒలింపిక్స్ 2024 హాకీలో భారత్ ఆస్ట్రేలియాను ఓడించి పూల్ బిలో రెండో స్థానానికి ఎగబాకింది. 52 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ లో ఆస్ట్రేలియాను ఇండియా ఓడించడం విశేషం.
India Hockey Team: పారిస్ ఒలింపిక్స్ లో ఇండియన్ హాకీ టీమ్ సంచలనం సృష్టించింది. తమ చివరి లీగ్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాను 3-2తో చిత్తు చేయడం విశేషం. 1972 ఒలింపిక్స్ తర్వాత 52 ఏళ్లకు ఒలింపిక్స్ లో ఆస్ట్రేలియాను ఇండియా ఓడించింది.
(1 / 8)

India Hockey Team: పూల్ -బిలో మొత్తం ఐదు మ్యాచ్ లు ఆడిన ఇండియా మూడు గెలిచి, ఒకటి ఓడి, ఒకటి డ్రా చేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ బెల్జియం చేతుల్లో పోరాడి ఓడింది. ఇప్పుడు క్వార్టర్ ఫైనల్ కు ముందు ఆస్ట్రేలియాపై విజయం ఇండియన్ టీమ్ ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే.
(2 / 8)

India Hockey Team: బెల్జియం చేతిలో ఓడిన భారత పురుషుల హాకీ జట్టు లీగ్ చివరి మ్యాచ్ లో విజయం సాధించింది. టీమిండియా 3-2 తేడాతో బలమైన ఆస్ట్రేలియాను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.
(3 / 8)

India Hockey Team: ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ తొలి క్వార్టర్లో భారత్ రెండు గోల్స్ చేసింది. 12వ నిమిషంలో అభిషేక్ ఫీల్డ్ గోల్ తో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఓ నిమిషం తర్వాత హర్మన్ప్రీత్ సింగ్ 13వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ చేశాడు. భారత్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది
(4 / 8)

India Hockey Team: రెండో క్వార్టర్లో ఆస్ట్రేలియా పుంజుకుంది. మ్యాచ్ 25వ నిమిషంలో థామస్ క్రెయిగ్ పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలిచాడు.
(5 / 8)

India Hockey Team: ఫస్ట్ హాఫ్ బ్రేక్ తర్వాత 32వ నిమిషంలో హర్మన్ ప్రీత్ సింగ్ పెనాల్టీ స్ట్రోక్ ద్వారా గోల్ చేసి భారత్ ఆధిక్యాన్ని 3-1కి పెంచాడు.
(6 / 8)

India Hockey Team: నాలుగో క్వార్టర్లో ఆస్ట్రేలియా గోల్ చేసి ఆధిక్యాన్ని 3-2కు తగ్గించింది. 55వ నిమిషంలో బ్లేక్ గోవర్స్ గోల్ చేశాడు. ఆ తర్వాత మ్యాచ్ లో మళ్లీ మరో గోల్ నమోదు కాలేదు. దీంతో ఇండియా 3-2తో విజయం సాధించింది.
(7 / 8)

India Hockey Team: ఈ విజయంతో పూల్ బిలో ఐదు మ్యాచ్ లలో మూడు విజయాలు, 10 పాయింట్లతో రెండో స్థానంలో క్వార్టర్స్ చేరింది. ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉండగా.. బెల్జియం తొలి స్థానంలో కొనసాగుతోంది.
(8 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి