తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ind Vs Pak Cwc 2023: ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌లో విజేతను తేల్చేవి ఈ ఐదు అంశాలే

IND vs PAK CWC 2023: ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌లో విజేతను తేల్చేవి ఈ ఐదు అంశాలే

14 October 2023, 9:57 IST

IND vs PAK CWC 2023: ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌లో విజేతను తేల్చేవి ఈ ఐదు అంశాలే. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం పిచ్, వాతావరణంతోపాటు టీమిండియా ప్లేయర్స్ గిల్, రోహిత్, కోహ్లి.. పాక్ ప్లేయర్స్ బాబర్, రిజ్వాన్, షహీన్ లపైనే అందరి కళ్లూ ఉన్నాయి.

  • IND vs PAK CWC 2023: ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌లో విజేతను తేల్చేవి ఈ ఐదు అంశాలే. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం పిచ్, వాతావరణంతోపాటు టీమిండియా ప్లేయర్స్ గిల్, రోహిత్, కోహ్లి.. పాక్ ప్లేయర్స్ బాబర్, రిజ్వాన్, షహీన్ లపైనే అందరి కళ్లూ ఉన్నాయి.
IND vs PAK CWC 2023: ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌ అంటే అందరి కళ్లూ విరాట్ కోహ్లిపైనే ఉంటాయనడంలో సందేహం లేదు. అందులోనూ అతడు టాప్ ఫామ్ లో ఉన్నాడు. దీంతో ఈ కీలకమైన మ్యాచ్ లో అతడు ఎలా రాణిస్తాడన్నదానిపైనే ఇండియా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయనడంలో సందేహం లేదు.
(1 / 5)

IND vs PAK CWC 2023: ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌ లో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ కీలకపాత్ర పోషించనున్నారు. ఈ స్పిన్నర్లు ఈ మధ్యకాలంలో భారత విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. అహ్మదాబాద్ పిచ్ ను వీళ్లు ఎంత వరకూ సద్వినియోగం చేసుకుంటారో చూడాలి. పాకిస్థాన్ స్పిన్ తో పోలిస్తే ఇండియా స్పిన్ పటిష్టంగా ఉంది.
(2 / 5)

IND vs PAK CWC 2023: ఇండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్.. పాక్ పేస్ బౌలర్లు షహీన్ అఫ్రిది, అసద్ రౌఫ్, హసన్ అలీలను ఎలా ఎదుర్కొంటారన్నది కీలకంగా మారింది. గిల్ వరల్డ్ కప్ లో తొలి రెండు మ్యాచ్ లలోనూ డెంగ్యూ కారణంగా ఆడలేదు. అతడు నేరుగా పాకిస్థాన్ తో మ్యాచ్ బరిలో దిగుతుండటంతో అందరి కళ్లూ అతనిపైనే ఉన్నాయి. మరోవైపు రోహిత్.. ఆఫ్ఘనిస్థాన్ తో మ్యాచ్ లో మెరుపు సెంచరీతో గాడిలో పడ్డాడు.
(3 / 5)

IND vs PAK CWC 2023: పాకిస్థాన్ పేస్ బౌలర్ షహీన్ షా అఫ్రిది వాళ్ల టీమ్ కు చాలా కీలకమని చెప్పొచ్చు. గతంలో అతడు రోహిత్ తోపాటు టీమిండియా టాపార్డర్ ను ఇబ్బంది పెట్టాడు. అయితే ఈ మధ్య కాలంలో షహీన్ ఆ స్థాయిలో ప్రభావం చూపడం లేదు. వరల్డ్ కప్ లో చరిత్ర తిరగరాయాలంటే మాత్రం పాకిస్థాన్ కు షహీన్ ఫామ్ చాలా ముఖ్యం.
(4 / 5)

IND vs PAK CWC 2023: ఇక పాకిస్థాన్ జట్టులో మరో ఇద్దరు కీలకమైన ప్లేయర్స్ బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్. ఇండియాపై గెలవాలంటే ఈ ఇద్దరు రాణించడం చాలా అవసరం. బాబర్ ఈ వరల్డ్ కప్ లో రెండు మ్యాచ్ లలోనూ విఫలం కాగా.. రిజ్వాన్ మాత్రం మంచి ఫామ్ లో ఉన్నాడు. శ్రీలంకపై సెంచరీతో పాకిస్థాన్ రికార్డు విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు ఇండియాకు పరోక్షంగా ఓ వార్నింగ్ కూడా ఇచ్చాడు.
(5 / 5)
IND vs PAK CWC 2023: ఇక పాకిస్థాన్ జట్టులో మరో ఇద్దరు కీలకమైన ప్లేయర్స్ బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్. ఇండియాపై గెలవాలంటే ఈ ఇద్దరు రాణించడం చాలా అవసరం. బాబర్ ఈ వరల్డ్ కప్ లో రెండు మ్యాచ్ లలోనూ విఫలం కాగా.. రిజ్వాన్ మాత్రం మంచి ఫామ్ లో ఉన్నాడు. శ్రీలంకపై సెంచరీతో పాకిస్థాన్ రికార్డు విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు ఇండియాకు పరోక్షంగా ఓ వార్నింగ్ కూడా ఇచ్చాడు.(PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి