తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ind Vs Pak: అదరగొట్టిన పంత్.. బుమ్రా సూపర్ బౌలింగ్.. ఆఖర్లో చేతులెత్తేసిన పాక్: మ్యాచ్‍లో హైలైట్స్ ఇవే

IND vs PAK: అదరగొట్టిన పంత్.. బుమ్రా సూపర్ బౌలింగ్.. ఆఖర్లో చేతులెత్తేసిన పాక్: మ్యాచ్‍లో హైలైట్స్ ఇవే

10 June 2024, 8:43 IST

IND vs PAK T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‍లో పాకిస్థాన్‍పై భారత్ అద్భుత విజయాన్ని సాధించింది. 119 పరుగుల స్వల్ప స్కోరును కాపాడుకొని గెలిచింది. ఈ మ్యాచ్‍లో ముఖ్యమైన విషయాలు ఇవే.

  • IND vs PAK T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‍లో పాకిస్థాన్‍పై భారత్ అద్భుత విజయాన్ని సాధించింది. 119 పరుగుల స్వల్ప స్కోరును కాపాడుకొని గెలిచింది. ఈ మ్యాచ్‍లో ముఖ్యమైన విషయాలు ఇవే.
టీ20 ప్రపంచకప్ 2024 మెగాటోర్నీలో పాకిస్థాన్‍పై టీమిండియా విజయం సాధించింది. బ్యాటింగ్‍లో విఫలమైనా బౌలింగ్‍లో సత్తాచాటి చిరకాల ప్రత్యర్థి పాక్‍ను చిత్తుచేసింది. ఓడిపోతుందనుకున్న దశ నుంచి అద్భుతంగా పుంజుకొని పాకిస్థాన్‍ను కుప్పకూల్చింది. న్యూయార్క్ వేదికగా ఆదివారం (జూన్ 9) జరిగిన ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. పాక్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 113 పరుగులు చేసి ఓటమి పాలైంది. టీమిండియా ఆరు పరుగుల తేడాతో గెలిచింది.  
(1 / 7)
టీ20 ప్రపంచకప్ 2024 మెగాటోర్నీలో పాకిస్థాన్‍పై టీమిండియా విజయం సాధించింది. బ్యాటింగ్‍లో విఫలమైనా బౌలింగ్‍లో సత్తాచాటి చిరకాల ప్రత్యర్థి పాక్‍ను చిత్తుచేసింది. ఓడిపోతుందనుకున్న దశ నుంచి అద్భుతంగా పుంజుకొని పాకిస్థాన్‍ను కుప్పకూల్చింది. న్యూయార్క్ వేదికగా ఆదివారం (జూన్ 9) జరిగిన ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. పాక్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 113 పరుగులు చేసి ఓటమి పాలైంది. టీమిండియా ఆరు పరుగుల తేడాతో గెలిచింది.  (AP)
భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా 4 ఓవర్లలో కేవలం 14 పరుగులే ఇచ్చి మూడు కీలకమైన వికెట్లు తీసుకున్నాడు. పాక్‍ను దెబ్బ తీశాడు. 15, 19వ ఓవర్లలో చేరో మూడు పరుగులు మాత్రమే ఇచ్చి పాకిస్థాన్‍ను కట్టడి చేశాడు. బుమ్రాకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
(2 / 7)
భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా 4 ఓవర్లలో కేవలం 14 పరుగులే ఇచ్చి మూడు కీలకమైన వికెట్లు తీసుకున్నాడు. పాక్‍ను దెబ్బ తీశాడు. 15, 19వ ఓవర్లలో చేరో మూడు పరుగులు మాత్రమే ఇచ్చి పాకిస్థాన్‍ను కట్టడి చేశాడు. బుమ్రాకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.(AP)
భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఈ మ్యాచ్‍లో అదరగొట్టాడు. బ్యాటింగ్ కష్టంగా ఉన్న పిచ్‍పై మిగిలిన వారు విఫలమైనా.. అతడు దుమ్మురేపాడు. 31 బంతుల్లో ఆరు ఫోర్లతో 42 పరుగులు చేశాడు పంత్. అలాగే, వికెట్ కీపింగ్‍లోనూ మూడు సూపర్ క్యాచ్‍లను అందుకున్నాడు. 
(3 / 7)
భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఈ మ్యాచ్‍లో అదరగొట్టాడు. బ్యాటింగ్ కష్టంగా ఉన్న పిచ్‍పై మిగిలిన వారు విఫలమైనా.. అతడు దుమ్మురేపాడు. 31 బంతుల్లో ఆరు ఫోర్లతో 42 పరుగులు చేశాడు పంత్. అలాగే, వికెట్ కీపింగ్‍లోనూ మూడు సూపర్ క్యాచ్‍లను అందుకున్నాడు. (Getty Images via AFP)
పంత్ మినహా మిగిలిన బ్యాటర్లు విఫలమవటంతో ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది. టీ20ల్లో పాక్‍పై ఆలౌటవడం టీమిండియాకు ఇదే తొలిసారి. టీ20 ప్రపంచకప్‍లో ఆ జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు. ఓ దశలో 89 పరుగులకు మూడు వికెట్లే కోల్పోగా.. ఆ తర్వాత వరుసగా వికెట్లు చేజార్చుకుంది భారత్. ఆఖరి 30 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి 119 పరుగులకే చాపచుట్టేసింది. పాక్ బౌలర్లలో నసీమ్ షా, హరిస్ రవూఫ్ చెరో మూడు, మహమ్మద్ ఆమిర్ రెండు వికెట్లతో రాణించారు.  
(4 / 7)
పంత్ మినహా మిగిలిన బ్యాటర్లు విఫలమవటంతో ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది. టీ20ల్లో పాక్‍పై ఆలౌటవడం టీమిండియాకు ఇదే తొలిసారి. టీ20 ప్రపంచకప్‍లో ఆ జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు. ఓ దశలో 89 పరుగులకు మూడు వికెట్లే కోల్పోగా.. ఆ తర్వాత వరుసగా వికెట్లు చేజార్చుకుంది భారత్. ఆఖరి 30 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి 119 పరుగులకే చాపచుట్టేసింది. పాక్ బౌలర్లలో నసీమ్ షా, హరిస్ రవూఫ్ చెరో మూడు, మహమ్మద్ ఆమిర్ రెండు వికెట్లతో రాణించారు.  (Surjeet Yadav)
120 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‍ను భారత బౌలర్లు కుప్పకూల్చారు. ఓ దశలో 10 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 57 పరుగులు చేసింది పాక్. దీంతో పటిష్ట స్థితిలో నిలిచింది. ఆ తర్వాత భారత బౌలర్లు విజృంభించారు. చివరి 30 బంతుల్లో పాక్ విజయానికి 37 పరుగులు చేయాల్సి వచ్చింది. ఆ తరుణంలో జస్‍ప్రీత్ బుమ్రా సహా భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి పాకిస్థాన్‍ను కట్టడి చేశారు. దీంతో పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. పరుగులు చేసేందుకు నానా తంటాలు పడి ఓటమి చవిచూశారు. మహమ్మద్ రిజ్వాన్ (31) పాక్‍కు టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టీ20ల్లో భారత్ డిఫెండ్ చేసుకున్న అత్యల్ప స్కోరు ఇదే.  
(5 / 7)
120 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‍ను భారత బౌలర్లు కుప్పకూల్చారు. ఓ దశలో 10 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 57 పరుగులు చేసింది పాక్. దీంతో పటిష్ట స్థితిలో నిలిచింది. ఆ తర్వాత భారత బౌలర్లు విజృంభించారు. చివరి 30 బంతుల్లో పాక్ విజయానికి 37 పరుగులు చేయాల్సి వచ్చింది. ఆ తరుణంలో జస్‍ప్రీత్ బుమ్రా సహా భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి పాకిస్థాన్‍ను కట్టడి చేశారు. దీంతో పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. పరుగులు చేసేందుకు నానా తంటాలు పడి ఓటమి చవిచూశారు. మహమ్మద్ రిజ్వాన్ (31) పాక్‍కు టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టీ20ల్లో భారత్ డిఫెండ్ చేసుకున్న అత్యల్ప స్కోరు ఇదే.  (PTI)
జస్‍ప్రీత్ బుమ్రా మూడు వికెట్లతో అదరగొట్టగా..హార్దిక్ పాండ్యా 4 ఓవర్లలో 24 రన్స్ ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ 2 ఓవర్లలో 11 రన్స్ ఇచ్చి ఓ వికెట్ తీస్తే.. జడేజా రెండు ఓవర్లో 10 పరుగులే ఇచ్చాడు. అర్షదీప్ సింగ్ ఓ వికెట్ తీశాడు. సిరాజ్ వికెట్ తీయకపోయినా 4 ఓవర్లలో 19 పరుగులే ఇచ్చి పాకిస్థాన్‍ను కట్టడి చేయడంలో సహకరించాడు. మొత్తంగా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి భారత్‍ను గెలిపించారు.
(6 / 7)
జస్‍ప్రీత్ బుమ్రా మూడు వికెట్లతో అదరగొట్టగా..హార్దిక్ పాండ్యా 4 ఓవర్లలో 24 రన్స్ ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ 2 ఓవర్లలో 11 రన్స్ ఇచ్చి ఓ వికెట్ తీస్తే.. జడేజా రెండు ఓవర్లో 10 పరుగులే ఇచ్చాడు. అర్షదీప్ సింగ్ ఓ వికెట్ తీశాడు. సిరాజ్ వికెట్ తీయకపోయినా 4 ఓవర్లలో 19 పరుగులే ఇచ్చి పాకిస్థాన్‍ను కట్టడి చేయడంలో సహకరించాడు. మొత్తంగా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి భారత్‍ను గెలిపించారు.(AP)
టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‍ల్లోనూ భారత్ విజయం సాధించింది. గ్రూప్-ఏలో టాప్‍కు చేరింది. తర్వాత అమెరికాతో జూన్ 12న న్యూయార్క్ వేదికగానే భారత్ ఆడనుంది. 
(7 / 7)
టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‍ల్లోనూ భారత్ విజయం సాధించింది. గ్రూప్-ఏలో టాప్‍కు చేరింది. తర్వాత అమెరికాతో జూన్ 12న న్యూయార్క్ వేదికగానే భారత్ ఆడనుంది. (PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి