తెలుగు న్యూస్  /  ఫోటో  /  Team India: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డు

Team India: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డు

10 July 2024, 22:36 IST

Team India: జింబాబ్వేతో మూడో టీ20లో భారత్ విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా ఓ చరిత్ర సృష్టించింది. ఓ ఘనత సాధించిన తొలి టీమ్‍గా రికార్డులకెక్కింది. ఆ వివరాలివే..

  • Team India: జింబాబ్వేతో మూడో టీ20లో భారత్ విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా ఓ చరిత్ర సృష్టించింది. ఓ ఘనత సాధించిన తొలి టీమ్‍గా రికార్డులకెక్కింది. ఆ వివరాలివే..
జింబాబ్వేతో నేడు (జూలై 10) హరారే వేదికగా జరిగిన మూడో టీ20లో టీమిండియా 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‍ల సిరీస్‍లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. భారత జట్టుకు ఇది 150వ అంతర్జాతీయ టీ20 విజయంగా ఉంది. 
(1 / 5)
జింబాబ్వేతో నేడు (జూలై 10) హరారే వేదికగా జరిగిన మూడో టీ20లో టీమిండియా 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‍ల సిరీస్‍లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. భారత జట్టుకు ఇది 150వ అంతర్జాతీయ టీ20 విజయంగా ఉంది. (AFP)
అంతర్జాతీయ టీ20ల్లో 150 మ్యాచ్‍లు గెలిచిన తొలి జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. ఈ ఘనత దక్కించుకున్న ఫస్ట్ టీమ్‍గా ఘనత దక్కించుకుంది. ఇప్పటి వరకు 230 అంతర్జాతీయ టీ20ల్లో 150 గెలిచింది భారత్.
(2 / 5)
అంతర్జాతీయ టీ20ల్లో 150 మ్యాచ్‍లు గెలిచిన తొలి జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. ఈ ఘనత దక్కించుకున్న ఫస్ట్ టీమ్‍గా ఘనత దక్కించుకుంది. ఇప్పటి వరకు 230 అంతర్జాతీయ టీ20ల్లో 150 గెలిచింది భారత్.(AP)
ఇప్పటి వరకు అత్యధిక అంతర్జాతీయ టీ20 మ్యాచ్‍లు గెలిచిన జట్ల జాబితాలో భారత్ (150) అగ్రస్థానంలో ఉంది. 142 గెలుపులతో పాకిస్థాన్ రెండో ప్లేస్‍లో ఉంది. న్యూజిలాండ్ (111), ఆస్ట్రేలియా (105), దక్షిణాఫ్రికా (104) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 
(3 / 5)
ఇప్పటి వరకు అత్యధిక అంతర్జాతీయ టీ20 మ్యాచ్‍లు గెలిచిన జట్ల జాబితాలో భారత్ (150) అగ్రస్థానంలో ఉంది. 142 గెలుపులతో పాకిస్థాన్ రెండో ప్లేస్‍లో ఉంది. న్యూజిలాండ్ (111), ఆస్ట్రేలియా (105), దక్షిణాఫ్రికా (104) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. (AP)
జింబాబ్వేతో మూడో టీ20లో భారత యంగ్ కెప్టెన్ శుభ్‍మన్ గిల్ (66) అర్ధ శకతంతో రెచ్చిపోగా.. రుతురాజ్ గైక్వాడ్ (49) రాణించాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు చేసింది. 
(4 / 5)
జింబాబ్వేతో మూడో టీ20లో భారత యంగ్ కెప్టెన్ శుభ్‍మన్ గిల్ (66) అర్ధ శకతంతో రెచ్చిపోగా.. రుతురాజ్ గైక్వాడ్ (49) రాణించాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు చేసింది. (AFP)
లక్ష్యఛేదనలో జింబాబ్వే 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 159 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ గెలిచింది. టీమిండియా స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లతో రాణించాడు. ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 జూలై 13న జరగనుంది. 
(5 / 5)
లక్ష్యఛేదనలో జింబాబ్వే 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 159 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ గెలిచింది. టీమిండియా స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లతో రాణించాడు. ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 జూలై 13న జరగనుంది. (AP)

    ఆర్టికల్ షేర్ చేయండి